జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 237

ఆ శబ్దం కోసమే ఎదురుచూస్తున్న ఇందు పరిగెత్తుకుంటూ వచ్చి వాకిలి తీయగా , అందమైన డార్క్ బ్లూ సిల్క్ రోబ్ ధరించి , పెదాలపై చిరునవ్వుతో, జుట్టును అలలు అలలుగా కిందికి వదిలేయడం వల్ల ప్రకాశవంతంగా వెలిగిపోతోంది. ఇందుని అలా చూసేసరికి మహేష్ కు నోటా మాట రాక ఆమెనే చూస్తూ బొమ్మలా నిలబడటం చూసి ఇందు తనలోతాను గర్వాంగా నవ్వి ఆమె చేతితో అతడి భుజం పై వేసి కదిలించగా తేరుకున్న మహేష్ మీరు ఈ రోబ్ లో చాలా ……చాలా అందంగా ఉన్నారు అని తడబడుతూ చెప్పగా,

సిగ్గుపడుతూ అతడిని ఒకసారి కౌగిలించుకొని నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని పక్కకు జరిగి అతడిని లోపలికి ఆహ్వానిస్తూ, అతడు లోపలికి వచ్చి కొంచెం ముందుకు నడవగా ఇందు వెళ్లి వాకిలి మూసిన శబ్దం వినిపించగా వెనక్కు తిరిగి ఆమెనే చూస్తూ నిలబడిపోతాడు.

అలా చూసేసరికి ఇందు మహేష్ ముందు వచ్చి నిలబడగా రెండు చేతులను ఇందు భుజాలపై వేసి నుదుటిపై ముద్దు పెట్టి నిదానంగా కిందికి తల దించుతూ ఇందు పెదాలపై చిన్నగా ముద్దు పెట్టి వెనక్కు జరిగి , “nice to see you too” ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు అని మళ్ళీ చెప్పేసరికి ,

Thank you మహేష్ , నువ్వు వచ్చేముందే స్నానం చేసాను , ఇంత త్వరగా నువ్వు వస్తావనుకోలేదు .అని సిగ్గుపడుతూ చెప్తుంది.

కాఫీ ఆర్ టీ ? అని ఇందు అడగగా,

నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అని మహేష్ చెప్పగా ,

గ్రేట్ నాకు కూడా కాఫ్ఫ్ అంటేనే ఇష్టం అని నవ్వి మహేష్ కు సోఫా చూపిస్తూ అక్కడే టీవీ రిమోట్ కూడా ఉంది నీకు చూడాలనిపిస్తే టీవీ పెట్టుకో ,10 నిమిషాల్లో కాఫీ తెస్తాను అని కిచెన్ లోకి వెళ్తుంది.

మహేష్ సోఫాలో కూర్చుంటుండగా కార్ కీస్ కుచ్చుకోగా ,తన జేబులో నుండి కీస్ తో పాటు తన పర్సు ను కూడా ఎదురుగా ఉన్న కాఫీ టేబుల్ పై పెట్టి కూర్చుంటాడు.ఇందు అందమైన ఇంటి లోపల అంత చుట్టూ చూస్తూ ఉండగా గోడలపై చాలా దగ్గర పెయింటింగ్స్ ఉన్నాయి . ఇంటి లోపల చిన్న బుల్బ్స్ వేసినందువల్ల లైటింగ్ డిం గా ఉంది. ఏమైనా ఇందు గురించి ఫొటోస్ ఉన్నాయేమోననని ఇల్లంతా చూస్తూ తన ఎదురుగా ఉన్న కాఫీ table కింద కొన్ని మ్యాగజైన్స్ తో పాటు ఫోటో ఆల్బమ్ కూడా కనిపించేసరికి మహేష్ కు చాలా ఉత్షాహం వచ్చి ఇందు గురించి ఏవైనా చిన్ననాటి ఫొటోస్ లేదా ఆమె తల్లిదండ్రుల ఫొటోస్ ………. ఇంకా తన కన్నా తండ్రి ఫొటోస్ ఏవైనా కనబడతాయేమో అని ఆతృత ఎక్కువ అవుతోంది.

మహేష్ మందంగా ,పొడవుగా ఉన్న గ్రీన్ ఆల్బమ్ ను అందుకొని ఒక్కొక పేజీ తిరగేస్తూ, చాలా ఫొటోస్ లలో ఇందు మరియు ఆమెతో పనిచేసేవాళ్ళు మరియు స్నేహితుల పిక్చర్స్ ఎక్కువగ్గా ఉన్నాయి. ఈ ఆల్బమ్ అంతా ఇలాంటి ఫొటోస్ మాత్రమే ఉన్నాయేమో అని నిరాశ చెందుతూ కొన్ని పేజెస్ తిప్పగా వరుసగా కొన్ని పిక్చర్స్ లో ఇద్దరు వయసుమల్లిన వారి మధ్య ఇందు నవ్వుతూ ఉన్న ఫొటోస్ కనిపించేసరికి ఉత్తేజం వచ్చి వాళ్ళు కచ్చితంగా ఇందు తల్లిదండ్రులు అంటే తన grandparents అయ్యి ఉండొచ్చని అనుకుంటాడు. ఇందు తల్లి ఎత్తుగా మరియు సన్నగా షార్ట్ డార్క్ బ్రౌన్ వెంట్రుకలు కలిగి నీలం కళ్ళతో , ఆమె తండ్రి కర్లీ వెంట్రుకలు మరియు బ్రౌన్ కళ్ళతో మాములు ఎత్తుతో ఉన్నారు. ఆ ఫోటో ను గమనిస్తే అది ఇందు college గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పుడు తీసుకున్నదిగా తెలుస్తోంది.

ఇంతలో రెండు కాఫీ కప్ లతో అక్కడకు వచ్చిన ఇందు “oh no you found my pictures ” అని భుంగమూతి పెట్టి సరసముగా ఆడిగేసరికి,

మహేష్ ఒక్కసారిగా ఆల్బమ్ మూసి సోఫా లో ఎగిరి కూర్చొని దేవుడా చాలా భయపడ్డాను తెలుసా ఇంత సడన్ గాన వచ్చేది అని నవ్వుతూ చెప్తాడు.

దానికి ఇందు గట్టిగా నవ్వి “i’m sorry నిన్ను భయపెట్టాలని కాదు, ఆ ఫొటోస్ లలో నేను అంతగా బాగా లేను. అందుకే,

అల్లాంటిది ఏమి లేదు , నువ్వు ప్రతి ఒక్క ఫోటో లోను చాలా అందంగా , అమాయకంగా ఉన్నావు ,నాకు చాలా బాగా నచ్చాయి.

ఇందు అతనికి కాఫీ కప్ అందించి తన పక్కనే సోఫా లో కూర్చోగా ,ఆల్బమ్ ఓపెన్ చేసి ఫాస్ట్ గా తను ఇంతకుముందు చూస్తున్న ఫోటోను ఆమెకు చూపిస్తూ , వీళ్ళు మీ తల్లిదండ్రులా? అని వేలితో చూపిస్తాడు.

ఇందు తల ఊపి అవును వీరే తన తల్లిదండ్రులు , నేను మా అమ్మ ఎలా ఉందో అలానే ఉన్నాను కదా అని అడుగుతుంది.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.