జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 2 80

మహేష్ ఇందు ఇంటికి వెళ్ళడానికి ఓమ్ని దగ్గరకు వెళ్లి ఇందు పక్కన ఉన్న డోర్ ను తెరిచి ఇందును చూస్తూ ఉండగా ఆమె జుట్టు చిందర వందర అయ్యి ముఖంపై పది ఉండగా వేళ్ళతో ఆమె చెవి వెనకకు అందామని చేతిని ముఖం వరకు తీసుకువెళ్లి ఒక క్షణం ఆలోచించి తన జేబులో ఉన్న పెన్నుతో వెంట్రుకలను వెనక్కు తోసి నన్ను క్షమించండి ఇందు గారు మీరు నాతో లేకపోతే నా జన్మ సూన్యం అని చిన్నగా మాట్లాడుతూ ,నన్ను తాకావద్దు అన్న మాట మెదడులో నిక్షిప్తమై ఉన్న తన చెయ్యి ఆమెను తాకడానికి తనకు తెలియకుండానే తనకు తాను ఆమె దగ్గరికి లేస్తూనే ఉంది ,

అంతలోనే తన కుడి చెయ్యి ఆమె ముఖం చేపల దగ్గరికి చేరుతుండటంతో ఎడమచేతితో చప్పుడొచ్చేలా ఒక దేబివ వేసి వెనక్కు లాక్కోగా జరుగుతున్నదంత చొన్నగా కళ్ళు తెరిచి చూస్తున్న ఇందు లోలోపల ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండగా లోపల చీకటిగా ఉండటం వల్ల మహేష్ కు కనిపించక చినాగ నవ్వే నవ్వులు వినిపించి తల వొంచి ఆమె పెదాలను చూసి అంత తన భ్రమ అని వెనుక తలపై ఒక దెబ్బ వేసుకొని ఓమ్ని అవతలివైపు వచ్చి స్టార్ట్ చేసి ముందుకు కదాలగానే గేర్ రాడ్ పై ఉన్న తన చేతిపై ఇందు చెయ్యి పడగా సడన్ బ్రేక్ వేయగా ఇందు కళ్ళు మూసుకొని ఉండటంతో ఓమ్ని కుదుపులకు పడినదేమో అని అనుకొని ముందుకు పోనివ్వగా my best friend నుండి కాల్ రావడంతో కాల్ ఎత్తి 15 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పి అప్పటికే 10 దాటడంతో రోడ్ నిర్మానుషయంగా ఉండటంతో 10 నిమిషాల్లో ఇందు ఇంటికి చేరగా బయట జ్యోతి మరియు డాక్టర్ అనుకుంటా తమ కోసమే వేచి చూస్తున్నారు ,

అప్పటికే కాంపౌండ్ గేట్ తీసి ఉండటంతో ఇంటి ద్వారం వరకు వెళ్లి ఆపగా, ఇందు కూర్చున్న వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చిన జ్యోతి కార్ డోర్ తెరిచి ఇందు ఇందు అని పిలుస్తూ ఎలా జరిగిందే ఇదంతా అంటుండగా డాక్టర్ ఆమెను ఓదార్చి ముందు ఆమెను లోపలికి తీసుకెళ్దాం అని చెప్పగా కీస్ లేకపోవడంతో మహేష్ ఒక పెద్ద రాయిని తీసుకొను తాళం పగలకొట్టి ఇందుని సున్నితంగా ఎత్తికొంటుండగా ఈ సారి ఏకంగా అతడి పెదవులకు ఆమె పెదవులు ఒక్క క్షణం కలవడంతో మహేష్ కు స్వర్గం లో తెలుతున్నట్టుగా అనిపించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమెను ఆమె బెడ్ రూమ్ లోని బెడ్ పై పడుకోబెట్టి సరాసరి ఇంటి బయటకు వచ్చి కాంపౌండ్ లోపల ఉండే చైర్ లో కూలబడతాడు.

2 Comments

  1. Super and next story post cheyandi please

  2. bro e storey motham kavali bro first nundi last varaku pls replay evvandi

Comments are closed.