జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 232

తరవాతి రోజు మధ్యాహ్నం వరకు మహేష్ నుండి ఎటువంటి కాల్స్ రాకపోవడంతో, విరహ వేదనతో తనే స్వయంగా మహేష్ స్టే చేసే హోటల్ రూమ్ కు కాల్ చేస్తుంది. అది మొగుతున్నంత సేపు ఫోన్ ను గుడ్డిగా చూస్తూ ఉండిపోతాడు. ఫోన్ మొగడం ఆగిపోయిన వెంటనే హోటల్ రిసెప్షన్ కు కాల్ చేసి తనకు వచ్చే అన్ని కాల్స్ హోల్డ్ లో పెట్టమని చెప్పేస్తాడు. ఎందుకంటే తనకు తెలుసు ఆ కాల్ ఇందు నుండే వచ్చిందని. తను ఆమెతో మాట్లాడటానికి అంత సిద్ధంగా లేడు. తనకు ఆలోచించుకోవడానికి కొంత సమయం అవసరం.

సుమారు ఒక గంట తరువాత హోటల్ రిసెప్షన్ మెంబెర్ వచ్చి తన రూం తలుపు కొత్తగా ఓపెన్ చేస్తే ,

Sorry sir , “(a certain undhi medam has called you more than 20 times in the span of half an hour ,she says it’s very important. I just thought you might know”) ఎవరో ఇందు మేడం అంట మీరు లిఫ్ట్ చేయట్లేదు అని హోటల్ రిసెప్షన్ నెంబర్ కు అర గంటలో 20 సార్లు పైనే చేశారు, ఆమె ఏదో ముఖ్యమైన విషయం అని చెప్పారు. అందుకే మీకు తెలుపుదాం అని వచ్చాను.

“Oh yes thank you. I will call her back right now.” అని అతనికి చెప్పి పంపించేస్తాడు.

మహేష్ ఫోన్ దగ్గరకు నడిచి ,ఫోన్ reciever చేతిలోకి తీసుకొని గట్టిగా ఒక శ్వాసను పీల్చి, ఆ ఫోన్ ను తదేకంగా చూస్తూ , తను ఎలా మాట్లాడాలో నిర్ణయానికి రాకపోవడంతో ఆలోచిస్తూ నిలబడతాడు.

ఇందు మహేష్ హోటల్ కి కాల్ చేయడానికి రీ డయల్ బటన్ నొక్కుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అటు వైపు మహేష్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అంత బాధతో నిరాశ చెందుతోంది. తనే మహేష్ కు ముద్దు పెట్టి అంతా చెడగొట్టానని భాధ పడుతూ, ఒక మంచి మరియు నిజాయితీ పరుడైన యువకుడితో తను తప్పుగా ప్రవర్తించానని ,అతనిని ఇక కలవలెనేమో అని భయపడుతుంది.

ఇక సాయంత్రం వరకు బ్యాంక్ లో ఏ పని సక్రమంగా చేయుటకు మనసొప్పక కొంచెం ముందుగానే అకౌంట్స్ చ్లొసె చేసి, ఇంటికి వెళ్లి స్నానం చేయగా కొద్దిగా మనసు కుదుటపడగా, నైట్ డ్రెస్ వేసుకొని సోఫా లో కూలబడుతూ మహేష్ గురించి తలుచుకుంటూ ఉంటుంది.

తనకు ఎలాగైనా మహేష్ ను ఇప్పటికిప్పుడే చూడాలని ఉంది. నిన్న రాత్రి నుండి మహేష్ తనను పట్టించుకోకుండా , తనే ఫోన్ కాలక్స్ చేసిన ricieve చేసుకోకుండా ఉండేసరికి , అతడు హోటల్ లొనే ఉంటాడని భావించి , అక్కడికే వెళ్లి అతడి ముందే face to face నిలబడి తనను కలవలేకపోవడానికి గల కారణాన్ని నిజాయితీగా అడగాలని నిశ్చయించుకుంటుంది. అలా ఎదగాలంటే కొద్దిగా నెర్వస్ గా ఫీల్ అవుతున్నప్పటికి అడుగు ముందుకు వేయాలనే అనుకొంటుంది. అలా కాకుండా అతడిని మరిచిపోదాం అనుకుంటే అది ఎన్నటికీ సాధ్యపడదు , తను అంతగా అతనికి దగ్గర అయ్యింది.

సోఫా లోనుండి లేచి బ్లూ జీన్స్ మరియు డార్క్ బ్లూ లో కట్ సమ్మర్ sweater వేసుకొని ఎలాగైనా మహేష్ ను కలవాలని బయలుదేరుతుంది.
ఇక్కడ మహేష్ ఫోన్ reciever ను యధాస్థానంలో పెట్టేసి బెడ్ మీద గోడకు అనుకోని సాయంత్రం వచ్చే వార్తలు వింటూ కూర్చున్నాడు. అతడు వేరే ఏదైనా ముఖ్యమైన సమస్య మీద ద్రుష్టి పెడదామనుకుంటే ఇందు కంటే ఏది ముఖ్యమైనదిగా అనిపించడం లేదు. ఆమె కు కాల్ చేయాలని , మాట్లాడాలని తన మనసు చచ్చిపోతోంది. ఆమె మాటలు వినాలని, ఆమె నవ్వును చూడాలని హృదయం తహ తహ లాడుతోంది.ఇంతలో,

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.