రియా – part 2 68

“అభి….ఐ యాం సారీ నేను కూడా నీతో చాలా రాష్ గా వున్నాను….”అని చెప్పింది రియా

అలా వాళ్లిద్దరూ మళ్లీ కలిసిపోయారు……..అంటే మామూలుగా మాట్లాడుకోవడం వరకే….రియా కి ఎప్పుడూ అభి పై ఎలాంటి ఫీలింగ్ కలగలేదు…….అలా ఇంకో సంవత్సన్నర గడిచింది…..రియా ఇప్పుడు 3 ఇయర్…అభి ఫైనల్ ఇయర్ చదువుతున్నారు……

ఒకరోజు…….తలుపు బళ్ళున తెరుచుకోవడం తో తల ఎత్తి చూశాడు అభి….ఎదురుగా రియా…..కోపంతో ఊగిపోతుంది….

“హే రియా….ఏమయ్యింది?అలా వున్నావ్?”అడిగాడు అభి

“నువ్వు అమెరికా కి ఎందుకు వెళ్ళట్లేదు….?”అడిగింది రియా

“నాకు ఇంట్రెస్ట్ లేదు…..”జవాబిచ్చాడు అభి

“ఇంట్రెస్ట్ లేదా….అబద్ధం చెప్పకు అభి…నువ్వెందుకు వెళ్లనంటున్నావో నాకు రీసన్ తెల్సు…..స్టాప్ బిహేవింగ్ లైక్ ఏ చైల్డ్…..!సరేనా నాకు తెల్సు నీకు ఎం.ఎస్ చెయ్యడం అంటే చాలా ఇష్టం అని…..సో నువ్వు అమెరికా కి వెళ్తున్నావ్ ఎండ్ దట్స్ ఫైనల్…”చెప్పింది రియా

“నీకు రీసన్ తెల్సున్నావ్ కాబట్టి చెబుతున్నా రియా….నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్లను…యండ్ దిస్ ఈస్ ఫైనల్…”చెప్పాడు అభి……

అభి చెయ్యి లాక్కొని…..తన తల మీద ఒట్టు వెయ్యించుకుంటూ…”నువ్వెళ్లకపోతే నా మీద ఒట్టె ఇంకేమి మాట్లాడకు……”అని అంది రియా

“సరే…..నా కండీషన్ కి నువ్వు ఒప్పుకుంటానంటే…నేను వెళ్తాను….సరేనా…?”అన్నాడు అభి

“హా సరే ఒప్పుకుంటున్నా…….”అంది రియా

సరే రా…అని తన చెయ్యి పట్టుకుని హాల్లో కి తీసుకెళ్తుండగా…..”ఇంతకీ కండీషన్ ఏంటి…?”అంది రియా…..హల్లొకి రాగానే….రియా వాళ్ల అమ్మా నాన్నలని కూడా పిలిపించి……అందర్నీ కూర్చోబెట్టి……

“నేను-రియా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం………నేను ముందు ఎగేజ్మెంట్ చేసుకొని అమెరికా వెళ్తాను…..తిరిగి వచ్చాక మా పెళ్ళి చెయ్యండి…….”అని చెప్పి వాళ్ళ అంగీకారం కోసం ఆగాడు అభి…….

అందరూ హ్యాపీ గా ఫీలయ్యారు ఒక్క రియా తప్ప……..కండీషన్ అంటే ఏంటొ అనుకుంది కానీ ఇలా లాక్ చేస్తాడనుకోలేదు……….

ఆ రోజు నుంచి మళ్లీ రియా అభి తో ముందులా వుండలేకపోయింది………

అలా రెండేళ్ళు గడిచాయి……అభి అమెరికా నుంచి తిరిగి వస్తుండడం తో రియా ఇలా మధ్యలోనే పారిపోయి వచ్చేసింది……..

******

“అది అండి విజయ్ గారు.,….నా అతి ప్రేమ స్టోరి……..”అని చెప్పడం ముగించి మంచినీళ్ళు గటగటా తాగింది రియా

“వావ్ గ్రేట్ లవ్ స్టోరి “అన్నాడు విజయ్

“ఓహో అవునా…సర్లేండి…”అంది రియా

“అవునూ మీకు అభి అంటే ఎందుకు ఇష్టం లేదండి……..?”అడిగాడు విజయ్

“ఇష్టమే ప్రేమ లేదంతే…”అంది రియా

“అదే ఎందుకు……..?”అన్నాడు విజయ్

టైం……..4:30 అవుతుండగా….రియా ఏదో చెప్పే లోపల…….అభి(టార్చర్) నుంచి కాల్ వచ్చింది………ఈ సారి రియా కట్ చెయ్యలేదు……ఒక్క రింగ్ కే ఫోన్ ఎత్తింది…….

“నేనంటే ప్రేమ అనుకున్నాను రియా కానీ అది లేదని ఈ రోజే తెల్సింది……నీ మనసులో నా పై నింపుకున్న ద్వేషాన్ని చూస్తుంటే…నా పై నాకే జాలి వేస్తుంది…….కాదు కాదు కోపం వస్తుంది……నీ వల్లే నన్ను నేను ప్రేమించాను రియా కానీ నీ వల్లే ఈ రోజు నన్ను నేను అస్యహించుకుంటున్నా….నా ప్రేమకు బానే వెలకట్టావ్ రియా……థ్యాంక్యూ సో మచ్……థ్యాంక్యూ సో మచ్ ఫర్ యువర్ కన్ సర్న్……….ఐ హేట్ యూ రియా…….బట్ ఐ లవ్ యూ…….!”అని ఫోన్ కట్ చేశాడు అభి…….

2 Comments

  1. Anna continue ramuku autograph plz plz,ramu jareena dengudu affair ramu Anitha tho dengudu ramu manasa Pragathi anjali deepika lago sex encounters rayandi plzzz continue ramulu autograph

Comments are closed.