జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 240

**********
ఇందు ఒక రెస్టౌరెంట్ ను సెలెక్ట్ చేస్తుంది. దాని పేరు “MUM’S KITCHEN” , అది ఒక సౌందర్యమైన ,
ఖరీదైన స్వదేశీ రెస్టౌరెంట్. దానిలోకి ప్రవేశించి ఒక కిటికీ పక్కనే కూర్చుని బయట జనాలు casino లోకి వెళ్లి రావడం చూస్తారు. ఆ రోజు ఆ రెస్టౌరెంట్ లో jazz band ప్రొగ్రమ్ ఉండటంతో అక్కడికి వచ్చిన వారందరు ఆ వినోదాన్ని చూస్తూ ఎంజాయ్ చేయసాగారు.

ఈ రెస్టౌరెంట్ చాలా బాగుంది అని అక్కడ ఉన్న గ్లాస్ లోని నీటిని మహేష్ తాగుతాడు.

అవును, ఇక్కడకు రావడానికి నేను చాలా ఇష్టపడతాను.ఎందుకంటే ఇక్కడికి మొదట్లో జాబ్ వెతుక్కొనేతప్పుడు ఇక్కడే assistant manager గా పని చేసాను. ఇక్కడి ఫుడ్ చాలా బాగుంటుంది అని ఇందు చెప్తుంది.

నిజంగానా ? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మీ తల్లిదండ్రులు కూడా ఈ సిటీ లొనే ఉన్నారా? అని మహేష్ ఆసక్తితో అడగగా,

దానికి ఇందు తల దించుకోగా , మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు క్షమించండి అని మహేష్ వీడ్కోనగా,

ఇందు కొద్దిగా బాధతో మా నాన్న గుండెపోటుతో రెండేళ్ల క్రితమే చనిపోయారు. అని చెప్పగా ,

మహేష్ హృదయం చలించి , మీ నాన్న ను గుర్తు చేసి మిమ్మల్ని భాధపెట్టను నన్ను క్షమించండి అని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొంంటడు.

ఇందు తల ఎత్తి అదేంలేదు కొంత మా నాన్నకు మిస్ అవుతున్నాను, మా తల్లి మాత్రం ముంబై లో ఉంటారు.

మీరు ఎప్పుడైనా మీ తల్లిని మీతో పాటే ఉండమని ఆడిగారా?

ఇందు కొద్దిగా వ్యాకులత చెంది, లేదు. నాకు తెలిసి నేను మా అమ్మ వేరు వేరుగా ఉంటేనే మంచిది అని అనిపిస్తుంది. ఒక వేళ తను తన పనులు తాను చేసుకోలేకపోయినప్పుడు తనను కచ్చితంగా నా ఇంటిలోనే ఉంచుకుంటాను .దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి మేము కొద్దిగా దూరంగానే ఉంటున్నాము.

ఇదంతా గుర్తు చేసినందుకు నన్ను క్షమించండి అని ఇందు చేతిని మెల్లిగా అదుముతున్నాడు .

నాకు తెలుసు , నాకు మా అమ్మతో దగ్గరగా ఉండాలని కోరిక, కానీ నాకు యుక్త వయసు వచ్చినప్పటినుంది దూరంగా ఉండటం జరిగిపోయింది.

మహేష్ దీర్ఘన్గా శ్వాస తీసుకొని ఎందుకు ఇలా ఏమి జరిగింది ? అని అడగగా,

ఇందు తన గొంతును సరిచేసుకొని ,ఏమీలేదు ……. ఏదైనా ఒక రోజు నా గురించి మొత్తం చెప్తాను ,ఈరోజైతే కాదు అని జావాభిస్తుంది.

మహేష్ అర్థం చేసుకొని ,అయితే ok , నాకు తెలుసు మనం కలిసి రెండే రోజులయ్యింది, నేను అర్థం చేసుకోగలను మీరు నాకు అంతా చెప్పనవసరం లేదు.
అది విన్న ఇందు మహేష్ చేతిని తన చేతిలోకి మార్చి గట్టిగా అదుముతూ పట్టుకొని ,కానీ నీకు నా గురించి ఇప్పుడే మొత్తం చెప్పాలని ఉంది.

ఇందు ఏమి చెప్తుందో వినడానికి తన గుండె పరిగెత్తుతోంది. అతను ఏదో మాట్లాడబోతుండగా వెయిట్రెస్ టేబుల్లో దగ్గరికి రావడంతో , మహేష్ ఓండు ఇష్టం అనగా కొన్ని లోకల్ గా ఉండే మీల్స్ దాంతో పాటు ఒక బాటిల్ వైన్ ఆర్డర్ చేస్తుంది.

త్వరగానే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ రాగానే అప్పుడప్పుడు మాట్లాడుతూ తింటు , అక్కడ లైవ్ లో ప్లే అవుతున్న jazz ను శాంతంగా వింటూ దాని గురించి ఇద్దరి కి తెలిసినది చర్చించుకుంటారు. ఇందు మహేష్ ను చూస్తూ అబ్బురపడుతూ, అసలు అతడిని చూస్తే వయసు23 అని నమ్మబుద్ధే కాదు, మాక్సిమం 19 అంతే కాని అతని ప్రవర్తన మాత్రం పరిణీతి తో ఉంటుంది.

ఏమి ఆలోచిస్తున్నారు అని మహేష్ ఇందు చేతిని కధపగా,

ఇందు హఠాత్తుగా కొద్దిగా ఎగిరి ఏ. …..ఏమి లేదు.

అది చూసి మహేష్ నవ్వి , క్షమించండి మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు, మీరు పట్టపగలే కలలో విహరిస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అయిన ఏమి కల కంటున్నారు.

ఏమీలేదు , బ్యాంక్ పని ,స్నేహితుల గురించి అంతే. ఇందు అపద్ధం చెప్తు ఒక గ్లాస్ లోనికి వైన్ పోసుకొని తాగుతుంది.

స్టేజి పైన మ్యూజిక్ వింటుంటే మహేష్ కు ఇందు ను తనతో డాన్స్ చేయమని అడుగుదామని ఇష్టాంగా ఉన్న ఆగిపోతాడు. ఆమెను తన చేతులతో ఇముడ్చుకొని , ఆమె కౌగిలిలో జీవితాంతం ఉండిపోవాలనేదే మహేష్ ఆశ. మహేష్ తీక్షణమైన కళ్ళు ఇందు నే చూస్తూ ఉండటం ఆమెకు తెలుస్తూనే ఉంది. చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ తను టీనేజ్ లో తన లవర్ తో వెళ్లే మొదటి date ల అనిపిస్తుంది మహేష్ తో ఉంటే.

ఇందు నాతో డాన్స్ చేయడం నీకు ఇష్టమేనా అని మహేష్ తన మనసులోని మాటను చివరికి ఆడిగేస్తాడు.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.