రియా – part 1 231

1.పరిచయం
ట్రైన్ నెంబర్ 2456 తిరుపతి నుంచి విజయవాడ వెళ్ళు ఎక్స్ ప్రెస్ ఒకటవ నెంబర్ ప్లాట్ ఫారం పై ఆగి వున్నది….అని రైల్వేస్టేషన్ లో అనౌంస్ మెంట్ అలా వినిపించి ట్రైన్ ఇలా వచ్చి ఆగిందో లేదో….ఇలా ట్రైన్ దిగింది రియా….తన బుజాలకి వున్న బ్యాగ్ ని సరి చేసుకుని కళ్ళకి వున్న కళ్ళద్దాలు కూడా సరి చేస్కుని ముందుకు నడిచింది …..

ట్రైన్ కదలడానికి సిద్ధం గా వుందని ఈ సారి ఇంకొ ఎనౌంస్ మెంట్ వచ్చేసరికి రియా ఎంట్రంస్ దగ్గరవుంది…..

అన్నట్టు గానే ట్రైన్ కదిలింది

రియా వెనుదిరిగి మళ్ళీ చూసింది ట్రైన్ వంక…… కంట్లోంచి కన్నీరు జాలు వారి చెక్కిలి పై పడింది……

అదేమీ పట్టించుకోని రియా ముందుకు కదిలి రైల్వేస్టేషన్ బయటకి వచ్చి అటూ ఇటూ చూసింది ….ఆ తర్వాత వాచ్ చూసింది టైం ఒంటి గంట దాటి పది నిమిషాలయ్యింది…..

బయటకి నడిచి ఆటో స్టాండ్ ని సమీపించింది…..

“మ్యాడం ఆటో కావాలా…?”అడిగాడు ఆటో అతను….

“ఆటొ వద్దు లిఫ్ట్ కావాలి…”అంది రియా

“మీకు కావాలన్నా నేను అమ్మను లేండి….అయినా దాన్ని లిఫ్ట్ అనరు మ్యాడం…..సరే గానీ మీరు ఎక్కడికి పోవాల్న….?”అడిగాడతను