రియా – part 1 231

తల కొట్టుకున్నాడు విజయ్….నువ్వు ప్లేట్ సింక్ లో వేశావా….లేక కడిగి పేట్టేశావా అని నేనడగలేదు…..కధలో తర్వాత ఏమైంది అంటున్నా……

రియా:నేను చెప్పే లోపు నువ్వే తొందర పడ్డావ్….అలా కిచెన్ లోంచి ఇలా బయటకి వచ్చాను

విజయ్:లాభం లేదు కానీ…సింపుల్ గా కట్టె కొట్టే తెచ్చే లా చెప్పు రియా

రియా(కోపంగా):అభి…..నన్ను ముద్దు పెట్టుకున్నాడు….ఇంట్లో వాళ్ళని పెళ్ళికి ఒప్పించాడు……ఐ లవ్ యూ చెప్పాడు……స్టోరి అయిపోయింది గుడ్ నైట్ అని చెప్పి అటు తిరిగి కళ్ళు మూసుకుంది

మైండ్ బ్లాక్ అయ్యింది విజయ్ కి………..

విజయ్:రియా…మరీ ఇలానా చెప్పేది….అసలు ఏమైంది చెప్పు……

రియా:నేను చెప్పను……….

విజయ్:సారి……చెప్పు చెప్పు….నువ్వెలా చెబితే అలా వింటాను…కావాలంటే నీ స్టోరీ అయిపోయే దాకా నీ తో పాటు బస్టాండ్ లో వుండయినా సరే వినే వెళ్తాను……సరే నా…..?చెప్పు…….ప్లీస్……….

అని విజయ్ బతిమాలుడుతుండగా సడన్ గా బస్ ఆగింది………..!!!!!!!!

3.ఫ్లాష్ బ్యాక్
బస్ ఒక్కసారిగా అగడం తో విజయ్ – రియా ఒక్కసారిగా ముందుకు చూసి చూసి తిరిగి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు…..

ఇద్దరి ముఖాల్లో ఒకే ఎక్స్ ప్రెషన్…..”ఏమైందా….?”అని ఇన్ ఫాక్ట్ వాళ్ళిద్దరి ముఖాల మీదే కాదు బస్ లో వున్న అందరి ముఖాల్లోనూ అదే ప్రశ్న…..ఆ ప్రశ్న కి సమాధానమిస్తూ డ్రైవర్ కం కండెక్ట ర్ బదులిచ్చాడిలా

“అమ్మా…..బస్ టైర్ పంక్చర్ అయ్యింది…అందరూ కిందికి దిగితే మారుస్తాను…హా అన్నట్టు బలంగా వున్న ఇద్దరు నాకు సాయం పడితే పని త్వరగా పూర్తవుతుంది….”అని చెప్పాడు ఆయన

చేసే దేమి లేక అందరూ కిందకి దిగారు…..ఒక ఇద్దరు సాయం చేయడానికి వెళ్ళారు….వాళ్ళతో పాటు విజయ్ కూడా వెళ్లబోతుంటే….ఆపేసింది రియా…..

“నీ అవతారం ఎప్పుడైన అద్దం లో చూసుకున్నావా…?పుల్ల కి ఫ్యాంటూ చొక్కా తొడిగినట్టు వున్నావు….నీకు ఈ ధీర సాహసాలన్నీ అవసరమా….?”అంది ముఖం మీదే రియా

“మన వంతు సహాయం చేయడం లో తప్పు లేదుగా పైగా మన అవసరం కూడానూ….”అని ముందుకు కదిలాడు విజయ్….