జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 238

అప్పుడు నేను చిన్నదాన్ని మరియు మా పేరెంట్స్ నాకు అస్సలు సపోర్ట్ చేయకపోవడంతో నాకు ఏమి చెయ్యాలో తెలియక వదిలి వేయాల్సి వచ్చింది అని చెప్పి అది గుర్తుకు రాగా ఒక్కసారిగా తన రెండు చేతులతో తన ముఖాన్ని మూసుకొని సోఫా లో కూర్చొని ఏడుస్తూ బాధపడుతుంది.

అలాగే ఏడుపు గొంతుతో నీవు గాని ఆ పిల్లవాన్ని నీ దగ్గరే పెట్టుకోవాలంటే మా తల్లిదండ్రులు నన్ను వాళ్ళ కూతురుగా నిరాకరించి ,ఇక జీవితంలో ఎప్పుడు తనతో మాట్లాడము అని ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆజ్ఞాపించారు.

నాకు పిల్లవాడే కావాలని వాళ్ళను ఎదిరించి ఇంటి నుండి పారిపోయి వచ్చేసాను . అప్పుడు నాకు నాలుగు నెలలు కడుపు. నేను కొన్ని నెలలు స్నేహితులతోను మరియు చివరి నెలలు మా cousine దగ్గరే ఉంది అక్కడే బేబీ బాయ్ కు జన్మనిచ్చాను.

అదంతా విన్న మహేష్ నిదానంగా ఆమె పక్కనే సోఫాలో కూర్చుని ,ఆమె చేతిని పట్టుకొని తరువాత ఏమి జరిగింది అని అడగగా,

ఇందు మహేష్ వైపు తిరగగా ,అతడు తన చేతిని ఆమె భుజంపై వేయగా , నువ్వు ఆ బేబీ ని చూడాల్సింది మహేష్ , అతడు చాలా అందంగా ఉండేవాడు. ఇప్పుడు నా ఓడిలోనే పడుకోపెట్టుకొని ఆ పిల్లవాడు నవ్వుతూ మరియు ఏడుస్తూ ఉండగా అది చూసి సంతోషంతో ప్రపంచ్చాన్ని మరిచిపోయేదాన్ని .

నాకు ఆ బేబీ బాయ్ ను నా నుండి దూరంగా వదిలి వెళ్లాలని అస్సలు లేదు , కానీ అతడు నా దగ్గరే ఉంటే ఒక మంచి జీవితాన్ని ఇవ్వలేనేమో అని అనిపించింది. అతడి కాన తండ్రికి అదే నిన్న రెస్టౌరెంట్ లో చెప్పిన వ్యక్తికి అప్పజెప్పాలని చాలా ప్రయత్నాలు చేసాను కానీ ఆ అదృష్టం కూడా లేదు అతడు ఏమైపోయాడో ఎవ్వరికి తెలియదు. బంధువులు ,స్నేహితులు పిల్లవాన్ని ఉంచుకొని నీ జీవితాన్ని మరియు అతని జీవితాన్ని నాశనం చేసుకోకుండా పిల్లల్ని పెంచుకునే ఆసక్తి ఉన్నవారికి ఇచ్చేయమని ప్రాధేయ పడ్డారు. ఇక విధిలేని పరిస్థితులలో ఒక ఫామిలీ పిల్లల కోసం గుడిలో పూజలు చేస్తున్నారని చెప్పగా వాళ్ళు లోపలికి వెళ్లిన వెంటనే నా ప్రాణమైన పిల్లవాన్ని గుడి లో వదిలి వచ్చేసాను .

వదిలేసిన కొన్ని రోజుల వరకు ఏడుస్తూనే ఉన్నాను. నేను నా జీవితంలో చేసిన చాలా బాధాకరమైన మరియు చాలా క్లిష్టతరమైన తప్పు అదే. అది నాకు చేయాలని అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లవాన్ని నా దగ్గరే పెట్టుకొని తన ఆలనాపాలనా జాగ్రత్తగా పెంచి నీ లాంటి ఒక మంచి నడవడిక ఉన్న అందమైన యువకుడిగా తీర్చిదిద్దాలని చాలా ఆశ ఉండేది.

ఏ విధమైన పేపర్స్ గాని లెటర్స్ గాని ఉంచకుండా ఒక అనాధ లాగా వదిలి నా తల్లిదండ్రుల దాగారికి వచ్చేసాను. ఆ పిల్లవాడికి పెరు కూడా పెట్టలేదు. ఆ పిల్లవాడు మగ పిల్లవాడు అని మాత్రమే నాకు తెలుసు.” The love of my life”!.

ఒక చిన్న పిల్లవాన్ని గుడిలో వదిలేసి వెళ్లారని ఆ నోటా ఈ నోటా ఊరంతా తెలిసిపోయేసరికి చాలా బాధపడుతూ తన తల్లిదండ్రుల ఆజ్ఞానుసారం ఇక్కడికి రావడం జరిగింది , అని ఎక్కిళ్ళు పట్టేంత ఏడుస్తూ ఉండేసరికి అదంతా విన్న మహేష్ ఒక పక్క నుంచి రెండు చేతులు ఆమె చుట్టూ వేసి గట్టిగా కౌగిలించుకొని అతడు కూడా తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుస్తూ ఇందు పడిన కష్టాన్ని తలుచుకొని చాలా బాధపడతాడు.

మహేష్ నాకు ఇప్పటికి నా బేబీ గుర్తుకు వస్తూ నిన్నొ మొన్నో తన ఒడిలో ఆడుకున్నట్టు అనిపిస్తోంది.

ఇందు నే తన కన్న తల్లి అని మహేష్ నిర్ధారించుకొని వొళ్ళంతా ఆనందంతో , పెదాల మీద చిరునవ్వుతో పులకించిపోతుంది

అప్పట్లో నేను చూసిన పిల్లలలో నా బేబీ ఈ ప్రపంచం లొనే చాలా విలువైన , అద్భుతమైనది. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి రోజు నా బేబీ ను గుర్తు చేసుకుంటూనే ఉన్నాను . నా ప్రాణం ఉన్నంత వరకు ఆ బేబీ ని నా హృదయం లో దాచుకొని ప్రేమిస్తూనే ఉంటాను.
ఆమె మాటలు విన్న మహేష్ కు కళ్ళల్లో కన్నీళ్లు ఆగేలా లేవు. తన కన్నా తల్లితోపాటు ఏడుస్తూనే ఉన్నాడు. ఇందు నే తనకు జన్మనిచ్చిన అమ్మ .దేవుడా ఈమె చాలా అందంగా ఉంది! . తనను వదిలేయడానికి గలా కారణాలు తెలియడం వల్ల ఆమె తనకు ఇంకా ఎక్కువ ప్రేమగా కనబడుతోంది. ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని మనసారా ఏడుస్తున్నారు. చాలా సంవత్సరాల నుండి ఆమె ఒక్కటే అనుభవిస్తున్న బాధను ఆమెకు ప్రియమైన మహేష్ తో చెప్పడం వల్ల కాస్త మనసుకు ఉపశమనం లభించినట్లయ్యింది.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.