రియా – part 1 231

“ఇవాళ మెయింస్ రిసల్ట్స్ వచ్చాయి…..అభి క్వాలిఫై కాలేదు……అది తెల్సి రూం కెళ్ళి తలుపేసుకున్నవాడు 5 గంటలవుతున్నా బయటకి రాలేదు……పిల్చినా పలకట్లేదు….మీ ఇంట్లో నుంచి వాడి రూం లోకి చూస్తే ఏడుస్తూ కనిపించాడు ఏం చెయ్యాలో అర్థం కాక నిన్ను రమ్మాన్నాము….నువ్వంటే వాడికి చాలా ఇష్టం కదా కనీసం అలా అయినా బయటకి వస్తాడేమొ అని……”గుక్క తిప్పుకోకుండా చెప్పింది ఆవిడ

తను వింటుంది నిజమేనా అనిపించింది రియా కి 300 మార్క్స్ వచ్చే తను క్వాలిఫై కాకపోవడం ఏంటి…?ఎక్కడో ఏదో అయ్యింది……అని అనుకుంటూ తలూపి……అభి రూం కి వెళ్ళి తలుపు తట్టి…..”అభి…”అని పిలవడం ఆలశ్యం రూం తలుపు తెరుచుకుంది………
లోపల వున్న అభి…ఎవరూ రావొద్దు…రియా తప్ప అనేసరికి ఎవ్వరూ లోపలికి వెళ్ళె సాహసం చేయలేదు……

లోపలికి వెళ్ళిన రియా కి అభి కనిపించలేదు…..ఎక్కడున్నాడా అని వెతుకుతుండగా…వెనకి నుంచి రెండు చేతులు రియా ని చుట్టెశాయి ….ఒక్క నిమిషం ఊపిరి ఆగినంత పనయ్యింది రియా కి

విసురుగా అభి నుంచి దూరం జరిగింది…….

“అభి….ఏం చేస్తున్నావ్…?”అంది కోపంగా……..

అభి రియా కి దగ్గరగా రా సాగాడు…రియా వెనక్కి అడుగులు వేయసాగింది…….అభి ముందుకి రియా వెనక్కి జరుగుతూ చివరికి రియా వెనక్కి వెళ్ళే ఆస్కారం లేకుండా గోడ అడ్డం వచ్చేసరికి ఆగిపోయింది……తనకి దగ్గరగా జరిగిన అభి…….తన జుట్టు ని సరి చేయసాగాడు……తన బుగ్గ ని తన చేత్తో తాకుతూ…….”ఐ మిస్ యూ……”అని చెప్పి దూరం జరిగాడు……

అప్పటి దాకా భారంగా తీసుకున్న శ్వాస తేలికపడటం తో ధైర్యం తెచ్చుకుని…..”నువ్వెందుకు క్వాలిఫై అవ్వలేదు…..?”అడిగింది రియా

“బాగా రాయలేదు సొ అవ్వలేదు…”లైట్ గా చెప్పాడు అభి

“అబద్ధం చెప్పకు అభి…..నువ్వు బాగా రాశావ్ నీకు 300 మార్క్స్ వస్తాయ్…నీ పేపర్ నా దగ్గర వుంది….నేను కాలిక్యులేట్ కూడా చేశాను…”అంది రియా