రియా – part 1 231

విజయ్:ఓహ్ పాలవాడా….?

రియా:చా కాదు కాదు…వుదయం లేవగానే నేను సైట్ కొట్టిన అబ్బాయి…మా పక్కింటి కి కొత్తగా వచ్చిన మా నైబర్……తనతో పాటు ఉష అత్త…..కూడా

విజయ్:మధ్యలో ఈవిడ్ ఎవరు…..?

రియా:అదే ఆ అబ్బాయి వాళ్ళమ్మ…..పేరు ఉష… ఆవిడని అలా పిల్చి పిల్చి ఇప్పుడు కూడా అలానే వచ్చేసింది లే……

విజయ్:ఇంతకీ మీ బావ పేరేంటొ….?వెటకారంగా అన్నాడు

రియా:ఏ బావ…?నాకెవ్వరు బావలు లేరే……..ఓహ్ అర్థమయ్యింది ఆ సైట్ కొట్టిన అబ్బాయి పేరే గా..? చెప్తా చెప్తా ఇప్పుడే కాదు….

ఉష అత్త వచ్చి అమ్మతో ఏదో మాట్లాడారు…..నేను నా పాటికి ఉప్మా మేస్తూ వున్నాను……తను మాత్రం మా ఇంట్లో వున్న షెల్ఫ్ లో వున్న మా నాన్న పుస్తకాలు చదవసాగాడు……..

నేను మాత్రం తనని చూసి వీడికి చాలా ఎక్స్ ట్రాలు వున్నాయి అని వెంటనే పసిగట్టెశాను…..

విజయ్:అబ్బబ్బ వాట్ ఏ తెలివి వాట్ ఏ తెలివి….సరే ఆ తర్వాత

రియా:ఆ తర్వాత ఏముంది నేను ఉప్మా తినేశాను…ప్లేట్ సింక్ లో వేసాను…..