రియా – part 1 231

“అది…నేను మీ కాలేజ్ అస్సలు పెట్టుకోలేదు……కానీ నాకు మీ కాలేజ్ ఏ వచ్చింది……దీనికి కారణం నువ్వని నాకు తెల్సు కానీ……..ఎందుకిలా చేశావ్ అభి……?నువ్విలా చేయడం నాకస్సలు నచ్చలేదు….నాకంటూ సొంతం గా ఇష్టాలు ఆలోచనలు వుండవా…?అసలు నువ్వు అవి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావ్……ఎందుకిలా టార్చార్ చేస్తున్నావ్…..అసలు ఏమనుకుంటున్నావ్…..?నువ్వు మీ కాలేజ్ పెట్టడం వల్ల నాకేదొ ఉపకారం చేస్తున్నావనుకుంటున్నావేమో….అస్సలు కాదు….ఇప్పుడు చెబుతున్నా విను నాకస్సలు చదువు అంటే ఇష్టం లేదూ…కానీ చదివాను ఎందుకో తెల్సా కేవలం కేవలం నీకు దూరంగా వుండాలి అనే…నా కష్టానికి ప్రతిఫలం దక్కకుండా చేసావ్…నీ ఉపకారం ఎప్పటికి మర్చిపోను……ఇప్పటి నుంచు నువ్వు నాకు అభి వి కాదు అభిమన్యు వి…….నీకు నాకు ఎలాంటి పరిచయం లేదు……..కాలేజ్ లో ఇలానే వుండాలి….నీతో బైక్ పై కాలేజ్ కి వెళ్లమంటారు అమ్మ వాళ్ళు….నువ్వు నన్ను బైక్ పై తీసుకెళ్ళి బస్టాండ్ లో దింపాలి..మళ్ళీ బస్టాండ్ లో ఎక్కించుకుని తీసుకురావాలి….నాతో కాలేజ్ లో అస్సలు మాట్లాడానికి ట్రై చేయకూడదు……నా క్లాస్ ల బయట తిరిగకూడదు……ఇవన్నీ నువ్వు చేస్తేనే నేను నీతో ఒకటి అరా అయినా మాట్లాడతా లేకపొతే అది కూడా మాట్లాడను ఇక నీ ఇష్టం…”అని లేచి వెళ్ళిపోయింది రియా

తను చెప్పింది విన్న అబీ మనసు విరిగిపోయింది

కాలేజ్ మొదటి రోజు….

చెప్పినట్టుగానే బస్టాండ్ లో రియా ని దించేసి అభి వెళ్ళిపోయాడు కాలేజ్ కి…..ఒక అరగంట గడిచాక రియా కూడా కాలేజ్ చేరింది…….ఫస్ట్ డే కావడం తో సీనియర్స్ అంతా జూనియర్స్ కోసం వెయిట్ చేస్తూ వున్నారు…….

రియా కాలేజ్ లోకి అడుగుపెట్టడం తోనే అభి వాళ్ల బ్యాచ్ లో వాళ్ళు రియా ని పిల్చారు……

రియా వినిపించుకోకుండా వెళుతుండగా….ఈ లోపు అభి మాటలు వినిపించాయి తనకి

“రేయ్…తనని పిలవొద్దు…..పిలిస్తే బాగోదు చెబుతున్నా తనని అలా వెళ్ళనివ్వండి…”అని అభి అంటున్నాడు….ఆ మాటలు వినడం తోనే రియా ముందుకు వెళ్ళేది కాస్త వాళ్ళ దగ్గరికి వచ్చింది….

వాళ్లలొ ఒకడు…”నిన్ను కాదులే చెల్లమ్మా నువ్వెళ్ళు…”అని అన్నాడు….

“ఎందుకు సార్ మీరు నన్ను ర్యాగింగ్ చేయరా…?”అడిగింది రియా

అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు…”ఏంటీ అమ్మాయి…ర్యాగింగ్ చేయరా అని అడుగుతుందేంటి…?”అని ఆశ్చర్యం లో వుండగా

ఒకడు తేరుకుని…”లేదు నువ్వెళ్ళమ్మా..”అన్నాడు
“పర్లేదు సార్ చెయ్యండి”అంది రియా……ఒక వైపు అభి ముఖం లో మారుతున్న రంగులు చూస్తూ

ఇంకో అతను చేతులు జోడిస్తూ…”తల్లీ నీ వరస చూస్తుంటే నువ్వే ర్యాగింగ్ చేయించుకోని వెళ్ళి మా మీద కంప్లెయింట్ ఇచ్చేటట్టున్నావ్….మాకంత బంపర్ ఆఫర్ వద్దులేమ్మా…నీకు దండం పెడతాం వెళ్ళమ్మా…”అని వేడుకునేసరికి….”మీ బ్యాడ్ లక్…”అని ముందుకు కదిలిందో లేదో……

ఒక అబ్బాయి వచ్చి రియా ఎదురుగా మోకాలి మీద కూర్చుని…….చేతిలోని గులాబి రియా కి అందిస్తూ

“నిన్ను చూసిన క్షణం …..నా మనసు నన్నొ మాట అడిగింది….ఇన్నాళ్ళు నువ్వు లేని నేను ఎలా బతికి వున్నాను అని….అప్పుడు నేను చెప్పాను దానికి… ఇన్నాళ్ళ నా వెతుకులాటకి ,వేదనకి దొరికిన ప్రతిఫలం నీవు….ఇప్పటి దాకా ఎలా బతికానో తెలియని నేను….ఇక మీదట నువ్వు లేక ఎలా బతుకుతానో తెలియట్లేదు…చిత్రంగా వున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా…నువ్వు లేపోతే బతకను అని నేను చెప్పను…కానీ ఆ బతుకు లో ఆనందం వుండదు….బాధ తప్ప…..

ప్రేమ వుండదు వేదన తప్ప…….ఐ లవ్ యూ…..”