రియా – part 1 231

అతని మాటలు వింటున్న రియా అలానే చూస్తుండిపోయింది……..!!!!!

అదే మాటలు విన్న అభి…..అతని వైపు కోపంగా వస్తున్నాడు…అతన్ని చూసిన రియా……ఎదురుగా వున్న అబ్బాయి చేతిలోని రోజా పువ్వు తన చేతిలోకి తీస్కుని అతని కళ్ళ లోకి చూస్తూ నవ్వింది………ఆ నవ్వు చూసిన అభి….నిల్చున్న చోటే స్థానువై పోయాడు………

అక్కడి నుంచి విసురుగా వచ్చేసి తన క్లాస్ వైపు నడిచాడు……..కంట్లోంచి నీళ్ళు వస్తుండగా ఎదురుగా వున్న దారి మసక బారింది………..

అలానే ఏడుస్తూ తన ప్లేస్ కి వెళ్ళి కూర్చున్నాడు అభి…..

చెప్పలేనంత బాధ తీరని మనోవేధన మనసును తొలుస్తుండగా …..జరిగిన క్లాస్లేవీ బుర్ర లోకి ఎక్కట్లేదు…….మనసులో ఒక్కటే ఆలోచన……”రియా…”

అలా ఉదయం కాస్తా మధ్యాహ్నం అయ్యింది……….బెంచ్ పై తల వాల్చి పడుకొని వున్నాడు అభి….అప్పుడు తన దగ్గరికి వచ్చింది షాలిని………అభి వాళ్ళ క్లాస్ మేట్

“ఏంటి…అభి….ఎమైంది ఎందుకలా వున్నావ్…?”అన్న మాట కి లేచి….షాలిని వైపు చూసిన అభి….ఏం లేదు అని క్లాస్ బయటకి వచ్చేశాడు…….ఏం చెయ్యాలి…?ఎక్కడికి వెళ్ళాలో తెలియక కారిడార్ లో తిరుగుతూ రియా వాళ్ల క్లాస్ వైపు గా వెళ్ళాడు అన్యమనస్కంగా…….

వాళ్ల క్లాస్ లోంచి నవ్వులు వినిపిస్తున్నాయి………ఆ నవ్వు ఎవరిదా అని చూసిన అభి మనసు వికలమైపోయింది…

ఉదయం రియా కి ప్రపోస్ చేసిన అబ్బాయి తో రియా మాట్లాడుతూ నవ్వుతోంది……

అలా రియా ని చూసిన అభి కి అక్కడ ఒక్క నిమిషం కూడా వుండాలనిపించక వచ్చేశాడు………

ఆ సాయంత్రం…..రియా ని బస్టాప్లో ఎక్కించుకోవడానికి వెళ్తున్నాడు అభి…….బస్టాప్ లో ఒంటరిగా వెయిట్ చేస్తుంది రియా……ఎందుకో రియా ముఖం చూడగానే అప్పటిదాకా మనసులో వున్న బాధ,వేదన ఒక్కసారిగా పోయాయి……..వెంటనే తన వైపు వెళ్ళడానికి స్పీడ్ పెంచిన అభి…..రియా వద్దకి ఆ అబ్బాయి రావడం తో……..అదే స్పీడ్ తో రియా చూస్తుండగానే ముందుకు వెళ్ళిపోయాడు……

ఇంటికి చేరిన అభి….బాధలో….తన రూం కెళ్ళి నిద్రపోయాడు…….టైం 7 అవుతుండగా….ఎవరో తన తలుపు తడుతున్నారు………ఆ శబ్దం వినపడినా వినిపించనట్టు దిండు అడ్డం పెట్టుకుని నిద్రపోసాగాడు…….అయినా తలుపు తడుతున్నవారు తడుతూనే వుండటంతో……..ఇక తప్పక……వెళ్ళి తలుపు తీశాడు…ఎదురుగా వాళ్ళమ్మ తో పాటు రియా వాళ్లమ్మ….కూడా కనిపించింది……

“ఏమైంది…..?”కళ్ళు నులుముకుంటూ ప్రశ్నించాడు అభి…..

“రియా ఏది……..?”అడిగింది వాళ్ళమ్మ…….

అంతే…రియా రాలేదు అని అర్థమయి పోయిన అభి…బైక్ కీస్ తీసుకుని మారు మాట్లాడకుండా బయటకి పరుగు తీసి బైక్ స్టార్ట్ చేసి 10 నిమిషాల్లో బస్టాప్ కి పోనిచ్చాడు…….ఒంటరిగా కూర్చోని కనిపించింది రియా…….

అభి ని చూడడం తోనే తన ముఖం లో రిలీఫ్ వచ్చిన మరుక్షణం కోపం కూడా రీప్లేస్ అయ్యింది………
“రియా…రా వెళ్దాం…”అని అభి అనేసరికి……..లేచి వచ్చి బైక్ పై కూర్చుంది…..ఇద్దరి మధ్యా మౌనం…..రియా ఏమైనా అడిగితే సమాధానం చెపుదామని అభి…