రియా – part 1 231

రియా అంత సేపు ఆలోచిస్తుండడం తో విజయ్ కలగ చేసుకుని…”మీకు ఇబ్బంది ఐతే చెప్పొద్దు లేండి….”అని అన్నాడు

“అయ్య బాబోయ్ మీరు మరీ మొహమాటొస్తుల్లా వున్నారే…..చెబుతాను గానీ దాని కన్నా ముందు ఈ బుగ్గ చుక్క పోవడానికి నాకు సహాయం చేయండి….”అడిగింది రియా

“సహాయమా…?ఎలా?”అడిగాడు విజయ్

“మీకే తెలుస్తుంది లే….”అని బ్యాగ్ వెతకసాగింది…తనకేమి కనిపించక పోవడం తో ఒక్కొక్కటిగా బ్యాగ్ లో వున్న వస్తువలన్నీ తీసి విజయ్ చేతికి అందిస్తుంది…విజయ్ అన్నీ పట్టుకోలేక కుస్తీ లు పడుతున్నాడు……అయినా కూడా రియా కి తనకి కావాల్సిన వస్తువు దొరకలేదు….

“ఏమి చూస్తున్నారండీ…”ఆతృతగా అడిగాడు విజయ్

“అద్దం…అద్దం….మిర్రర్…”అంది రియా తన బ్యాగ్ లో తల పెడుతూ

“అయ్యొ రామా…అద్దం ఎందుకండి…?”అయొమయంగా అడిగాడు విజయ్

“చూడండి విజయ్ గారు బుగ్గ చుక్క ని తుడవాలంటే బుగ్గ చుక్క లొకేషన్ తెలియాలి కదా….?”అందుకే అద్దం కావాలా వద్దా…?”అడిగింది రియా

“వామ్మొ లొకేషన్ ఆ అదేమన్నా పోలీస్ స్టేషన్ ఆ లేక రైల్వే స్టేషన్ ఆ లొకేషన్లు వుండడానికి…?ఇంతోటి దానికి అద్దం ఎందుకండి…?నేను చెబుతాను గా ఎక్కడుందో….”అన్నాడు విజయ్….

“గుడ్ ఐడియా ఎక్కడ…?”అడిగింది రియా