రియా – part 1 231

“ఆ కీ తప్పేమొ….!”అన్నాడు అభి…

“నిజం చెప్పు…అభి…”అడిగింది రియా

“హిం…..బాగా రాద్దాము అనే నేనూ అనుకున్నాను…కానీ ఎగ్జాం రాసేటప్పుడు నాకోటి అనిపించింది…అందుకే ఆంసర్స్ వచ్చినా తప్పు గా పెట్టాను…”అన్నాడు బెడ్ మీద కూర్చుంటూ అభి

“ఏమి అనిపించింది…….?”అర్థం కాక అడిగింది రియా

“ఒకవేళ నేను క్వాలిఫై అయితే అడ్వాంస్ లో క్వాలీఫై కాకపోయినా నాకు నిట్ లో సీట్ వస్తుంది…….ఇక్కడెక్కడా ఐఐటి కానీ నిట్ కానీ లేవు……నీకు దూరం గా వుండాలి……సో ఇవన్నీ ఆలోచించి……ఐఐటి లైట్ తీసుకున్నా..”అన్నాడు అభి

“నీకేమైనా పిచ్చా….ఐఐటి లైట్ తీసుకోవడం ఏంటి…….?ఐ డోంట్ ఎక్స్ పెక్ట్ దిస్ ఫ్రం యూ అభి…”అని విసురుగా బయటకి వచ్చేసింది రియా

రియా బయటకి రావడం తోనే….

“ఏమ్మా ఎలా వున్నాడు వాడు…”అడిగింది వాళ్ళమ్మ టెంషన్ గా

“బానే వున్నాడు….ఎంసెట్ వుంది కదా,….లైట్ తీసుకుంటాడు లే ఆంటి…..మీరు వర్రీ అవ్వకండి….”అని చెప్పి ఇంటికి కదిలింది రియా

అనుకున్నట్టు గానే ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది అభి కి……”హమ్మయ్య “అనుకుంది రియా

కానీ అభి కి వచ్చిన కాలేజ్ చూసి నీరస పడిపోయింది……అభి కి మంచి కాలేజ్ ఏ వచ్చింది కానీ ఆ కాలేజ్ వాళ్ళ వూరికి చాలా దగ్గరలో వుంది……అభి హాస్టల్ లో వుండి చదువుకుంటాడు అని ఆశలు పెట్టుకున్న రియా కి నిరాసే మిగిలింది…….

ఇక ఇలా కాదని తనే దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది………

అనుకున్నట్టుగానే చాలా కష్టపడి చదివింది…..కాదు కాదు అభి చదివించాడు………తనకి కూడా ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది…..అభి వాళ్ల కాలేజ్ తప్ప అన్నీ కాలేజ్ లూ ఆప్షంస్ పెట్టుకుంది…కానీ తనకి చిత్రంగా అభి వాళ్ల కాలేజ్ లో సీట్ వచ్చింది……..

తనకి సేం కాలేజ్ లో సీట్ రావడం తో ఇద్దరి పేరేంట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి……..

కానీ రియా కి మాత్రం చాలా కోపం వచ్చింది…..ఆవేశం తో వూగిపోతూ తాడో పేడొ తేల్చుకుందాం అని అభి వాళ్ళింటికి వెళ్ళి…అతని రూం లోకి అడుగుపెట్టింది……….

రూం లో ఎవరూ లేరు……….

రూం అంతా కలియ తిరుగుతూ వుండగా….????