జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 240

అన్ని కేస్ ఫైల్స్ లలో అతడివి చాలా అడ్రస్ ప్రూఫ్స్ ఉండటంతో ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం మొత్తం పరిశీలించి ఏకాగ్రతతో ఆలోచించి గా మారుతి ఏ దిశలో వెళ్లిందో ఆ దిశలో అతడు ఇచ్చిన అడ్రస్ లను వేతకగా మూడు మాత్రమే మిగులుతాయి కావున వీటిలో ఎక్కడో ఒక ప్రదేశంలో పెట్టి ఉంటారని ఇద్దరు తన కారులో భయలుదేరుతారు. మారుతి ఓమ్ని పడమర దిశగా వెళ్లిందని ఆ దిశలో ఉండే అతడి రహస్య ప్రదేశాలలో మొదటి దానిని ఎంచుకొనగా అది ఊరి చివరగా ఉన్న ఒక పెద్ద పాలస్ బయటకు దిగి చూడగా పాలస్ మూసి ఉండటంతో లోపలేమైన ఉంటారేమోనని గేట్ దూకి మొత్తం చూడగా ఒక్కరు కూడా ఉండకపోవడంతో రెండవ ప్రదేశానికి భయలుదేరుతారు.

అది బీచ్ పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ దానికి కాపలాగా ఒక watchman తప్ప ఎవ్వరు లేకపోవడంతో నిరాశ కలిగి ఇందు ఇప్పుడు ఏ పరిస్థితులలో ఉందొ తెలియక బాధపడుతూ ఉండగా తనతో ఉన్న వ్యక్తి కూడా ఇక ఆ మూడవ ప్రదేశంలో కూడా ఉండకపోతే నా చెల్లెలిని వాడు పాడు చేసి బ్రోతల్ లకు అమ్మేస్తాడేమోనని కన్నీళ్లు పెట్టుకోగా తన తల్లిని కూడా అలానే చేస్తాడేమో అని భయపడతారు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆ ప్రదేశానికి భయాలు దేరుతాడు . అలా హైవేపై పై 20 నిమిషాలు వెళ్లగా ఎడమవైపున చాలా దట్టమైన చెట్ల మధ్యన చిన్న మట్టి దారి లోపలకు వెళ్ళడానికి ఉంది .

అలా ఆ దారి వెంట ఒక గంట ప్రయాణం చెయ్యగా అప్పటికే చీకటి పడుతుండగా కారు హెడ్ లైట్స్ వెలుగులలో నిదానంగా కారుని పోనివ్వగా చాలా దూరం నుండి ఇంటిలోపాల లైట్స్ వెలుగుతున్న బిల్డింగ్ కనపడగానే కార్ లైట్స్ ఆపివేసి ,కారును దారిపక్కన కొద్దిగా ముందుకు పోనిచ్చి చుట్టూ పొదలు ఉండే ప్రదేశంలో విడిచి కారుపై చెట్ల ఆకుల కొమ్మలను విరగా కొట్టి కనబడకుండా దాస్తారు. కారులో నుండి చిన్న టార్చ్ తీసుకొని మట్టి దారికి పక్కనే ఉన్న పాదాలను దాటుకుంటూ బిల్డింగ్ దగ్గరకు వెళ్లి చూడగా బయట అంత చిందర వందరగా ఉంది లోపల మాత్రం చాలా లైట్స్ వెలుగుతూ ఉన్నాయి.

బయట కాంపౌండ్ గేట్ దగ్గర ఇద్దరు దున్నపోతుళ్ళ ఉంది పొడుగాటి కట్టెలు పట్టుకొని కాపలా కాస్తున్నారు . వెనకనుండి వెళ్దామనుకొంటే బిల్డింగ్ చుట్టూ దట్టంగా మూళ్ళ చెట్లు ఏపుగా పెరిగి అడుగు వేయడానికి కూడా వీలు లేనంతగా ఉన్నాయి . లోపలకు వెళ్ళడానికి ఉన్న ఒకేఒక దారి కాపలా కాస్తున్న గేట్ ద్వారానే. ఇప్పుడు ఏమి చెయ్యాలి అని అతడి వంక చూస్తూ అసలు మీపేరు కూడా అడగలేదు అనగా, నా పేరు సాగర్ మాది గోవా పక్కన చిన్న ఊరు అని చెప్పగా నా పేరు మహేష్ అని చెబుతూ , దూరం నుండి గేట్ కు ఉన్న సంధులలో నుండి తను మధ్యాహ్నం చూసిన మారుతి ఓమ్ని మరియు రెండు ఖరీదైన కార్లు మరియు పోలీస్ జీప్ కూడా ఉన్నాయి .

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.