జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 240

ఈ కాళీ గాడి వల్ల మీరందరు చాలా ఇబ్బందులు పడ్డారు కావున మీకు ఎంత డబ్బు , ఎన్ని నగలు కావాలో మీ ఇష్టం వచ్చినన్ని తీసుకోండి అనగానే అందరి అమ్మాయిల ముఖాలు సంతోషంతో వెలిగిపోతు ఒకరముఖాలు మరొకరు చూసుకుంటుండగా కానివ్వండి అని ముగ్గురు ఒకేసారి అనగా అందరూ బంగారు నగలు ఉన్న దగ్గరికి చేరి మాకు డబ్బు వద్దు నగలు మాత్రమే తీసుకుంటామని ఎవరికి నచ్చినవి వారు తీసుకుంటుండగా ,అయితే డబ్బును ఎం చేద్దాం అని సాగర్ మహేష్ ను అడగగా ఇప్పటికే సమయం 9 అవుతోంది కావున ముందు ఇక్కడనుండి వెళ్లడం మంచిది కావున బయట మూడు కార్లు ఉన్నందువల్ల మిగిలిన డబ్బు , బంగారం మరియు బ్యాంక్ పుస్తకాలుఅన్నిటిని ఓమ్ని లో పెట్టి రేపు మనం కలిసి వాటి గురించి ఆలోచిద్దాం అని చెప్పి ,

ఆ అమ్మాయిల ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ ను BIG G షాపింగ్ మాల్ దగ్గరకు రమ్మని చెప్పమని సాగర్ మరియు మహేష్ ఫోన్ లు ఇవ్వగా ఒక్కొక్కరు వాలా ఇళ్లకు ఫోన్ చెయ్యగా 10 నిమిషాల్లో అక్కడ ఉంటామని చెప్పగా అంతలోపల ముగ్గురు కలిసి డబ్బును ,బంగారాన్ని మరియు మిగిలిన వాటిని ఓమ్ని లో సర్ది , ఒక కార్ డిక్కీలో కాళీ గాడిని వేసి అందరూ బయటకు భయలుదేరగా చివరగా మహేష్ ఇందుని ఎత్తుకోవడానికి కిందకు వొంగి ఒక చేతిని వీపు వెనక మరో చేతిని కాళ్ళ కింద వేసి ఎత్తుకొంటుండగా ఇందు చిన్నగా కళ్ళు తెరిచి మహేష్ బుగ్గపై ముద్దు పెట్టి వెంయనే కళ్ళుమూసుకుని ఏమి తెలియని దానిలా ఉండిపోగా మహేష్ ఆమెను చూడగా కళ్ళుమూసుకుని ఉలుకు పలుకు లేకుండా ఉండటంతో అంత నా భ్రమ అని చిన్నగా గొనగడంతో విన్న ఇందు తనలో తాను బయటకు కనిపించకుండా నవ్వుతుంది…..

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 2 »

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.