రియా – part 1 231

అతను వెళ్ళిన వైపే చూస్తూ మనసులో అనుకుంది రియా…”ఏమో అనుకున్నా మంచోడే….”

టైర్ బిగించేశారు…..తన పని అయిపోవడం తో….షర్ట్ దులుపుకుంటూ వచ్చాడు విజయ్…..షర్ట్ అంతా మట్టి అయ్యి…తెల్ల చొక్కా కాస్తా నల్ల చొక్కా అయ్యింది……తన వైపు వచ్చిన విజయ్ కి తన దగ్గరున్న నీళ్ళు అందించి అతని నుదిటి కి అంటిన చెమట ని తన చీర కొంగు తో తుడిచింది రియా

అలా ఆమె తుడుస్తుంటే అలానే ఆమె కళ్ళలోకి చూస్తుండి పోయాడు విజయ్…..

ఆమె కూడా అలానే అతని కళ్ళలోకి చూస్తుండిపోయింది……

ఫ్లాష్ బ్యాక్………

సెకండ్ షో ముగించుకొని….ఇంటి దాకా వచ్చిన రియా గోడ దూకుదామని అలా గోడ ఎక్కి కిందకి చూస్తూ……ఇవాళ పక్కా నా ఎముకలన్నీ విరిగి పోతాయి దేవుడా నువ్వే దిక్కు అని క్యాలిక్యులేషన్లు కూడా వేసుకుందో లేదో…ఇలా ఎవరో తన నడుము దగ్గర పట్టుకున్నట్టు అనిపించి అలా కళ్ళు తెరచిందో లేదో ఇలా తన నడుమును పట్టుకుని తనని కిందకి దించాడు అభి……

ఆ తర్వాత కూడా తనని భుజాల పై మోసుకోని ఇంటి లోపలికి ఆ తర్వాత పైన వున్న తన గదికి అలానే మోసుకెళ్ళాడు……అతని కళ్లలో తన పై ప్రేమ ,బాధ్యత…..చిరు కోపం అన్నీ కనిపించాయి….ఆ అయిదు నిమిషాల్లో…..అలా గదిలోకి తీసుకు రాగానే తనని బెడ్ పై పడుకోబెట్టాడు…….

అయినా కూడా రియా చూపులు అతని కళ్ళ నుంచి మరవలేదు…….

“రియా…రియా…”అని చిటెక వేసి మరీ విజయ్ పిలుస్తుండడం తో ఈ లోకం లోకి వచ్చింది రియా

ప్రయాణం మరలా మొదలయ్యింది……..టైం 2:30

“మ్యాడం గారు…..కొంచెం మీ స్టోరి ని రామాయణం లా వర్ణించగలరా…?”గోముగా అడిగాడు విజయ్

“నీ సేవకు మెచ్చితిని….మన ప్రయాణమునకు కారణమైన నీ కోరిక మన్నించకపోతే ఎలా….?చెప్పేదను…జాగ్రత్తగా వినుము….”అని చెప్పడం మొదలుపెట్టింది………

“అలా నేను కిచెన్ లోంచి బయటకి వచ్చాను”….ఇలా ఉష అత్త ఆ అబ్బాయిని తీసుకొచ్చి….”నాన్నా! మా వాడు కూడా మీ స్కూల్ ఏ వాడ్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళరా….?”అని బతిమాలుతూ అడిగింది…..

రియా:నాదసలే జాలి గుండె కదా…నేను కూడా ఒప్పేసుకున్నాను…అలా మేమిద్దరం నడుస్తూ స్కూల్ కెళుతున్నాం…..తను చాలా సైలంట్ గా నడుస్తున్నాడు…..నాకేమొ నోరు కుదురుగా వుండాదాయే….అందుకే తనని అడిగాను

“ఓయ్ నీ పేరేంటి…?”అని దానికి తను సమాధానం చెప్పలేదు….మళ్ళీ ఇంకోసారి అడిగాను…ఈ సారీ చెప్పలేదు…..ఇంకోసారి అడుగుదామని ఆగాను…..