జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 239

ఆమెను అలాగే బెడ్ పై పడుకోబెట్టి , మిగిలిన నీళ్లను తీసుకెళ్లి అక్కడ కట్టిపడేసే ఉన్న పోలీస్ ముఖంపై చల్లుతూ కట్లు విప్పగా అప్పటివరకు జరిగినదంతా సగం కళ్లతో చూస్తూ చేతులు నలుపుకొని మిగిలిన నీళ్ళన్ని గట గట తాగుతుండగా , సాగర్ ను పిలిచి రూంలో నీ చెల్లెలు ఉందేమో చూసి అందర్నీ విడిపంచమని చెప్పగా పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తెరవగా లోపల మొత్తం చీకటిగా ఉండటంతో తన మొబైల్ టార్చ్ వేసి స్విచ్ బోర్డ్ వేతకగా పక్కనే కనిపించగా అన్ని స్విట్చేస్ వేయగా ఒక్కసారిగా వెలుతురు పడగానే అందరూ భయంతో గట్టిగా అరువగా ఒక అమ్మాయి మాత్రం అన్నయ్య అని పిలవడంతో అది విని అందరూ నిశ్శబ్దనంగా ఊపిరి పీల్చుకోగా సాగర్ ఒకరి కట్లు విప్పగా ఆమె మరొకరివి అలా అందరి కట్లు విప్పగా అన్నయ్య అని పరిగెత్తుకుంటూ వచ్చి సాగర్ ను కౌగిలించుకోగా ,

అందరిని హాల్ లోనికి పిలిచుకొని రాగా మహేష్ ఇందు పక్కనే కూర్చుని ఆమె చేతిలో చెయ్యి వేసి నుదుటి పై స్పర్శించాలని ఆశగా ఉన్న నన్ను ముట్టుకోవద్దు అన్న ఇందు మాట గుర్తుకువచ్చి ఆమెను ప్రేమగా తాకాలన్న కోరికను బాధతో బలవంతంగా ఆపాలనుకున్న అతని వల్ల కావటం లేదు తన చేతులను ఆమె ముఖం వరకు మరియు చేతుల వరకు తీసుకెళ్లి మరల ఆమె భాధపడుతుందేమో అని వెనక్కు తీసుకుంటున్నాడు అలా రెండు మూడు సార్లు చేయడం ఇందు గమనిస్తూ మహేష్ ను దీనంగా చూస్తూ మనసులో బాధపడుతుంది. బెడ్ పైనుండి లేచి కాళీ చొక్కా పట్టుకొని బెడ్ వరకు లాక్కొని వచ్చి అతని గుండెలపై కాళ్ళు పెట్టి ఇందు గారి కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకోరా అనగా రెండు చేతులు ఎత్తి పడుకున్న ఇందు కాళ్ళను పట్టుకొని బతిమాలగా ఇందు గర్వంతో ఎవరికి కనిపించకుండా సంతోసపడుతుంది.

దేవతలతో సమానమైన అమ్మాయిలని కిడ్నప్ చేసి చిత్రహింసలు పెట్టి అమ్మేస్తావ అని అతడి మీద గట్టిగా అరుస్తుండగా ఎవరన్నయ్య అతను అని అడగగా అతని వల్లే మీరంతా విడుదల కాగలిగారు అని చెప్పగా అందరూ కృతజ్ఞతలు చెప్పగా అలాగే మీరు ఈరోజు రాకపోయుంటే మేమంతా ఎక్కడ ఉండేవాల్లమో మాకు తెలుసు ఎన్నటికీ తీర్చుకోలేము అని వీడు మమ్మల్ని చాలా హింస పెట్టాడు చంపేయ్యండి అని ఒక అమ్మాయి చెప్పగా అందరూ ముక్త కంఠంతో అవును చంపేయ్యండి అని పెద్దగా అరుస్తూ చెప్తారు.

అలాగే చేద్దాం కానీ అంతకన్నా ముందు వీడు బ్యాంక్ లకు కట్టవలసిన డబ్బంతా ఎక్కడ పెట్టాడో కనిపెట్టాలి అనగా , ఉదయం నుండి సంచులు సంచులు డబ్బు పైకి తీసుకువెళ్లఫామ్ చూసాను అనగానే సాగర్ ను చూడగా పోలీస్ ను వెంటబెట్టుకొని పైకి వెళ్లగా రెండు రూమ్స్ కు మాత్రం తాళాలు వేసి ఉండటంతో అక్కడే డబ్బులు ఉంటాయని నిర్ధారించుకొని వాటిని పగల కొట్టగా ఒక రూమ్ నిండా డబ్బులతో నిండిన సంచులు మరియు మిగతా రూమ్ లో బంగారు మరియు వెండితో చేసిన నగలు , పాత్రలు వాటితో పాటు కట్టలు కట్టలు ఆస్తి పత్రాలు మరియు లెక్కలేనన్ని బ్యాంక్ పుస్తకాలు ,ATM కార్డ్స్ ఉండటంతో సాగర్ పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి మహేష్ ను రమ్మనగా ,

మీలో ఎవరైనా మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారా అని అడగగా సాగర్ చెల్లెలు ముందుకు రాగా ఇదిగో ఈ బెడ్ పై ఉన్న ఆమె నా ప్రాణం కంటే ఎక్కువ ఆమెను చూస్తూ ఉండండి అని అడగగా సాగర్ చెల్లెలు వెళ్లి ఆమె పరిస్థితి చూడగా , అన్నయ్య నీరసం వల్ల కొద్దిగా స్పృహ తప్పింది అంతే ఏమి కాలేదు మీరు వెళ్ళండి మేమందరం చూసుకుంటాము అని అనగా , కొద్దిగా వొంగి కాళీ గాడి రెండు చేతలను కట్టెలు విరిచినట్టు విరిచి కదాలదానికి కూడా వీలు లేకుండా చెయ్యడంతో అమ్మాయిలాంత తెగ ఆనందపడతారు.

సాగర్ తో పాటు పైకి వెళ్లి రూమ్ లలో ఉన్న డబ్బు నగలు చూసి ,పోలీస్ వంక చూసి సర్ మీరే చెప్పండి వీటిని ఏమి చేద్దాం అనగా , నేను వీటిని సీజ్ చేసి స్టేషన్ కు తీసుకు వెళితే నా పైనున్న వాళ్ళు పందికొక్కుల్లా ఊడ్చేస్తారు కావున ఇప్పుడు మీరే మాకు boss మీరు ఎలా అంటే అలా అని అనేసరికి ,ముందు వీటిని కిందకు చేర్చుదాం అని కొంత మంది అమ్మాయిలు సహాయం చేయగా అర గంటలో మొత్తం కింద హాల్ లో వరుస పేర్చగా ఆ నగలను చూసి అందరి అమ్మాయిల ముఖాలు తాము ఇప్పుడే కిడ్నప్ నుండి విడుదల అయ్యమని మరిచి ఆశతో మెరుస్తున్నాయి. వారి ముఖాలు చూసిన ముగ్గురు మగవారు ఈ ఆడవారికి నగలు కనిపిస్తే చాలు తాము ఏ పరిస్థితులలో ఉన్నామని కూడా మరిచిపోతారు అని తమలో తమను ముగ్గురు చూసుకుంటూ చిన్నగా నవ్వుకుంటారు.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.