రియా – part 1 231

అభి కి మెయింస్ ఎగ్జాం వుండటంతో వాళ్ళ నాన్న కార్ లో తీసుకుని వెళ్దామని అనుకుంటారు…అదే విషయం అభి కి చెబితే….రియా కూడా రావాలి అప్పుడే నేనూ వస్తాను కార్ లో అనే సరికి తప్పక రియా కూడా బయల్దేరుతుంది……..

కార్ ముందు సీట్ లో అభి వాళ్ళ నాన్న వెనక్ సీట్ లో రియా ఇంకా అభి కూర్చున్నారు………

అభి రియా నే చూస్తున్నాడు…….రియా కి అన్ ఈసీ గా వుంది……

“ఏంటి వీడు అప్పుడెప్పుడో 4 వ క్లాస్ లో ప్రపోస్ చేశాకా మళ్లీ ఆ వూసె ఎత్తలేదూ ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా ప్రేమగా చూడలేదు…ఈ రోజేంటి ఇలా….?”అని తెగ ఆలోచించ సాగింది……..

2 గంటల జర్ని తర్వాత ఎగ్జాం హాల్ కి చేరాక……అభి వాళ్ళ నాన్న కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళగా రియా ని ఒక పక్కగా తీసుకెళ్ళిన అభి ఆమె కళ్ళలోకి చూస్తూ…..

“ఇంక కొన్ని రోజులే బంగారం నీకు నాకూ ఈ ఎడబాటు…..అతి త్వరలో మనకి కావల్సింది జరుగుతుంది…..భయపడకు”అని చెప్పి ఎగ్జాం రాయడానికి వెల్లిపోయాడు అభి

“వీడికి చదివి చదివి బ్రైన్ పోయినట్టు వుంది……..ఏం వాగుతున్నాడొ అస్సలు అర్థం కావట్లేదు…….”అని అయొమయం లో వుండిపోయింది……..

ఎగ్జాం ముగించుకుని రానే వచ్చాడు అభి……

“ఏరా ఎలా రాశావ్…….?”అడిగారు వాళ్ల నాన్న

“లేదు నాన్న…..బాగా రాయలేదు…….”చెప్పాడు అభి…

“ఏం పర్లేదు లే రా “అని ఆయన ధైర్యం చెబుతుండగా ఇంతలో ఫోన్ వచ్చింది……ఫోన్ మాట్లాడిన ఆయన

“అభి…నాకర్జెంట్ పని పడింది రా ఇటు నుంచి ఇటు హైదరాబాద్ వెళ్ళాలి……ఇప్పుడేలా…?’అన్నాడు ఆయన

“ఏం పర్లెదు నాన్నా…నేను రియా బస్ ఎక్కి వెళ్ళిపోతాము మీరు వెళ్ళండి…..మా గురించి టెంషన్ పడొద్దు నేనున్నా కదా….”అని చెప్పడం తో వారిద్దరిని బస్ ఎక్కించి ఆయన వెళ్ళిపోయారు……

కిటికి లోంచి చూస్తూ మౌనంగా వుండి పోయింది రియా

“రియా నీతో కొంచెం మాట్లాడాలి”అన్నాడు అభి……….

“వామ్మొ…ఏం చెబుతాడొ” అనుకుంటూ అతని వైపు తిరిగి “ఏంటి…?”అంది రియా

“ఊహు ఇప్పుడు కాదు….లే మళ్ళీ చెబుతా టైం వచ్చినప్పుడు…”అని ఆగిపోయాడు అభి….

“హమ్మయ్య” అనుకుంది రియా

ఒ పది నిమిషాలకే నిద్ర పోయిన అభి….రియా భుజం పై వాలిపోయాడు……రియా గుండె వేగం పెరిగింది అతని స్పర్శ తో…….ఇంకో పది నిమిషాలకి రియా చేతిలో తన చెయ్యేసి గట్టిగా తనని పట్టుకుని నిద్రపోయాడు అభి……!!!!!!