జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 237

ఆలస్యం చేయకుండా ఫ్రెష్ అయ్యి బూడిద రంగు షర్ట్ మరియు బ్లాక్ ప్యాంట్ మరియు బూట్స్ వేసుకొని తన కార్ కీస్ తీసుకొని చుట్టూ వేతకగా తన పర్సు మిస్ అయ్యిందని తెలుసుకుంటాడు.ఎక్కడ పెట్టి మరిచిపోయాను రా బాబు అని ఆలోచించగా వెంటనే నిన్న రాత్రి సోఫా లో కూర్చుంటున్నప్పుడు గుచ్చుకున్న విషయం గుర్తుకువచ్చి అయితే ఇందు ఇంటిలో కాఫీ table పై మరిచిపోయానని గుర్తుకు రాగానే భయంతో శరీరం అంత చెమటలు పట్టి తన చేతిని గుండెలపై పెట్టుకోగా మాములుకన్న రెండింతలు ఎక్కువగా కొట్టుకుంటోంది. ఆ పర్సు ను ఆమె కు కనిపించి లోపల ఉన్నవాటిటిని చూసి ఉంటుందా , తన గురుంచి సమాచారం మొత్తం తెలిసిపోయుంటుందా అని తన మనసు ఒక్కచోట కూడా కుదురుగా ఉండనివ్వయం లేదు. ఓరి దేవుడా ఇందు ఇప్పటివరకు కాల్ చెయ్యనందువల్ల ఆమెకు తన గురించి తెలిసిపోయి ఉంటుంది, అలాగే తను ఆమెకు అపద్ద0 చెప్పిన విషయం కూడా తెలిసిపోయి ఉంటుంది. ఇక ఇందు తనను అస్సలు క్షమించదు.

నేను అసలు వచ్చిన పని ఏంటి ఇప్పటివరకు చేసినది ఏంటి అని తనను తాను తిట్టుకుంటూ ఫోన్ పక్కనే ఉన్న వస్తువులను దూరంగా విసిరేస్తూ ” what the fuck ” ,ఆమెకు తన మొహం ఎలా చూపెట్టగలను తన గురించి ఏమని నిజం చెప్పగలను ,చెప్పిన ఇప్పుడు తను చెప్పేదంతా నమ్ముతుంద . కొన్ని రోజుల్లోనే ఆమె జీవితాన్నే నమ్మకంతో అర్పించాలనుకొన్న ఒక అందమైన దేవతను మోసం చేసానని కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తాడు. గుండీలను తెంపుతూ వేసుకున్న బట్టలను చింపేస్తూ ప్యాంట్ విసిరేసి న్యూడ్ గా బాత్రూం లోకి వెళ్లి శవెర్ కింద నిలబడగా చల్లటి నీరు తాకడం వల్ల కొద్దిగా శాంతించి బయటకు వచ్చి బెడ్ పై వాలిపోగా మళ్ళీ ఏడుస్తూ నన్ను క్షమించు అమ్మ , నన్ను క్షమించు అమ్మ……అని పదే పదే అనుకుంటూ ఏమి తినకుండానే నిద్రపోతాడు.

అక్కడ ఇందు పరిస్థితి మహేష్ కోసం రాత్రంతా ఎదురుచూస్తూ కాల్ చేద్దామా వద్దా అనే సంసాయంలో పది దీనిగురించి నేరుగా మాట్లాడటమే మంచిదని మహేష్ నే తలుచుకుంటూ నిద్రపోతుంది. మరుసటి రోజు లేచేసరికి ఉదయం 8:30 అవుతుండగా బెడ్ పైనుండి లేచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్నానం ముగించి తన బ్యాగ్ లో చేతికి తగిలిన బట్టలు వేసుకొని అప్పటికే ఆలస్యం అయినందువల్ల ఆకలిగా ఉన్న కూడా ( రాత్రి కూడా ఏమి తినకపోవడంవల్ల) సరాసరి ఇందు పనిచేసే బ్యాంక్ దగ్గరకు వెళదామని తన కార్ కీస్ అందుకుంటుండగా టక్ టక్ టక్ మని ఎవరో తన రూం డోర్ ను కొడుతుండగా ఎవరై ఉంటారని తలువు తెరవగా బయట ఇందు కోపంగా ముఖం పెట్టి నిలబడి ఉంటుంది. మహేష్ ఆమెను చూసి ఆశ్చర్యంతో బలహీనంగా నవ్వి ఆమె తనను ప్రశ్నించడానికే వచ్చిందని అర్థం చేసుకుంటాడు.

ఇందు గారు మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు ? I am really sorry ముందు లోపలికి రండి అని పిలిచి ఆమె లోనికి రావడానికి పక్కకు జరగగా ,కింద ఉంచిన పెద్ద బాగ్ ను తీసుకొని లోపలికి వచ్చి చూస్తే రూమ్ లోవస్తువులన్ని చిందర వందరగా ఎక్కడ పడితే అక్కడ పది ఉండటం గమణిస్తుంది. నిన్నటినుంది మీ నుండి ఎటువంటి కాల్ రాకపోవడంతో నేనే మిమ్మల్ని కలవాలని ,చూడాలని మీ బ్యాంక్ దగ్గరకే బయలుదేరాను. నిన్నటినుంది నేను చాలా వాయిస్ మెయిల్ పంపాను మీకు చేరాయా? . ఇందు దానికి సమాధానంగా తల ఊపి , చాలా missed కాల్స్ మరియు వాయిస్ మెయిల్ వచ్చాయి .

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.