రియా – part 1 231

“ఇంకెక్కడ బుగ్గ మీద…..”చెప్పాడు విజయ్

“అబ్బా…కరెక్ట్ గా చెప్పండి లేకపోతే నా ముఖం మొత్తం కాజల్ తో మేక్ అప్ చేసినట్టు వుంటుంది…..”అనేసరికి డైరక్షంస్ చెప్పసాగాడు……

ఇంతలో రియా కి ట్రింగ్ మని ఙన బల్బ్ వెలిగి తన ఫోన్లో సెల్ఫీ మోడ్ అన్ చేసి ….తన బుగ్గ చుక్క ని తుడిచేసింది….గాజులు అన్నీ బ్యాగ్ లో వేసింది……కొంచెం స్థిమిత పడి ఊపిరి పీల్చుకుంది……

“ఇప్పటికైనా చెప్తుందా లేదా…?”అని ఆలోచిస్తున్న విజయ్ ఈ లోకం లోకి వచ్చాడు రియా చేయి స్పర్శ తో……

రియా వైపు ఆశ్చర్యంగా చూశాడు………!

2.భయం…?
విజయ్ రియా వైపు చూసేసరికి రియా నుదురు చెమట తో తడిసిపోయింది….ముఖం లో టెంషన్ స్పష్టంగా కనిపిస్తుంది …..ఇంతలో ఆమె భయపడే విషయం ఏమి జరిగిందో విజయ్ కి అర్థం కాలేదు

“రియా గారు….ఏమైందండి….?”భయపడుతూ అడిగాడు విజయ్……

భయం నిండిన కళ్ళతో అతని వైపు చూసి ఫోన్ వైపు చూపించింది…..ఆమె చూపించిన వైపు చూసిన విజయ్ కి ఫోన్ లో “టార్చర్” అనే పేరు స్క్రోల్ అవుతూ కనిపించింది………

“ఎవరండి….?”అర్థం కానట్టు అడిగాడు విజయ్

ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడం ఆగిపోవడం తో భారంగా గాలి వదిలింది రియా….ఆమె పరిస్థితి విజయ్ కి వింతగా తోచింది….అడగాలో వద్దో సంశయం లో వుండగానే….మరో సారీ ఫోన్ మోగుతుండడంతో కళ్ళు తేలేసింది రియా

“రియా గారు….ఆ ఫోన్ ఇటు ఇవ్వండి….నేను మాట్లాడతాను….”అన్నాడు విజయ్

“ఏం మాట్లాడతారు….?”భయంగా అడిగింది రియా

“ఇంకోసారి అర్థరాత్రి ఫోన్ చేస్తే ఈవ్ టీసింగ్ కేస్ పెట్టి లోపలికి తోయిస్తానని చెబుతాను…”తడుముకోకుండా చెప్పాడు….విజయ్

“అప్పుడు తను నువ్వెవరివి రా అంటాడు…అప్పుడేమి సమాధానమిస్తారు….?”అడిగింది రియా

“నేను మీకు కావాల్సిన వాడ్ని కాబోయే వాడ్ని అని చెబుతాను….”అనుమానంగా చూస్తూ చెప్పాడు విజయ్

ఒక్క నిమిషం అతని చెప్పిన మాటకి ఆశ్చర్యపోయి అతని కళ్ళలోకి చూస్తుండి పోయింది రియా….ఆ కళ్లలో ఎటువంటి కల్మషం లేదు తనని కాపాడాలనే ప్రయత్నం తప్ప………

ఏమీ మాట్లాడకుండా తనవైపే రియా అలా చూస్తుండటంతో అనుమానమొచ్చిన విజయ్ ఏ అందుకుని….”పోని మీ బంధువని చెబుతాను ఇటు ఇవ్వండి….”అన్నాడు

“అమ్మా-నాన్న ఏ అతనితో మాట్లాడమని ఒత్తిడి చేస్తుంటే…..మీరు బంధువు నాతో మాట్లాడొద్దు అని చెబితే తను వింటాడా…..?”అంది నిర్జీవంగా నవ్వేస్తూ రియా

విజయ్ కి ఏమీ అర్థం కాలేదు…”ఏంటండి ఏదేదో మాట్లాడుతున్నారు…ఏమైందో చెప్పండి…….?నాకస్సలు ఎమీ అర్థం కావట్లేదు….”అన్నాడు విజయ్

“ఇది ఇప్పుడు మొదలైన కధ కాదు 13 ఏళ్ళ క్రితం ది…..”అంది రియా డల్ గా

“మీరు చెబుతారా లేదా….?”అడిగాడు విజయ్

చెబుతాను అన్నట్టు తలాడించింది రియా

“చెప్పండి కానీ నాదో షరతు………మీరు మామూలుగా ముందు లా అయిపోవాలి…ఎందుకంటే ఫోన్ రావడం కూడా ఆగిపోయింది……..అదీ కాక…”అని నాంచాడు విజయ్

“హా అదీ కాక?”అదోలా ముఖం పెట్టి అతని వంక చూసింది రియా

“అదీ కాక మీరు మీలా వుంటే చాలా బావుంది……..ఇలా అస్సలు బాలేదు……..”చెప్పాడు విజయ్ నవ్వేసింది రియా

“అది సరే మనం ఈ మీరు – గీరు వదిలేద్దామా…..?”అడిగింది రియా

విజయ్ సరేనంటూ తలూపి…”ముందు నువ్వు స్టోరీ మొదలెట్టు….అసలే 13 ఇయర్స్ బ్యాక్ అంటే మళ్ళీ రావడానికి టైం పట్టింది….. అసలే తెల్లవారే లోగా తిరిగొచ్చాయాలి……”అని విజయ్ అనడం తో………..