జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 2 80

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 1 »

అలాగే ఎత్తుకుంటు వెళ్లి ఓమ్ని ముందు సీట్ లో కూర్చోబెట్టి సేఫ్టీ బెల్ట్ పెట్టి అందరూ అమ్మాయిలు మూడు కార్లలో సర్దుకున్నాక సాగర్ వచ్చి మీ కార్ సంగతేంటి అని అడగగా రేపు వచ్చి తీసుకుందాం అనగా ఎందుకు మళ్ళీ రేపు రావడం నా చెల్లెలికి కార్ డ్రైవింగ్ తెలుసు అనడంతో అయితే ఇంకా మంచిది పద అక్కడివరకు అని మహేష్ కార్ దాచిన దగ్గర ఆపగా సాగర్ మహేష్ ఇద్దరు వెళ్లి పైన కప్పిన చెట్టు కొమ్మలను తీసివేయగా మీరు ఓమ్ని లోరండి నేను ఈ కార్ ను వేసుకు వస్తాను అని సాగర్ అనడంతో ఒక కారును పోలీస్ ,రెండవ కారును సాగర్ చెల్లెలు ,ఓమ్ని ను మహేష్ మరియు మహేష్ కారును సాగర్ నడుపుకుంటు మాల్ కు భయలుదేరుతారు.

దారి మధ్యలో ఇందు తనను ఇంటికి రావొద్దు అని చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఆమెకు తెలిసిన బంధువులు ఎవరైనా ఉన్నరేమో అని ఇందు ఫోన్ లో కాల్ లిస్ట్ చూడగా my best friend అన్నదాని నుండి ఇందు ఫోన్ కు చాలా missed కాల్స్ చేసినట్టుగా ఉండటంతో ఆ నెంబర్ కు కాల్ చెయ్యగా అటువైపు నుండి ఆత్రంగా సాయంత్రం నుండి నీకు కాల్ చేస్తున్నాను ,నీవు ఎత్తకపోయేసరికి ఇంటికి కూడా వెళ్లి వచ్చాను ,ఎక్కడ ఉన్నావు, అంత ok కదా అని వరుసగా అడగడంతో నేను మహేష్ మాట్లాడుతున్నాను ఇందు నా పక్కనే ఉన్నారు అని చెప్పగా ,

oh మహేష్ నువ్వా ఇందు ఎలా ఉంది బానే ఉంది కదా అని అడగగా చిన్న ఆక్సిడెంట్ అయ్యింది మీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉంటే ఇందు ఇంటి దగ్గరికి తీసుకొని రండి నేను ఒక అర గంటలో ఇందు గారిని తీసుకు వస్తున్నాను అని చెప్పగా , ఎలా అయ్యింది అని భయపడుతూ నాకు తెలిసిన పెద్ద హాస్పిటల్ ఉంది అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చేయి మని చెప్పగా , అక్కడికి వెళ్తే అందరికి తెలిసిపోయి జనాలు ఏదేదో అనుకుంటారు అని అనుకోని ,పెద్ద దెబ్బలేమి తగల లేదు ఎవరైనా చిన్న డాక్టర్ ఉంటే చాలు అని అనగా నా ఫ్రెండ్ ఒకామె ఉంది పిలిచుకొని వెంటనే వస్తాను అని అనగా వేగంగా మాల్ దగ్గరకు చేరుకొని అందరి అమ్మాయిల బంధువులు రావడంతో వాళ్ళ వాళ్ళను కౌగిలించుకుంటు ఏడుస్తూ ఉండగా వారి నగలను వారికి ఇచ్చివేసి పోలీస్ దగ్గరకు వెళ్లి ఇంయ్హకి మీ పేరు అని అడగగా విక్రమ్ అని చెప్పగా , విక్రమ్ గారు ఈ కాళీ గాన్ని మీ చట్ట ప్రకారం శిక్ష పడేలా చెయ్యమనగా ఇక వీడికి చిప్పకుడే అని చెప్తూ రేపు మీ స్టేషన లో కలుస్తాను అని చెప్పగా విక్రమ్ పోలీస్ స్టేషన్ కు భయలుదేరుతారు.

ఇక మిగిలినది నేను మరియు ఇందు గారు , సాగర్ మరియు సాగర్ చెల్లెలు . సాగర్ మహేష్ దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకొని మీరు లేకుంటే మా ఇంటి దీపానికి వెలుగే ఉండేది కాదు అని తన చెల్లెలిని చూపిస్తూ కృతజ్ఞత చూపుతుండగా నీ సహాయం లేకుండా నేను ఏమి చేసి ఉండేవాన్ని కాదు అని చెప్తూ ఉండగా మరి నీ కార్ ఎక్కడ విడచాలి అని అడగగా మీ ఊరు దగ్గరే అంటున్నారు కదా కార్లో వెళ్లి మనం రేపు కలవాలి కదా అప్పుడు వేసుకొని రండి అని చెప్తూ ఎవరిదారిన వాళ్ళు భయలుదేరుతుండగా ఒక అమ్మాయి మహేష్ నెంబర్ తీసుకొని ఉంటే బాగుండేది అని అనగా పక్కనే ఉన్న అమ్మాయి ఒసేయ్ పిచ్చి మొద్దు ఇంటికి వెళ్లి మీ ఇంటి సెల్ చూడమని చెప్పగా అందరి మైండ్ లలో బుల్బ్ వెలిగి అవును కదా గుర్తే లేదు అని చిన్నగా నవ్వుకుంటారు.

2 Comments

  1. Super and next story post cheyandi please

  2. bro e storey motham kavali bro first nundi last varaku pls replay evvandi

Comments are closed.