రియా – part 1 231

2 గంటల తర్వాత….స్టాప్ రావడం తో……మేల్కున్న అభి….రియా తో కలిసి బస్టాండ్ లో దిగాడు……

రా అని తన చెయ్యి పట్టుకుని బైక్ పార్కింగ్ ఏరియా కి తీసుకువెళుతుండగా అతన్నే అనుసరిచిన రియా కి మనసులో ఏదో అలజడి……….!!!

బైక్ స్టార్ట్ చేసిన అభి….”రా ఎక్కు …”అనేసరికి….”ఈ బైక్ ఎక్కడిది……?”అనుమానంగా అడిగింది రియా

“నా ఫ్రెండ్ ది….మెసేజ్ చేస్తే తెచ్చి ఇక్కడ వుంచాడు రా ఎక్కు లేట్ అవుతుంది……”అని తన చెయ్యి పట్టుకుని చెప్పాడు

అతడు పట్టుకున్న తన చేతినే అలా చూస్తూ వుండిపోయింది రియా…….అలా ఎక్కి తన భుజాన్ని పట్టుకుంది……..

“మన విషయం ఇంట్లో చెప్పేదాం అనుకుంటున్నా….రియా”అన్నాడు అభి…..

ఆ మాట తో ఉలిక్కి పడింది రియా……..!!!

4.ఫ్లాష్ బ్యాక్ లో…?
“మన విషయమేంటి….?అభి….?నాకేమి అర్థం కాలేదు…..”టెన్షన్ పడుతూ అడిగింది రియా

“ఏం లేదులే ఇల్లు వచ్చింది దిగు…..”అనేసరికి దిగేసి వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది రియా

ఆ మరుసటి రోజు పేపర్ లో మెయింస్ కీ పడటంతో తన దగ్గరున్న అభి క్వశ్చిన్ పేపర్ లోని ఆంసర్స్ పేపర్ లో పడిన వాటితో పోల్చి చూసింది……300 మార్క్స్ వస్తున్నాయి 360 కి…….ఆ మార్కులు చూసిన రియా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి…….