అదంతా గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. టింకూ, పిన్ని అంటే చాలా బోలెడంత ఇష్టమున్నా నేను అలా అననులెండి” అన్నాడు ఆదిత్య. నేను ఏమీ మాట్లాడకుండా కిందకు వచ్చేశాను. ఆ మరుసటిరోజు డాబా మీదకు వెళ్ళలేదు. రెండోరోజు, మూడోరోజు కూడా నేను డాబా మీదకు వెళ్ళలేదు. సిగ్గో, బెదురో తెలియదుగానీ ఆదిత్య ఎదురుపడడం నాకు ఇష్టం లేకపోయింది. నాలుగోరోజు సాయంకాలం యధాప్రకారం వీధి వరండాలో కూర్చుని టింకూని ఆడిస్తున్నాను. ఆరోజు మా బావ ఊర్లోలేడు. అక్కయ్య లోపల వంటపనిలో వుంది. వరండా లైటు వేయాలనిపించినా బద్ధకం వల్ల లేవలేకపోయాను.
భజన పక్కింటి దగ్గరికొచ్చి ఆగడంతో ఇక తప్పదని పైకి లేచాను. ప్రతి శనివారం ఇలా ఊర్లో ప్రతి ఇంటికి భజనొస్తుంది. ఓ పదిమంది కుర్రాళ్ళు వీధిలో నిలబడి భజన చేస్తుంటారు. భజన ముందు గెరడు గొమ్ము పట్టుకుని ఓ వ్యక్తి వుంటాడు. గెరడు గొమ్మంటే పెద్ద దీపపు స్తంభం అన్నమాట. ఈ గెరడుగొమ్ము ఎత్తుకున్న వ్యక్తి ప్రతి ఇంటి వరండాలోకి వచ్చి నిలబడతాడు. అతనితోపాటు మరో వ్యక్తి పెద్ద ప్లాస్టిక్ టిన్ ఎత్తుకు వస్తాడు. ప్రతి ఇల్లాలూ కాస్తంత నూనెను ఆ టిన్ లో పోయాలి. ఈ నూనెతో గుడిలో దీపారాధన జరుగుతుందన్న మాట. ప్రతి శనివారం సాయంకాలం ఇలా భజన తప్పనిసరి. కేవలం బతకడం కోసం వాడు తన భార్యని తండ్రికి అప్పగించడానికి రెడీ అయిపోయాడు. నిజంగా ఇలాంటి మనుషులుంటారా అన్న ఆశ్చర్యంతో నోటిలో మాట బయటికి రాలేదు.
నేను సిగ్గు లేకుండా తిట్టాను! మా ఇద్దరి మధ్యా పెద్ద ఘర్షణే జరిగింది. కానీ వేరే కాపురానికి వాడు ఒప్పుకోలేదు. “అయితే ఏ బావిలోనో దూకి చస్తాను” అని ఆవేశంతో పెరడు తలుపు తెరుచుకుని బయటపడ్డాను” అంటూ చెప్పసాగింది ప్రియ. “అలా ఎంతసేపు నడిచానో తెలియదు. చీకటిలో నేను చీకటైపోయాను. చచ్చిపోదామని బయల్దేరిన నేను ఎందుకనో చావలేకపోయాను. అలా నడిచి, నడిచీ, తెల్లవారుజాము మూడుగంటలకి టౌన్ కు చేరుకున్నాను! మా అక్కయ్య వూరెళ్ళడానికి లారీ ఎక్కాను! అంత భయంకరమైన సంఘటనలు చూసిన తర్వాత లారీ ఎక్కడమనేది చాలా చిన్న సాహసంగా తోచింది. నాన్నకు మరో సంవత్సరం ఎక్స్ టెన్షన్ రావడంతో ఆయన హైదరాబాదులోనే వున్నారు అందువల్ల అక్కయ్య ఇంటికి బయలుదేరాను.

It agree, this magnificent idea is necessary just by the way
Sveiki, as norejau suzinoti jusu kaina.