విక్రమ్ వైపు తిరిగి విక్రమ్ సర్ ఇక ఈ మిగిలిన డబ్బులో కొంత సాగర్ కు ఇచ్చి కాళీ గాడిని పట్టుకున్నప్పుడు దొరికిందని మీ చేతుల ద్వారా ప్రభుత్వానికి అందించండి అని చెప్పి, ఈ పని అవ్వగానే ఇంటికి వెల్లలనుకున్న మహేష్ , మంచి విషయం తెలిసిన తరువాత దాని కోసం ఒక ప్లాన్ వేసుకొని చాలా పనులున్నాయని అనుకొని ఒక లాప్టాప్ మరియు wi-fi dongle తీసుకొని మొదటగా బేకరీ కి వెళ్లి ఏమేమి కావాలో వివరించి అడ్రస్ ఇచ్చి డెలివరీ సమయం చెప్పి నెక్స్ట్ ప్లేస్ కు భయలుదేరుతాడు.
మొత్తం goa లో ఉన్న మొత్తం బ్యాంక్ లలో 12 గంటల కల్లా కాళీ నుండి రావాల్సిన మొత్తం అమౌంట్ వారి బ్యాంక్ ల లోకి పడిపోవడంతో దానిని కంప్యూటర్ స్క్రీన్స్ పై చూసుకున్న clerks నమ్మలేక రెండు మూడు సార్లు చెక్ చేసుకొని manager మరియు చైర్మన్ కేబిన్ లోనికి పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న కంప్యూటర్ లో చూపించి , ఈ మొత్తం అమౌంట్ “గోవా సిటీ బ్యాంక్ లోని ఇందు అనే అసిస్టెంట్ manager” అకౌంట్ నుండి పడింది సర్ అని వివరించగా , వెంటనే అన్ని బ్యాంక్ చైర్మన్ లందరు ఇందు పని చేసే బ్యాంక్ కు చేరుకొని లోపలికి వెళ్లగా అప్పటికే ఆ బ్యాంక్ చైర్మన్ రావడంతో అందరూ సంతోషంగా అతడి చుట్టూ చేరి దాని గురించే మాట్లాడుకుంటుండగా తమ బ్యాంక్ కంటే పెద్ద పెద్ద బ్యాంక్ లో నుండి వచ్చిన వాళ్ళను ఆశ్చర్యంతో చూసిన చైర్మన్ అందరిని తన కేబిన్ కు ఆహ్వానించగా వాళ్ళందరూ ముఖ్త కంఠంతో గౌరవంగా ఇందు గారు ఎక్కడ ఉన్నారు ఆమెను అత్యవసరంగా కలిసి మా బ్యాంకుల తరుపున కృతజ్ఞతలు తెలిపి ఆమెకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఘనంగా సన్మానించుకోవాలి మీ బ్యాంక్ ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని బ్యాంక్ లకు ఆదర్శనంగా నిలిచిందని పొగుడుతూ అందరూ ఒకే మాట చెప్పగా ,
మేము కూడా దాని గురించే చర్చించుకుంటున్నాం కానీ మీరు అని అంటుండగా manager లోపలికి వచ్చి అతడి చెవిలో మొత్తం వివరించగా ఒక్కసారిగా పైకి లేచి అవునా ఇది మన బ్యాంకుకు చాలా గొప్ప విజయం అని గర్వపడుతూ ఇందుకు తన మనసులో తమ బ్యాంకును శికరాగ్రానికి తీసుకెళ్లినందుకు ప్రసంషిస్తూ , ఇందు గారు కొన్ని రోజులుగా లీవ్ లో ఉన్నారు ఆమెను సంప్రదించి బ్యాంకింగ్ వ్యవస్థ స్థాయిని పెంచినందుకు మనవంతుగా బ్యాంకింగ్ రంగం లొనే ఎన్నడూ జరగని విధంగా గౌరవంగా ఆమెను సన్మానించుకోవాలని చెప్పగా అందరూ ఒక్క మాటగా అవును అని సంతోషంతో గట్టిగా అరవగా , తన ఫోన్ ద్వారా కాల్ చెయ్యగా , మహేష్ ఓమ్ని లో వెళుతుండగా కాల్ రావడంతో చూడగా చైర్మన్ అని పేరు ఉండటంతో పక్కన నిలిపి ఎత్తగా హలో ఇందు అని పిలువగా హలో నేను ఇందు గారి PA మాట్లాడుతున్నాను చెప్పండి సర్ ఏమిటి విషయం అని చెప్పగా వెంటనే ఇందు తో మాట్లాడాలి ఆమె మా బ్యాంకులకు చేసిన గొప్ప పనికి అభినందిస్తూ సన్మానం చెయ్యాలకుంటున్నాము ఆమెకు ఎప్పుడు వీలౌతుందో అడిగి చెప్తే అప్పుడే పెట్టుకుంటాము అని మర్యాదగా అడుగగా ,
మహేష్ సంతోషిస్తూ ఒక గంటలో మీ బ్యాంకు దగ్గరికి వస్తాను అన్ని మాట్లాడుకుందాము అని చెప్పగా , మీరెక్కడ ఉన్నారో చెప్తే నేనె స్వయంగా వస్తాను అని ఒక పెద్ద హోటల్ లో లంచ్ కు టేబుల్ బుక్ చేసి ఒక గంటలో అక్కడ కలిసి మొత్తం మాట్లాడుకుందాము అని ఫోన్ పెట్టి , రేపటి రోజుకు తనకు ఇలా అన్ని కలిసి వస్తున్నాయి అని ఆనందిస్తూ ఇంకా గంట ఉండటంతో fire works స్టోర్ కు వెళ్లి తనకు ఈ టైంలో ఈ విధంగా పేలాలని వివరించి వారికి తన సొంత డబ్బును ఇచ్చి చైర్మన్ ను కలవడానికి హోటల్ కు వెళతాడు.
Sir mahesh first amenu kalisinappude 1 month mundhe na birthday ayindhi ani annaru
Malli eppudu ame birthday anti
Yendhayya idhi yemaina lesson,meku intresting vundhi gaa chusi kottukodame gani,yedho pedda logic laa aduguthunnav
Super next post please