జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 240

లోపల ఇందుతో కాళీ ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క మగాడు నాకు ఎదురు నిలబడలేదు . ఒక ఆడది అయ్యుండి నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ,చూసావా కంప్లైంట్ తీసుకున్న పోలీస్ పరిస్థితి అని అతడిని చూపుతూ వొళ్ళంతా రక్తంతో స్పృహ కోల్పోయే స్థితిలో కట్టివేయబడి ఉన్నాడు. అతడిని కొన్ని రోజులు హింసించి వదిలేస్తాను. కానీ నిన్ను మొదట నేను తరువాత మా వాళ్ళు ఒకరితరువాత ఒకరు నిన్ను వాడుకొని ముంబై బ్రోతల్ కంపెనీ కు ఆ రూమ్ లో ఉన్న అమ్మాయిలతో పాటు అమ్మేస్తాను అంటూ తాగిన మత్తులో వుండి ఇద్దరు రౌడి లను పిలిచి ఆమెను బెడ్ పై పడేయమనగా ఇందు వణుకుతూ భయపడుతూ వాళ్ళ నుండి దూరంగా లేచి పరిగెత్తగా ఇద్దరు గట్టిగా పట్టుకొని ఆమె చెంపలపై గట్టిగా ఒక దెబ్బ వేయగా మోకాళ్ళు నెలకు గట్టిగా తగులుతూ అమ్మ అని పడిపోతుంది.

ఇద్దరు పట్టుకొని పైకి లేపభోగా మోకాళ్ళ నొప్పితో లెవలేక ఇప్పుడు కాకపోయినా ఇంకొన్ని రోజుల్లో నీ అంతం తప్పదు అని బాధతో ఏడుస్తూ కోపంగా అంటుండగా , “నా అంతం, అని గట్టిగా నవ్వి నన్ను అంతం చెయ్యాలంటే ఆ దేవుడే దిగి రావాలి” అని అంటుండగా, ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బిల్డింగ్ పెద్ద ప్రధాన ద్వారం రెండు ముక్కలు అవుతూ కింద పడిపోగానే కోపంతో ఊగిపోతు మహేష్ లోపలికి రాగానే చూసిన ఇందు కళ్ళకు మహేష్ నిజంగా దేవుడు లానే కనిపించగా తననే ఆనంద ఉద్వేగంతో చూస్తూ ఉండగా , రక్తం కారుతున్న ఇందు ముఖం చూడగానే మహేష్ హృదయం పగిలి దుఃఖంతో మోకాళ్లపై కూర్చొని భాధ పడుతుండగా ,మహేష్ వైపు గన్ పెట్టి మైకంతో ఊగిపోతు ఇక్కడకు ఎలా వచ్చార్ర అని గంభీరంగా అడగగా అతని ముందుకు వేగంగా నడుస్తుండగా ఊగుతున్న చేతులతో గన్ కాలుస్తుండగా వాటిని తప్పించుకుంటూ వెళ్లి అతడి నుండి గన్ లాక్కొని రెండు మోకాళ్ళపై రెండు బుల్లెట్లు కాల్చి అతడు నొప్పితో గట్టిగా అరుస్తుండటంతో మిగతా ఆరుగురు ఆకు రౌడి లు తన వైపు కొట్టడానికి వస్తుండటంతో వెంటనే సాగర్ లోపలికి వచ్చి ఇద్దరిని తన వైపు లాక్కొని ఇద్దరిని ఎడాపెడా వాయించగా, మహేష్ వైపు వస్తున్న మరో ఇద్దరి ముఖాలపై రక్తం వచ్చేలా కొడుతూ ఉండగా అది చూసిన మిగిలిన ఇద్దరు ఇందుని వదిలి బయటకు పారిపోతుండటంతో అక్కడ టేబుల్ పై ఉన్న రెండు బీర్ bottle లను వెంట వెంటనే విసరగా వాళ్ళ తలలు పగల కొట్టగా అక్కడికక్కడే కూలబడతారు.

మోకాళ్లపై దెబ్బ తగిలినందువల్ల నిలబడలేక స్పృహ తప్పి పడిపోతున్న ఇందు ను పరిగెత్తుకెళ్లి పట్టుకొని ఆమెను నిదానంగా ఎత్తుకొని బెడ్ పై పడుకోబెట్టి , నీళ్లు ఉన్న bottle తీసుకొని సున్నితంగా ఆమెకు నొప్పి పుట్టకుండా ముఖంపై ఉన్న రక్తాన్ని తన kerchief తో తుడుస్తూ ఉండగా కొద్దిగా మెలకువ వచ్చి మహేష్ తో ఎలా ప్రవర్తించాలో అంతుపట్టక కళ్ళు తెరవడానికి కూడా బలం లేక నొప్పిగా ఉన్న కొద్దిగా తెరిచి మసక మసకగా మహేష్ ను చూస్తూ ఉండిపోతుంది.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.