రియా – part 1 231

అభి ఏమైనా మాట్లాడితే తిట్టెయాలి అని రియా ఎవరికి వాళ్ళు మౌనంగా ప్రయాణం ముగించారు…….

అలా వారం రోజులు గడిచాయి……ఇద్దరి మధ్య మాటలు లేవు……..ఈ మౌనం అభి ని కుంగదీస్తుంది…..

వారం కాస్తా 4 వారాలు అయిపోయాయి…….ఎగ్జాంస్ మొదలయ్యాయి…….ఇంతకు ముందు లా అభి దగ్గరకి వచ్చి చదువుకొవట్లేదు రియా…..

అభి-రియా ఒకే హాల్లో పడ్డారు……రియా ఏమి రాయకపోవడం అభి గమనించాడు…2 పరీక్షలకి అదే తంతు….రియా హాల్లో కి కి రావడం…పేపర్ తీసుకోవడం బెంచ్ పై పడుకుని నిద్రపోవడం……..

తన వైఖరి చూసి విసుగెత్తిపోయిన అభి……ఆ రోజు సాయంత్రం రియా వాళ్లింటి కి వెళ్ళాడు……

అభి ని చూసిన రియా కూడా పెద్ద ఆశ్చర్యపోలేదు………

అభి ఇంపార్టెంట్ క్వశ్చింస్ చెప్పి…చదవమని తన ల్యాప్ టాప్ లో ఏదో చూస్కోసాగాడు……..మధ్య మధ్యలో నవ్వుతున్నాడు…..అదంతా రియా ఒక కంట గమనిస్తూనే వుంది…….సరిగ్గా అభి ఏమైనా తినటానికి తీసుకువద్దామని కిందకి వెళ్ళేసరికి చిక్కిందే సంధు అని భావించిన రియా అభి ల్యాప్ టాప్ లోకి చూసి,………..షాక్ అయ్యింది!!!!!!!!