జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 240

అంతలో తనను పెంచిన తల్లిదండ్రులకు కూడా అపద్ద0 చెప్పానని గుర్తుకు రావడంతో , మరియు మిస్ అవుతున్నందుకు బాధపడుతూ వాళ్లకు వెంటనే కాల్ చేసి తన బాధను ప్రకటించకుండా మాట్లాడటంతో వాళ్ళు ఆనందంగా ఉన్నారని తెలుసుకొని కొద్దిగా ఉపశమనం చెందుతాడు. ఇక ఇక్కడ తన కన్న తల్లిని కూడా వధులుకోకూడదని ఆమెకు కాల్స్ చేస్తూనే బ్యాంక్ దగ్గరికి చేరుకుంటాడు. లోపలికి వెళ్ళి ఆమె గురించి అడగగా వచ్చారు కానీ లంచ్ చెయ్యడానికి వెళ్లారు కేబిన్ లో వేచి ఉండమని చెప్పగా సమయం చూడగా అప్పుడే 1:30 అయ్యిందా అనుకోని ఆమె క్షేమమే అని తెలుసుకొన్నా వెంటనె తన మనసు కుదుటపడగా లోపలికి వెళ్ళి చూస్తే ఫోన్ అక్కడే table పై మరిచిపోయి వెళ్ళింది.

ఇక ఒక్క క్షణం కూడా ఆమెను చూడకుండా ఉండలేక ఆమె ఏ హోటల్ కు వెళ్లిందో తెలుసుకొని బయటకు రాగా ఒక నల్లని maruthi omni తన పక్కనుంది చాలా వేగంగా దూసుకుపోసాగింది. What the fuck కొంత మందికి రోడ్ల పై ఎలా డ్రైవ్ చెయ్యాలో కు తెలియదు ,waste fellows అని తిట్టుకుంటూ అది చిన్న రోడ్ అయిన కూడా చాలా వేగంగా వెళుతున్నందు వల్ల యాదృచ్చికంగా దాని నెంబర్ ప్లేట్ చూడగా అది గుర్తుపెట్టుకోవడానికి చాలా సులభంగా ఉంది — GA 03 R 1000. మహేష్ దృష్టి ని ఇందు వైపు మళ్లించి దగ్గరలో ఉన్న హెహోటల్స్ అన్నింటిని ఏది వదలకుండా వెతుకుతుండగా , చివరికి రోడ్ కి అవతలివైపు ఒంటరిగా నడుచుకుంటూ బ్యాంక్ వైపు వెళుతోంది. మహేష్ కు ఎక్కడలేని ఆనందం వేసి ఆమెను పాలకరిస్తుండగా అప్పుడే జనాలంతా లంచ్ కోసం బయట తిరుగుతూ వారి శబ్దాలు వల్ల తన మాటలు ఆమెకు చేరడం లేదు.

ఆ వీధి చిన్నగా ఉండటం వల్ల జనాల గుంపు గుంపు ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళను తోసుకుంటూ వెళ్తుదంగా కొద్దిగా దూరంలో అదే నల్లని maruthi నిదానంగా చుట్టూ తిరిగి తమ వైపు నిదానంగా వస్తుండటం గమనించకపోడు. ఇందు ఎక్కడో ఆలోచిస్తూ ముఖంపై కోపంతో వేగంగా నడుచుకుంటూ వెళుతోంది. మహేష్ ఆమెను గట్టిగా పిలుస్తూ ఉన్న ప్రత్ఫలం లేక జనాలను తప్పించుకుంటూ ఆమె కంటే వేగంగా వెళ్లలేకపోతున్నాడు. ఇద్దరి మధ్య దూరం క్షణ క్షణానికి పెరుగుతోంది. అంతలోనే ఒక్కసారిగా ఇంతకు ముందు మహేష్ పక్కనే వేగంగా వెళ్లిన maruthi omni ఇందు పక్కనే నిలిచిపోయి మహేష్ కు ఏమి జరుగుతోందో తెలుసుకొనే లోపే , ఇద్దరు omni దిగి ఆమెను భలవంతగా గట్టిగా మూతి మూసి omni లోపలికి లాగగ లోపల ఇంకా ఒక వ్యక్తి వెనక కూర్చుని ఉండగా ఇంకొక వ్యక్తి డ్రైవ్ చేస్తుంటే ఆమెని వేగంగా ముందుకు కదిలింది, షాక్ నుండి తేరుకున్న మహేష్ దాని వెనకే చాలా వేగంగా పరిగెత్తినప్పటికి అందుకోలేక అలసటతో ఆగిపోతాడు .

మహేష్ కు వాళ్ళను చూసినట్లుగా లేకపోవడంతో అసలు వాళ్ళు ఎవరు? ఇందుని ఎందుకు బలవంతంగా తీసుకు వెళ్లారు? అని భయపడుతూ ఏమి చెయ్యాలో దిక్కు తచని స్థితిలో వొళ్ళంతా చెమటలు పట్టి , గుండె వేగంగా కొట్టుకుంటుండగా తల పట్టుకొని నిలబడిపోతాడు. ఇంతలో ఇందు కేబిన్ లోని మొబైల్ గుర్తుకు రాగా వెంటనే బ్యాంక్ కు వెళ్లి ఆమె కాల్ లిస్ట్ ను పరిశీలిస్తుండగా బయట అందరూ ఒక దగ్గర గుమిగూడి ఫోన్ వంక చూస్తుండగా బయటకు వచ్చిన మహేష్ ఫోన్ దగ్గరకు వెళ్లగా క్లర్క్ స్పీకర్ on చేసి reciever పక్కన పెట్టగా భయంకరంగా గట్టిగా నవ్వుతూ ,మీకోక బ్యాడ్ న్యూస్ మీ అసిస్టెంట్ manager ను నేను కిడ్నప్ చేసాను అని చెప్పగానే అందరూ గందరగోళంగా గుసాగుసలాడుతుండగా మహేష్ stop it అని గట్టిగా అరిచేసారికి అందరూ నిశ్శబ్దనంగా ఉండగా ఫోన్ లో అవతలి వ్యక్తి మాట్లాడుతూ నాకే బకాయి కట్టమని నోటీస్ పంపిస్తుందా పేరేంటి ఆ ఆ ఇందు , ఈ స్టేట్ లో చాలా బ్యాంక్ లలో చాలా డబ్బు ఎగ్గొట్టాను.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.