రియా – part 1 231

“అబ్బా..బ్బా..నువ్వు ముందు బస్టాండ్ కి పోనివ్వవయ్యా…”అంది చిరకుగా రియా

ఆగకుండా ఫోన్ మోగుతూనే వుంది……ఏం చేయాలో రియా కి పాలు పోవట్లేదు……ఇంతలో బస్టాండ్ రానే వచ్చింది……ఆటొ అతనికి డబ్బులిచ్చేసి బస్టాండ్ లోపలికి అలా అడుగుపెట్టిందో లేదో తను ఎక్కాల్సిన బస్ అలా ముందుకు కదిలింది……

“ఆపండి……..అపండి…….”అంటూ బస్ వెంట పి.టి.ఉష లా పరుగు తీసి అలసి సొలిసి ఇక తన వల్ల కాక ఆగిపోయిన 2 సెకన్ల కి అల్లంత దూరం లో బస్ ఆగింది…….

“దేవుడా యూ ఆర్ దేర్….నువ్వున్నావ్…..”అని కాలు కాలు కొట్టుకుని అక్కడికి నెమ్మదిగా వెళ్లసాగింది….. తను బస్ కి దగ్గరయ్యే కొద్ది ….”ఏమ్మా…..ఎంతసేపు..? నీ వల్ల బస్ ఆపాము…త్వరగా రా….”అని ఊరంతా వినపడేలా అరుస్తున్నాడు కండెక్టర్……కం డ్రైవర్…….

అతని వైపు ఒక క్రూరమైన లుక్ ఇచ్చి బస్ ఎక్కిన రియా కి ఏ.సి గాలి చల్లగా తాకింది…..ప్రాణం లేచొచ్చినట్టు అనిపించి….తన టికెట్ తీసి తన సీట్ నెంభర్ చూడ సాగింది…….
“అక్కడ ఉంది ఒక్క సీటే….వెళ్ళక్కడ అగోరించు….”అని కండెక్టర్ అనడం తో ఆయన వైపు కోపంగా చూసింది….తన సీట్ పక్కన ఒక అబ్బాయి కిటికి వైపు తిరిగి కూర్చుని వున్నాడు….చెవుల్లో ఇయర్ ఫోంస్ పెట్టుకుని ప్రపంచాన్ని మర్చిపోయాడు….

“కలికాలం….”అని మనసులొ అనుకోబోయి బయటకే అనేసింది రియా…..

“ఇది చలికాలం అండి”అన్నాడాబ్బాయి……

“వామ్మొ….వీడి సెకలూ…”అని మనసులో అనుకుంది రియా

అలానే బొమ్మలా నిల్చున్న ఆమె ని చూసిన ఆ అబ్బాయి….”ఏంటండి కూర్చోకుండా తెగ ఆలోచిస్తున్నారు…?”అడిగాడు

“మీరు చెప్పలేదని…”వెటకారంగా అని కూర్చుంది రియా….

“మీరు పెళ్ళి నుంచి పారిపోయారా…?”కంగారుగా అడిగాడాబ్బాయి….

“వీడికెలా తెల్సిపోయిందబ్బా…”అని కంగారు పడి….ఆ కంగారు బయట పెట్టకుండా…”లేదే….అలా అడిగారేంటి….?”అనుమానంగా అడిగింది రియా

“మీ బుగ్గ పై బుగ్గ చుక్క చేతికి ఇన్ని గాజులు…..చూసి”అనుకున్నాలేండి అన్నాడు ఆ అబ్బాయి……

“ఏమో నేను డ్రామా ఆర్టిస్ట్ ని అయ్యుండొచ్చు కదా?”అంది రియా

“వామ్మొ నేనలా అలోచించనేలేదండి….మీ పేరు …?”అని అడిగి….మళ్ళీ తను ఏమి అనుకుంటుందో అని సందేహం వచ్చి….”మీకు ఇబ్బంది ఏమీ లేకుంటేనే చెప్పండి “అన్నాడాబ్బాయి…..

“అయ్యొ రామా…పేరు చెబితే ఆస్తులేమైనా కరుగుతాయా ఏంటి…అదేం లేదు మై నేం ఈస్ రియా ….మేరా నాం రియా….నా పేరు రియా….ఎన్ పేర్ రియా….గుక్కుతిప్పుకోకుండా చెప్పింది రియా

నా పేరు విజయ్….వెరీ నైస్ టూ మీట్ యూ అని చెయ్యి ముందుకు చాపాడు విజయ్….షేక్ హ్యాండ్ ఇచ్చింది రియా

“ఇంతకీ…..మీరు నిజం గా డ్రామా బ్యాచ్ ఏ నా…?”అడిగాడు విజయ్ కుతూహలంగా

“ఇప్పుడు ఇతనికి చెప్పాలా వద్దా…?అయినా ఇతను మనకేమి తర్వాత తారాసపడడు గా చెబుదాం లే అసలే ఎన్నో ఏళ్ళుగా తీరని వ్యధలా ఈ బాధని మోస్తున్నాను…….ఇక నా వల్ల కాదు చెప్పేద్దాం….”అనుకుని సిద్ధపడిపోయింది రియా