జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 3 114

అదే సమయానికి మహేష్ ఆశ్రమానికి చేరుకోగా లోపలికి వెళ్ళగానే చుట్టూ ఆశ్చర్యంగా చూస్తూ నేను నిన్న ఇక్కడిక్టేనా వచ్చింది అని ఆశ్చర్యపోతుండగా చివరగా ఉన్న చిన్న చిన్న పనులను పరిశీలిస్తున్న కాంట్రాక్టర్ మహేష్ ను చూసి అతడి దగ్గరికి వచ్చి ఇంకో గంటలో మొత్తం అయిపోతుంది అని రాత్రంతా నిద్రలేక కళ్ళు ఎర్రగా అయ్యినా ఒక మంచి దానికోసం చేస్తున్నాడని సంతృప్తే అతడి ముఖంలో కనిపిస్తుండగా వెంటనే సంతోషంగా అతడికి సెల్యూట్ చేస్తూ ఇంతపనిని ఒక్క రాత్రిలో కంప్లీట్ చేసినందుకు అతడి నిబద్ధతకు ఫిదా అయిపోతాడు.

మొత్తం ఎంత ఖర్చు అయ్యింది తెలుసుకొని దానికి రెండింతలు ఇవ్వగా అతడు సంతోషించగా ఇందు ఉన్న చోటికి భయలుదేరుతాడు. ఆ హోటల్ కు చేరుకున్న మహేష్ లోపలకు వెళ్తుండగా కొంత మంది ముసలివాళ్ళను మరియు చిన్న పిల్లలను లోపలకు వెళ్లనీయకుండా కాపలా ఉన్నవాళ్లు ఆపుతుండగా మహేష్ వాళ్లదగ్గరకు వెళ్లి ఎవరు మీరు ఎందుకు లోపలకు వెళ్ళాలి అనుకొంటున్నారు అని అడుగగా మా కష్టాలు తెలుసుకొని మాకు సహాయం చేసిన ఇందు గారిని కలిసి తమ ఆశ్రమానికి ఆహ్వానించడానికి బ్యాంకుకు వెళితే ఇక్కడికి వచ్చారని చెబితే ఇక్కడికి వచ్చాము బాబు మీరే ఎలాగయినా లోపలికి పంపించి మా కోరికను ఆ మహానుభావురాలికి చెప్పుకోవాలి అనగా వారిని లోపలికి పంపవలసిందిగా చెప్పగా ఎంతకీ వినకపోవడంతో అది చూసిన డ్రైవర్ లోపలికి వెళ్ళి చైర్మన్ కు విషయం తెలుపగా వెంటనే హోటల్ manager కు కాల్ చేసి మొత్తం వివరించగా అతడే స్వయంగా వచ్చి కాపలా వాళ్ళను తిట్టి అందర్నీ లోపలకు పంపుతారు.

మహేష్ వాళ్ళను లోపలికి పిలుచుకొని పోతూ పెద్దయ్య నేను ఆమె కింద పనిచేస్తాను మీరు ఎన్ని గంటలకు ప్రోగ్రామ్ పెట్టుకుంటారు అని అడుగగా సాయంత్రం అని చెప్పగా అయితే మేడం ను సాయంత్రం పిలుచుకొని వచ్చే బాధ్యత నాది అని వాళ్ళను వెనుక ద్వారం గుండా హాల్ లోనికి పిలుచుకొని వెళ్లి మధ్యలో ఖాళీ చైర్లలో కూర్చోబెడతాడు. అందరూ ఆమె కోసమే వేచి చూస్తున్నట్టు ఆమె కూర్చోగానే స్టేజి మీద మైకు దగ్గరికి ఒకరు రాగా అక్కడికి వచ్చిన న్యూస్ ఛానెల్స్ లైవ్ coverage ఇస్తుండగా సభనుద్దేశించి పరిచయాలు అయ్యాక అన్ని బ్యాంకుల చైర్మన్ లను ఒక్కొక్కటిగా స్టేజి మీదకు పిలిచిన తరువాత ఇందు బ్యాంక్ చైర్మన్ ను మాట్లాడవలసిందిగా కోరగా ,

3 Comments

  1. Sir mahesh first amenu kalisinappude 1 month mundhe na birthday ayindhi ani annaru
    Malli eppudu ame birthday anti

    1. Yendhayya idhi yemaina lesson,meku intresting vundhi gaa chusi kottukodame gani,yedho pedda logic laa aduguthunnav

  2. Super next post please

Comments are closed.