రియా – part 1 231

రియా:అవి నేను 4 వ తరగతి చదివే రోజులు……….ఒక రోజు పొద్దున్నే ఏవో సౌండ్లు…..వస్తున్నాయి…..బద్ధకంగా లేచిన నేను బాల్కని లోకి తొంగి చూశాను….అప్పుడు నేను చిన్నదాన్ని కదా హైట్ కొంచెం తక్కువ వుండెదాన్ని….

విజయ్:ఓ పెద్ద ఇప్పుడు 6 ఫీట్ వున్నట్టు మరి

రియా(కోపంగా):ఏంటి….?

విజయ్:అబ్బే ఏం లేదండి చిన్న పిల్ల కదా జనరల్లీ అలా పొట్టిగానే వుంటారు అంటున్నా
రియా:పొట్టిగా కాదు హైట్ తక్కువగా….సరే ఇక విషయాని కి వస్తే సో ఆ బాల్కని లోంచి ఎగిరెగిరి మరీ ఆ సౌండ్లు పక్కన ఇంట్లోంచి వస్తుంటే చూస్తున్నా……ఇంతలో ఒక అబ్బాయి ఇంచు మించు నా ఏజ్ ఏ వుంటుంది చాలా ఫెయిర్ గా వున్నాడు…..చేతిలో ఒక డజన్ పుస్తకాలతో నిల్చుని కనిపించాడు……నల్లని జుట్టు అల అలలు గా తన ముఖం పై పడుతూ అతన్ని చికాకు పెడుతుండగా సరి చెయ్యలేక తను అవస్త పడుతున్నాడు……..ఇంతలో ఆ అబ్బాయి…ఒక పక్కగా వెళ్ళి నిల్చున్నాడు……..అతని ముఖం నాకు సరిగ్గా కనిపించక పోవడం తో నేను ఇంకొంచెం ఎగిరి మరీ చూస్తున్నా…..అప్పుడే మా అమ్మ వచ్చి నా వీపు పై ఒక్కటి ఇచ్చింది…….. అంది సాడ్ గా

విజయ్:మరి ఇవ్వరా …?4 క్లాస్ కే అబ్బాయి లకి సైట్లు కొట్టె వాళ్ళని అలాగే కొట్టాలి…..

రియా:వామ్మొ…అమ్మ కొట్టింది అందుకు కాదుగా అలా ఎగిరి ఎగిరి చూస్తూ కాళ్ళు పైకి లేపేసాను నేనెక్కడ కింద పడతానో అని అమ్మ కొట్టింది ….ఇక ఆ రోజు నేను స్కూల్ కి రెడీ అయ్యి అలా సోఫాలో కూర్చుని ఫలహారం కానిస్తుండగా తను వచ్చాడు……..

విజయ్:ఎవరు పేపర్ బాయ్ ఆ….?

రియా:కాదు