జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 3 114

దారిలో తన ఫోన్ కు కాల్ చేసి అమ్మ పని ఇంకా ఉండటం వల్ల బయటే తింటాను మీరు తినెయ్యండి అని చెప్పి miss you అమ్మ అని ఫోన్ లో ఒక ముద్దు పెట్టి హోటల్ కు చేరుకుంటాడు . లోపలికి వెళ్లగా వెయిటర్ వచ్చి పెరు కనుక్కోగా బ్యాంక్ చైర్మన్ గారు రమ్మన్నారు అని చెప్పడంతో ఒక టేబుల్ దగ్గర తీసుకువెళ్లడంతో అక్కడ అప్పటికే నా కోసం వైట్ చేస్తున్న వ్యక్తి చైర్ లోనుండి లేచి నా దగ్గరికి వచ్చి నేనె మీకు కాల్ చేసింది ,ఇందు పని చేసే బ్యాంక్ కు చైర్మన్ నా పేరు శ్రీవాస్తవ అని పరిచయం చేసుకుని , మిమ్మల్ని కలవడం చాలా సంతోషం సర్ , నా పేరు మహేష్ .

Nice to meet you మహేష్ ,మిమ్మల్ని ఎందుకు పిలిచానో మీకు తెలుసు , మరి ఏ రోజు ఫంక్షన్ పెట్టుకుందామో ఒకసారి ఇందుని అడిగి చెబితే నేను మిగతా బ్యాంకుల చైర్మన్ లకు తెలిపి అంత మేమె చూసుకుంటాము ఒక అరగంట ముందు వస్తే చాలు అని చెప్పగా, అయితే రేపే పెట్టుకుందాము ఎందుకంటే రేపు ఇందు గారికి ప్రత్యేకమైన రోజు( …………. ) అని చెప్పి ఆమెకు తెలియకుండా surprise ప్లాన్ చేద్దామని చెప్పగా ,మహేష్ సూపర్ గా ఉంది నీ ప్లాన్ అని చెప్పగా, రేపు 11 గంటల కల్లా ఆమెను పిలుచుకొని వస్తాను అని హామీ ఇవ్వగా , అప్పటికే ఆర్డర్ ఇచ్చిన భోజనం రాగా తినేసి సర్ ఫుడ్ చాలా బాగుంది అని చెప్పి రేపు కలుద్దాము అని చెప్పగా బయటకు వస్తుండగా అక్కడ ఉన్న టీవీలో గోవా లో ఉన్న అనాధ ,

వృద్ధ మరియు అంధ పిల్లల కష్టాలు మరియు వారు పడుతున్న బాధలు గురించి ఒక ప్రోగ్రాము ద్వారా చెబుతుండగా సహాయం చెయ్యవలసిన వాళ్ళు ఈ అకౌంట్ లకు పంపవలసిందిగా చిన్న చిన్న పిల్లలు ప్రాధేయపడుతుండగా హృదయం చాలిచిపోగా ఆ అకౌంట్ నెంబర్లు ను మరియు అడ్రస్ రాసుకొని , బిగ్ బజార్ కు వెళ్లి తనకు ఒక జత బట్టలు కొనుక్కొని తన తల్లి కోసం రేపటి ఫంక్షన్ కోసం ఒక కాటన్ చీర మరియు మరొక పలుచటి రెడ్ కలర్ చీర తీసుకొని టాప్ ఫ్లోర్ లో ఉన్న decoration ఐటమ్స్ ఏవేవి కావాలో తీసుకొని బిల్ కట్టేసి అన్ని ఓమ్ని లో వెనుక వేసుకొని ఎలెక్ట్రానిక్ షాప్ కు వెళ్లి కొన్ని మీటర్ల సిల్క్ వైర్ మరియు 10 లైటింగ్ సెట్స్ మరియు ఒక పెద్ద గుండ్రంగా ఉంది డిం గా వెలిగే బుల్బ్ ను తీసుకొని ఓమ్నిలో పగలకుండా అన్ని సర్ది తన ప్లాన్ లో ఉన్న అన్ని ఐటమ్స్ తీసుకున్నానని నిర్ధారించుకున్న తర్వాత , జేబులో ఉన్న అడ్రస్ ఒక సారి చూసి ఆ ప్రాంతానికి భయలుదేరుతాడు.

3 Comments

  1. Sir mahesh first amenu kalisinappude 1 month mundhe na birthday ayindhi ani annaru
    Malli eppudu ame birthday anti

    1. Yendhayya idhi yemaina lesson,meku intresting vundhi gaa chusi kottukodame gani,yedho pedda logic laa aduguthunnav

  2. Super next post please

Comments are closed.