జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 240

KNOCK! KNOCK!

మహేష్ డోర్ వైపు చూసి ,బెడ్ పై నుండి లేచి నిదానంగా ఎవ్వరా అని డోర్ దగ్గరకు వెళ్లి peephole లో చూడగా, తన గుండె ఒక్కసారిగా చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఇందు బయట నిలబడింది. మహేష్ కు ఎక్కిళ్ళు పట్టుకునేసరికి ఇక ఆమె నుండి ఎక్కడికి వెళ్లలేం అని నిర్ధారించుకొని డోర్ ఓపెన్ చేయగా, ఒక్కసారిగా ఇందు తన కళ్ళల్లో నీటితో మహేష్ మీదకు దూకి గట్టిగా అతుక్కుపోతుంది.

నిన్ను ఇబ్బంది పెట్టటానికి ,భాధ పెట్టటానికి నేను రాలేదు మహేష్ అని ఎడిస్తూ చెబుతుంది.

మహేష్ తన చేతిని తన తలపై నిమురుతూ ,అలాంటిది ఏమి లేదు , నువ్వు కాదు మొదట నేను మీకు క్షమాపణ చెప్పాలి. నేను ఒక చిన్న పిల్లాడి లాగా ప్రవర్తించాను.

నువ్వు కాల్స్ తీయలేకపోవడంతో నీకేమైన అయ్యిందేమోనని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను.

” Yeah i know. నన్ను క్షమించు. దయచేసి ముందు నీ కళ్ళను తుడుచుకో లేకపోతే నీ makeup అంతా చెడిపోతుంది అని నవ్వుతూ చెప్పగా,

అతడినుంది విడివడి తన రెండు చేతులతో కొంచెం ఏడుస్తూ, కొంచెం నవ్వుతూ తుడుచుకుంటుంది.
ఇందు ని బెడ్ పై కూర్చోపెట్టడానికి ఆమె చేతిని అందుకోగా ,తనని చూసిన ఆనందంలో వొళ్ళంతా పలకరించి ఆమె చెయ్యి ఒణుకుతోంది. ఆమె కంగారును తగ్గించడానికి తన చేతితో నొక్కుతూ బెడ్ పై కూర్చోబెట్టి వెనక్కు తిరిగి వెళ్లి రూమ్ డోర్ వేసి వచ్చి ఆమె ముందు నిలబడగా , ఇందు మహేష్ ను పైనుండి కింద వరకు చూస్తుంటే, అతడి జుట్టు చిందరవందరగా వుండి, తెల్లటి టీ షర్ట్ మరియు నల్లటి జాగ్గింగ్ షార్ట్ వేసుకున్నందు వల్ల అతని తొడల వరకు కనిపిస్తోంది. ఇందు తన తలను కిందికి దించగా అతని తొడలు రోజు స్పోర్ట్స్ ఆడటం వల్లనేమో కండలు తిరిగి ఉన్నాయి.

నువ్వు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్ను చూడటం నన్ను మైమరిచేలా చేస్తోంది. I am sorry, i really sorry ,మీరు నన్ను క్షమించే వరకు నాకు ఏది చేయబుద్ధి కాదు అని భాధ కలిగిన ముఖంతో అడుగుతాడు.

అది విన్న ఇందు అతడి పై ప్రేమతో బెడ్ పైనుండి లేచి తన రెండు చేతులను దూరంగా జరిపి మహేష్ చుట్టూ వేసి కౌగిలించుకోగానే , మహేష్ తన రెండు చేతులను ఇందు చుట్టూ వేసి గాలి కూడా దూరణాంత గట్టిగా ఆమెను కౌగిలించుకుంటాడు. ఇద్దరు ఒకరికి ఒకరు పోటీపడుతున్నట్లుగా అతుక్కుపోతారు.

ఇలా ఎప్పుడు నాతో ఇలా ప్రవర్తించుకు , నా తప్పు ఏదైనా ఉంటే నన్ను ప్రశ్నించే హక్కు నీకు ఉంది అని ఆమె పెదాలను మహేష్ ఛాతిపై తాకిస్తూ గొణుగుతుంది.

అంతటితో మహేష్ తన రెండు చేతులను ఆమె వెన్నముక పై రాస్తూ , ఈ విధంగా ఎప్పుడు మీతో ప్రవర్తించను అని వాగ్ధానం చేసి ,బయట వాతావరణం చాలా కూల్ గా ఉంది ,మీతో casino కి వెళ్లాలని ఉంది. అది కూడా మీకు ఇష్టమైతేనే.

ఇందు సంతోషంతో నవ్వి ,తన కాళ్లతో సహా వీలైనంత పైకి లేచి మహేష్ బుగ్గపై గట్టిగా చప్పుడు వచ్చేలా ముద్దు పెట్టి , ఏ సమయంలోనైనా , ఎక్కడికైనా నీతో వెల్కడానికి నాకు ఎప్పుడు ఇష్టమే అని అయితే ఇది సెకండ్ date? అని అడుగుతుంది.

మహేష్ తన నుదిటిని ఆమె నుదిటితో తాకిస్తూ , అవును , మీరు కొద్దిసేపు కూర్చుంటే డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని చెబుతాడు.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.