రియా – part 1 231

మ్యాడం వచ్చి వాడ్ని చాలా మెచ్చుకుని పేరడిగింది………అప్పుడు తెల్సింది ఆయన గారి పేరు…….అభిమన్యు అని……నేను అడిగినప్పుడు సమాధానం చెప్పకపోయేసరికి నాకు చాలా కోపమొచ్చింది….మధ్యహ్నం మా అమ్మ తో పాటు ఉష అత్త క్యారేజ్ పట్టుకుని వస్తే అడిగేశాను….ఎందుకు అభిమన్యు నాతో మాట్లాడలేదని…….దానికి అత్త చెప్పిన సమాధానం వాడెవరితోనూ మాట్లాడంట వాడి ప్రపంచం వాడిదంట……..

ఇక అప్పుడే నేను డిసైడ్ అయ్యాను…..ఆరు నూరైనా నూరు నూట ఆరైనా వాడ్ని మార్చాలి అని కంకణం కంటుకున్నాను…….

విజయ్:అబ్బా వచ్చిందమ్మా పేద్ద సంఘసంస్కర్త………వీరనారి…….సరే ఆ తర్వాత

రియా:అదే నా కొంప ముంచింది………అవసరం లేకపోయినా వాళ్ళింట్లోనే వుండేదాన్నీ మాట్లాడుతూనే వుండేదాన్ని…..నిద్రపోవడానికి తప్ప ఇంటికి కూడా పోయేదాన్ని కాదు……..ఇంతా చేస్తే వాడు నాతో మాట్లాడిన మొదటి మాట……….!

విజయ్:హా చెప్పు….చెప్పు

రియా:వాడు నార్మల్ గా మాట్లాడకపోయినా టీచర్స్ కి ఆంసర్స్ ఇచ్చేవాడు…….ఒకసారి ఐతే స్నేహితుడు మూవీ లో విజయ్ లాగా 7 వ తరగతి లెక్కలు చేస్తూ మా టీచర్ కి దొరికి పోయాడు……వాళ్ళెమొ అత్తయ్య ని మావయ్య ని పిలిపించి 7 క్లాస్ లో వేయమని చెప్పారు……..

వీళ్ళు కూడా సరే అనుకునే సరికి మా వాడు అడ్డం తిరిగాడు……..నేను వెళ్ళనంటే వెళ్ళనని మారాం చేశాడు…….

ఎందుకు రా అంటే రీసన్ చెప్పడు………అందరూ అడిగి అడిగి విసుగొచ్చి చివరికి వదిలేసారు…….నేను ఒక పెద్ద మనిషి లా వాడి భవిష్యత్తు నా బాధ్యత గా తీసుకుని వాడితో మాట్లాడ సాగాను…….

“అభి ఎందుకు నువ్వు 7 క్లాస్ కి వెళ్లట్ట్లేదు……త్వరగా చదివితే త్వరగా జాబ్ వస్తుంది….ఎంచక్కా నువ్వు 2 ఇయర్స్ కూడా చదవక్కర్లేదు హ్యాపి గా వెళ్ళొచ్చు కదా……?”అడిగాను నేను

తను తల అడ్డంగా వూపాడు………..”పోనీ రీసన్ చెప్పు…”అని అడిగాను నేను……

“ఐ లవ్ యూ ……”అన్నాడు తను…….

విజయ్:ఇలా ఇవ్వు అనుంటాడు…….నీకు పొరపాటున అలా వినిపించి వుంటుంది లే……

రియా:అప్పటికి ‘ మనం’ సినిమా రాలేదు……..అయినా నీకొచ్చినట్టె నాక్కూడా డౌట్ వచ్చింది….”ఏంటి…?”అడిగాను మళ్ళీ….”ఐ లవ్ యూ “అని ఇంకోసారి చెప్పాడు………