జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 3 117

ఇందుకు మళ్ళీ అదే విషయం గుర్తుకువచ్చి బయటకు వెళ్లి చెపుదామని తలుపు తెరవడానికి ప్రయత్నించగా బయట ఘడి పెట్టాడని అర్థమై ఫోన్ చేసి చెప్పాలనుకొని ఫోన్ కూడా కనపడక పోవడంతో ఎన్ని సార్లు చెప్పాలని ప్రయత్నించిన మరిచిపోయి చెప్పలేకపోతున్నానని తీవ్ర అసహనానికి లోనౌతు తనకు తన కొడుకుతో జరుపుకోవాలనే అదృష్టం లేదనుకుని బాధ పడుతూ బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకుంటుంది.

వాళ్ళు వచ్చేలోపు బేకరి కి ఫోన్ చేసి తన పేరు చెప్పగా మహేష్ గారు ఇప్పుడే మీరు చెప్పిన ఆర్డర్ ఫ్రెష్ గా తయారు చేస్తున్నాము , ఒక గంటలో మీరిచ్చిన అడ్రస్ కు డెలివరీ చేసేస్తాము అని చెప్పగా థాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుండగా ఒక చిన్న వ్యాన్ తన పక్కనే ఆగగా అందులో నుండి నలుగురు వ్యక్తులు దిగగా ముందున్న వ్యక్తి నా దగ్గరికి వచ్చి ,మహేష్ గారు మీరు చెప్పిన విధంగానే ఒక బటన్ నొక్క గానే 20 నిమిషాలు ఏకధాటిగా ఆగకుండా ఫైర్ అయ్యేలా రిమోట్ ను రూపొందించాము.

ఏ ప్రదేశం పైన పేలాలో చూపిస్తే మా వాళ్ళు అక్కడే మొత్తం 20 నిమిషాలు పేలేల సెట్ చేస్తారు అని అడుగగా , ఇంటి పైన అని చూపించగా ఇంటి చుట్టూ కింద ఒక అరగంటలో సెట్ చెయ్యగా మిగిలిన డబ్బును ఇచ్చి థాంక్స్ చెప్పి పంపించేస్తాడు.

వెంటనే లోపలికి వచ్చి రూమ్ లో చూడగా తన తల్లి నిద్రపోతుండగా తలుపు వేసి చప్పుడు చెయ్యకుండా పక్క రూమ్ లో ఉన్న బెడ్ ను మరియు పక్కనే సెల్ఫ్ లో ఉన్న బ్లాంకెట్స్ తీసుకొని పైకి వెళ్లి మధ్యలో పరిచి దానిపై బ్లాంకెట్స్ వేసి బెడ్ చుట్టూ transparent curtains ను తన ఎత్తు వరకు ధారాలతో కట్టి మిగిలిన మొత్తం పని ముగించేసారికి 10:30 అవుతుండటంతో కిందకు వచ్చి పైనుండి కిటికి దగ్గరకు వదిలిన wire కు పిన్ తగిలించి స్విచ్ బోర్డ్ లో పెట్టి on చేసి పైకి వెళ్లి చూడగా తను అనుకున్న దాని కంటే అందంగా కనిపిస్తోంది .

3 Comments

  1. Sir mahesh first amenu kalisinappude 1 month mundhe na birthday ayindhi ani annaru
    Malli eppudu ame birthday anti

    1. Yendhayya idhi yemaina lesson,meku intresting vundhi gaa chusi kottukodame gani,yedho pedda logic laa aduguthunnav

  2. Super next post please

Comments are closed.