రియా – part 1 231

విజయ్:ఒకవేళ అప్పుడే వచ్చిన సిన్మాల ప్రభావేమొ….

రియా:నేను అలానే అనుకున్నాను……..అందుకే లైట్ తీసుకొని….ఇంటికి వచ్చేశా…ఆ రోజు నుంచి వాళ్ళింటి వైపు పోలేదు…….కానీ…..!

అంటూ ఆగింది రియా

విజయ్:హా కానీ…….?!……..

“హా కానీ చెప్పు ఏమైంది….”ఆత్రంగా అడిగాడు విజయ్….

ఒక రెండు రోజుల తర్వాత…..రాత్రి 10:20 ఆ సమయం లో అనుకుంటా…ఏదొ చప్పుడవ్వడం తో లేచాను నేను……ఎదురుగా అభి…..ఒక్క నిమిషం నాకేమీ అర్థం కాలేదు…….

“అభి….నువ్వేంటిక్కడ…..ఆల్మోస్ట్ అరిచినంత పని చేశాను…….”నేను

ఇంతలో తనమొ ష్……..ఏమీ మాట్లాడకు అనేశాడు……నాకేం అర్థం కాలేదు…….”ఎందుకొచ్చావ్ “అని అడిగాను…….అలా అడిగానో లేదో తన మోచేతి కి తగిలిన దెబ్బ నా కంట్లో పడింది….ఒ పక్క రక్తం పోతున్నా తన కళ్లలో ఇంత కూడా బాధ నొప్పి కనిపించలేదు…..పైగా నవ్వుతున్నాడు అతను………

నా ప్రశ్న అభి చెప్పాడు….”2 డేస్ నుంచి రావట్లేదు కదా….చూద్దామని వచ్చాను…”అని అన్నాడు….అదేమీ నేను పట్టించుకోకుండా బ్యాండేజ్ తీసి నాకొచ్చిన విధంగా ఫస్ట్ ఎయిడ్ చేశాను….దానికి తను నా కళ్ళలోకి చూస్తూ నవ్వాడు……

“ఏంటి…అలా నవ్వుతున్నావ్…నీకు నొప్పి గా లేదా…?”అడిగాను నేను…

“నిన్ను చూశాగా నొప్పి పోయింది…”అని తను చెప్పాడు…..నాకు చాలా కోపమొచ్చి…తనని వెళ్ళమని చెప్పేసరికి తను కొంచెం నొచ్చుకున్నట్టు ముఖం పెట్టి వెళ్ళిపోయాడు……..

ఆ తర్వాత కూడా నేను వాళ్ళింటి కి వెళ్లలేదు…..ఒక 4 రోజుల తర్వాత అనుకుంటా ఉష అత్త మా ఇంటి కి వచ్చి నన్ను వాళ్ళింటికి లాక్కెళ్ళింది…..ఆవిడ అలా ఫోర్స్ ఫుల్ గా నన్ను తీసుకెళ్ళడం తో నాకేమీ అర్థం కాలేదు….కొంపదీసి వీడేమీ చెయ్యలేదు గా అని ముక్కోటి దేవుళ్ళకి దండం పెట్టుకున్నాను…..

వాళ్ళింటిలోకి అడుగుపెట్టడం తోనే నాకు షాక్ తగిలింది…..అభి….సోఫాలో కూర్చుని వాళ్ళ నాన్న తో నవ్వుతూ మాట్లాడుతున్నాడు…….ఇంతలో ఉషత్త నన్ను గట్టిగా హత్తుకుని……నీవల్లే రియా వాడు మాట్లాడుతున్నాడు….

“నావల్లా….?”అర్థం కానట్టు అడిగాను నేను

“వాడే చెప్పాడు నువ్వలా గల గలా మాట్లాడుతుంటే వాడికి కూడా మాట్లాడాలి అనిపించింది అంట….”అంది అత్త

“ఓహ్…సరే నేను వెళ్తాను…”అని బయల్దేరుతున్న నన్ను ఆపేసిందో చెయ్యి….ఆ చెయ్యి అత్తమ్మ ది అనుకున్నా కానీ కాదు ఆ చెయ్యి అభి ది….తను నన్ను చెయ్యి పట్టుకుని తన రూం లోకి లాక్కొని వెళ్ళాడు…
“వామ్మొ…..ఏం చేస్తాడా ఏమొ….”అని భయపడుతున్న నా దగ్గరికి వచ్చాడు అభి…….