జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 3 117

అతడు మైకు దగ్గరికి వచ్చి ఈ ఫంక్షన్ మూక ముఖ్య ఉద్దేశం ఏమిటి అనగా మహేష్ చెప్పినట్టుగా అంతా వివరించి ఇందు గారిని స్టేజి మీదకు సాదరంగా ఆహ్వానించిస్స్తున్నట్లు వినగానే ఇందు ఒక్క క్షణం షాక్ కు గురికాగా అంతలోనే ముందు ద్వారం ద్వారా లోపలికి వచ్చిన మహేష్ చిరునవ్వుతో thumbsup చూపిస్తూ వెల్లమనగా అందరూ లేచి చప్పట్లు కొడుతుండగా భయంభయంగా స్టేజి మీదకు వెళ్లగా అక్కడ నిలుచున్న వారు ఆమెను మధ్యలో ఉన్న చైర్ చూపించగా భేరుకుతో నెమ్మదిగా కూర్చోగా ,ఈ సంతోష సమయంలో మరొక సంతోష విషయం కూడా ఉంది అని పక్కన ఉన్న వాళ్లకు చిటికె వెయ్యగా స్టెప్ బై స్టెప్ ఉన్న పెద్ద కేకును తెచ్చి స్టేజి చివరన ఉంచి ఈ రోజు ఇందు గారి పుట్టిన రోజు అని చెప్పగా అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ శుభాకాంక్షలు తెలుపుతుండగా , కేక్ కొయ్యడానికి ఆహ్వానించగా నా వైపు చూడగా నవ్వుతూ వెల్లమనగా అందరూ ఆమెను శాలువాలు ఇచ్చి సత్కరించగా కేక్ కోసి సంతోషపడుతూ వెళ్లి కూర్చుంటుంది .

ఈ పుట్టిన రోజు సందర్బంగా ఆమెను manager గా ప్రమోట్ చేస్తున్నానని చెప్తున్నందుకు గర్వపడుతున్నాను అని చెప్పగా సభ మొత్తం చప్పట్లతో అభినందిస్తారు. అలాగే ఆమె రికవరీ చేసిన మొత్తంలో 10 శాతం ఆమెకు చెందుతుంది అని చెప్పి మిగతా బ్యాంక్ చైర్మన్ లను వరుసగా మాట్లాడమని కోరగా ఒక్కొక్కరు వస్తు తమ బ్యాంక్ తరుపున ఒక్కొక్క గిఫ్ట్స్ ఇచ్చి చివరగా ఇందును మాట్లాడవలసిందిగా కోరగా ఏమి మాట్లాడాలో తెలియక భయపడుతుండగా మహేష్ ఆమెకు బ్యాగ్ చూపించగా అందులోని పేపర్ అందుకొని ఒకసారి చూసుకిని మైకు దగ్గరకు వెళుతుంది.

ముందుగా సభకు నమస్కారం, వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారం. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా నేనేమి చెయ్యలేదు. నా డ్యూటీ నేను సక్రమంగా నిర్వర్తించాను అంతే. ఇది నేను మాత్రమే సాధించలేదు చాలా మంది కృషి దాగి ఉన్నది అని చెప్పగా ఎవరు ఎవరు అని అడుగగా , నాతోపాటు “మన ఓల్డ్ టౌన్ SI విక్రమ్ గారు మరియు మన పక్కనే పల్లెలో నివశిస్తున్న సాగర్ గారు మరియు గోవా womens govt మెడికల్ college థర్డ్ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు మరియు ఆ పేపర్ లో లేకపోయినా నా ప్రాణానికి ప్రాణమైన ఒక వ్యక్తి అని తన కొడుకు కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ” .

3 Comments

  1. Sir mahesh first amenu kalisinappude 1 month mundhe na birthday ayindhi ani annaru
    Malli eppudu ame birthday anti

    1. Yendhayya idhi yemaina lesson,meku intresting vundhi gaa chusi kottukodame gani,yedho pedda logic laa aduguthunnav

  2. Super next post please

Comments are closed.