జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 232

మహేష్ మనం దానిగురించే మాట్లాడుకోవాలి , అంతకుముందు మొదట మనం బ్రేక్ ఫాస్ట్ చేద్దాం అని ఆమె తెచ్చిన బ్యాగ్ లోనుండి ఆమె స్వయంగా వండిన పూరి కుర్మా ను ఇద్దరికి వడ్డించి తినమని చెప్పగా , నాకు ఆకలిగా ఉందని మీకెల తెలుసు అని అడగగా , నువ్వు బ్రేక్ ఫాస్ట్ మాత్రమే కాదు రాత్రి కూడా తిని ఉండవు అని చెప్పగా ,మహేష్ ఆశ్చర్యంతో ఎలా అని అడగగా నిన్నంత నీతో మాట్లాడకపోవడం వల్ల నేను కూడా రాత్రి నుండి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు , అలాగే నా మనసుకు తెలుసు నువ్వు కూడా ఖచ్చితంగా తిని ఉండవని అని చెప్పేసరికి ఒక్కసారిగా మహేష్ కళ్ళల్లో నీళ్ళు మిక్కిలి సంతోషంతో ఆనంద భస్పాలు కారుతుండగా ఇందు ముందుకు వచ్చి మహేష్ ఎదపై తల ఆంచి గట్టిగా కౌగిలించుకుంటుంది.

మహేష్ సున్నితంగా ఆమె తల ఎత్తి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ love you అని చెప్పి నుదిటి పై ఘాడంగా ముద్దుపెట్టి తన కడుపుపై చెయ్యి వేసి నాకు చాలా ఆకలిగా ఉంది అని అనేసరికి ఇద్దరు గట్టిగా నవ్వుతూ బెడ్ పై కూర్చొని తింటూ తన వేళ్ళతో సూపర్ అని చూపిస్తూ ఎక్కిళ్ళు వచ్చేనెతగా తినసాగాడు. ఇందు కూడా ఆకలితో త్వరత్వరగా తినసాగింది. ఇందు తెచ్చిన మొత్తం పూరీలను తినేసి చేతులు కడుక్కొని శుభ్రన్గా తుడిచి కూర్చోగా, ఇందుకు ఆమె వచ్చిన పని గుర్తుకు వచ్చి ఊపిరి బిగపెట్టుకొని ఒక్కసారిగా అరుస్తున్నట్టుగా అడగకుండా తన దగ్గర ప్రశాంతంగా ప్రవర్తించాలి అనుకుంటుంది.

ఏదో ఒకటి మాట్లాడాలని మహేష్ “ఇందు గారు కూల్ డ్రింక్ ఏదైనా తీసుకుంటారా అని అడగగా?.” ఇందు రెండు చేతులు కట్టుకొని అతన్ని సూటిగా చూస్తూ ఏవిధంగా మొదలుపెట్టాలా అని ఆలోచిస్తుంటే , ఇందు ఏమి జరిగింది చెప్పండి?. అని అడగగా, ఆమె కట్టుకున్న చేతులను వదిలేసి తన హాండ్ బ్యాగ్ లోని పర్సు ను చూపిస్తూ ఇది నిన్న రాత్రి మా ఇంటిలో వదిలి వచ్చేసారు అని చెప్పగా, మహేష్ వణుకుతున్న చేతులతో దానిని తీసుకొని బెడ్ పై పక్కన పడేసి, ఇది అక్కడే వదిలేసాను లేచిన దగ్గరి నుండి వెతుకుతూనే ఉన్నాను, Thank you ఇందు గారు.

ఇది లేకుండా ఎక్కడికి వెళ్లలేను అని ఆమె ముఖం లోకి చూడగా, ఇందు చిన్నగా భాధ పడుతూ కళ్ళల్లో నీరు కారుస్తూ , ఎందుకు నా దగ్గర నీ వయసు గురించి అపద్ద0 చెప్పావు మహేష్ ? , నీ వయసు 23 అని చెప్పావు కానీ నీ పర్సు లోని డ్రైవింగ్ లైసెన్స్ నీ వయసు 18 అని చెబుతోంది. అది విన్న మహేష్ కు దానికి ఎలా సమాధానమివ్వాలో తెలియక ఇందు ఏమి జబాబు ఇస్తాడో అని వేచి చూడగా ఆమె ముందు నిశ్శబ్దనంగా నిలబడిపోతాడు.మహేష్ చేతిలో ఇందు చెయ్యి వేసి నీవు ఏది చెప్పిన నాకు మాత్రం నీ నుండి నిజాయితీ గల సమాధానం కావాలి అని ఇందు బాధగా ఆడిగేసరికి, ఇంత కంటే మంచి సమయం దొరకదని ,ఇందుతో ఇక అపద్ద0 చెప్పకూడదని నిర్ణయించుకొని , ఇందు గారు మీకు సూటిగా ఒకటి చెప్పదలుచుకున్నాను కానీ అది విని దయచేసి నన్ను ద్వేషించకండి నేను తట్టుకోలేను. నేను మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు ఇంత దూరం వెళ్తుందని అస్సలు అనుకోలేదు.

అదే నేను మీ ప్రేమలో పడటం మరియు మీరు నన్ను ఇష్టపడటం. నాకు నిజంగా భయంగా ఉంది నేను చెప్పబోయే విషయం గురించి మీరు ఏ విధంగా ఆలోచిస్తారు , రియాక్ట్ అవుతారా అని. మహేష్ చెప్తున్న విధానం చూస్తుంటే ఇందు నెర్వస్ గా ఫీల్ అయ్యి ఏమి రహస్యం చెప్తాడో అని తననే దీర్ఘన్గా చూస్తూ , అతడి వయస్సు తక్కువే కానీ ఏ విషయాన్నైనా ఆలోచించే maturity మరియు లీగల్ వయసు కలవాడు. అతడు చెప్పే ఏ రహస్యమైన అంత మరి దారుణంగా ఉండదని మనసులో అనుకుంటుంది.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.