రియా – part 1 231

“బస్ లన్నీ ఆగుతాయి సూడు అక్కడ…”అంది రియా

“ఒ బస్టాండ్ ఆ…పోదాం పోదాం 30 రూపాయాలు అవుతుంది పర్లేదా…?”అడిగాడతను

“వాయమ్మొ 30 రూపాయలే……20 రూపాయలు చేస్కో….”అని ఆటో ఎక్కేసింది రియా

ఆటో అతని ముఖం లో వే వేల కాంతులు 10 రూపాయల కిరాయికి 20 రూపాయలు వస్తున్నాయి మరి…..అద్దం లో అతని ముఖం చూసిన రియా ఛా….10 రూపాయలు కి అడిగి వుండాల్సింది అని చింతించ సాగింది…….ఆ బాధ ని రెట్టింపు చేస్తూ తన ఫోన్ రింగ్ అయ్యింది….

స్క్రీన్ పై…..టార్చర్ అని స్క్రోల్ అయ్యింది…..

ఆ పేరు చూడడం తోనే తల పట్టుకుంది రియా…..

“ఏమైంది మ్యాడం తల నొప్పా….మెడికల్ షాప్ దగ్గర ఆపమంటారా…?”అడిగాడు అతను