జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 231

హమ్మాయ్య కిడ్నప్ కాబడిన వారందరు ఇక్కడే ఉంది ఉండవాచ్చు సాగర్ గారు అని చెప్పగా ,సాగర్ అని పీలవండి చాలు అని లోపలకు వెళ్లడం ఎలా అని మార్గం కోసం ఆలోచించసాగారు. అంతలోపే ఒకడు మిగతా వాడితో piss గుర్తు చూపిస్తూ మేమున్న పొదలవైపు రావడం చూసి అంతకంటే అదృష్టం ఏముంటుందని నవ్వుతూ ఉండగా సాగర్ ఇక్కడనుంది వెళ్దాము అని అంటుండగా చిన్న నవ్వు నవ్వి లావుగా ఉన్న చెట్టు వెనుక నిలబడి అతడు రాగానే ఒక్కటే దెబ్బ ముఖంపై గట్టిగా కొట్టేసారికి దబ్ మని కింద పడిపోగా సాగర్ మహేష్ ను ఆశ్చర్యంగా సూపర్ అంటుండగా కింద పడినవాడి షర్ట్ తీసి మహేష్ కు ఇచ్చి పొదల తీగలతో కట్టి నోటిలోకి తనతో ఉన్న కెర్చీఫ్ తురికి ఇక వేళ్ళు అనగా, ఆ షర్ట్ వేసుకొని కింద పడిన కట్టిని తీసుకొని చిన్నగా నడుచుకుంటూ వెళ్లి అక్కడ కాపలా కాస్తున్న వాడి తలపై ఒక్క దెబ్బ వేయగా అబ్బా అని అరిచేలోపు స్పృహ తప్పి పడిపోతాడు .

సాగర్ పరిగెత్తుకుంటూ వచ్చి సారా సారా లాక్కొని వెళ్లి వాడి స్నేహితుడి పకజనే అదేవిధంగా కట్టేస్తారు. వాడి షర్ట్ కూడా తీసి వేసుకొని మహేష్ దగ్గరకు రాగా . గేట్ లోపలికి తొంగి చూడగా బిల్డింగ్ కు ఉన్న పెద్ద వాకిలి దగ్గర అదేవిధంగా ఇద్దరు కాపలా కాస్తున్నారు. చిన్నగా గేట్ తెరిచి లోనకు నెమ్మదిగా వెళ్తుండగా చీకటిలో వారికి తమ ముఖాలు కనిపించక పోయేసరికి ఎక్కడికి అని ఆడిగేసరికి వాటర్ అని symbal చూపిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు గమనించేలోపు ఇద్దరు ఒకేసారి వాళ్ళిద్దరి మూతి మూసి వెనకనుండి గట్టిగా పట్టుకొని కడుపులో గుద్దుతూ తల తిప్పేయగా అక్కడికక్కడే కింద పడిపోగా మహేష్ ,సాగర్ లు ఇద్దరు ఒక చేతిని పైకి ఎత్తి శభాష్ అని కొడుతూ టారువత్త ఏమి చెయ్యాలో ఆలోచించసాగారు.

ఇద్దరు చెరొక వైపు బిల్డింగ్ చుట్టూ గమనిస్తే లోపలికి వెళ్ళడానికి మార్గం దొరక వచ్చు అని జాగ్రత్తగా ,నెమ్మదిగా చుట్టూ చూస్తుండగా వెనుక వైపు ఇద్దరు కలుసుకోగా లోపల నుండి ఆడపిల్లల ఏడుపులు వినిపించగా కిటికీ సందులోనుంది చూడగా ఒక 10 మంది యువతులు కాళ్ళు చేతులు కట్టేసి చీకటిలో ఉంచారు. పక్కనే ఉన్న హాల్ లోనుండి గట్టిగా అరుస్తున్న ఇందు శబ్దం వినబడటంతో మహేష్ హృదయం ఒక్కసారిగా తన తల్లికి ఏమి జరిగిందో అని చలించగా కొద్దిగా పైకి ఎక్కి లోపలికి వెంటిలేటర్ ద్వారా చూడగా లోపల పెద్ద హాల్ మొత్తం ఖరీదైన వస్తువులతో అలంకరించబడి ఒక పాక బార్ , మరో పక్క పెద్ద బెడ్ ఉంది.

దానిపై పెద్ద పెద్ద మీసాలు ఉన్న నల్లటి లావుగా పందిలాగా ఉన్న ఒక వ్యక్తి మందు తాగుతూ ఒక చేతిలో గన్ పెట్టుకొని గట్టిగా నవ్వుతూ ఎదురుగా ఎవరితోనో మాట్లాడుతున్నాడని పక్కకు చూడగా నోటి పక్కన మరియు నుదితిపై రక్తంతో ఎవరో కొట్టినట్లుగా ఏడుస్తూ చేతులు కట్టివేయబడి ఉన్న ఇందుతో ఆ వ్యక్తి నాకే నోటీస్ పంపుతావ ఇప్పుడు నిన్ను ఎం చేస్తానో చూడు అని ఈ బెడ్ నీకోసమేనే ఎదురు చూస్తోంది అని అంటుండగా అది విన్న మహేష్ కోపంతో అల్లడిపోతు అతడే కాళీ అని నిర్ధారించుకొని అతన్ని చంపేయాలి అని అనుకోని తన తల్లిని ఆ పరిస్థితుల్లో చూసి చలించిపోతు తట్టుకోలేక సింహం లా తన ప్రాణాలు పోయిన ఆమెను రక్షించుకోవాలని ముందు వైపుకు వెళతాడు.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.