రియా – part 1 231

వెనకగా దాచి పెట్టుకున్న తన చేతులని ముందుకు చాపాడు….తన చేతిలో ఏదో వుంది….”అని ఆగింది రియా

విజయ్:లవ్ లెటర్ ఆ….

రియా:కాదు…..నోట్ బుక్…..ఆ నోట్ బుక్ చేతికి అందించి….నువ్వు అస్సలు చదవవు అంట కదా అత్తయ్య చెప్పింది అన్నాడు….అభి

“అత్తయ్యా…?అత్తయ్య ఎవరు…?”అడిగాను నేను

“మీ అమ్మ లే గానీ….ఇవాళ్టి నుంచి నువ్వు చదవకపోతే నేనస్సలు ఊరుకోను…రేపు టెస్ట్ వుంది 10 మార్క్స్ కి ఒక్క మార్క్ తగ్గినా నేనస్సలు ఒప్పుకోను….”అన్నాడు సీరియస్ గా

దానికి నేను…….అని మళ్ళీ ఆగింది రియా

విజయ్:హా నువ్వు….?చెప్పు…..

రియా:అబ్బా….ఇలా నువ్వు నేను చెప్పడం కష్టం గా వుంది…….మాములుగా కధ చెప్పినట్టు చెప్పేస్తా విను…సరేనా…?

విజయ్:ఏదోటి తగలడు లే గానీ త్వరగా చెప్పు

ఇంక రియా చెప్పడం స్టార్ట్ చేసింది…….

“నీకు రేపు ఒక్క మార్క్ తగ్గినా నేనూర్కోనూ….”అన్నాడు అభి

“కానీ రేపు టెస్ట్ 10 మార్క్స్ కే…..మరీ ఒక 5 మార్క్స్ అన్నా జాలి చూపించొచ్చు గా….”అంది రియా బిక్క ముఖం వేసుకుని

“నోర్మూస్కుని చదువు…..హాఫ్ ఎన్ అవర్ లో అడుగుతాను……..”అని చెప్పి స్నానానికి వెళ్లాడు అభి……

చిక్కిందే సందు అని భావించిన రియా మెల్లాగా అభి రూం నుంచి బయటకి వచ్చి ఆ తర్వాత వాళ్ళింటి కి వెళ్ళిపోయింది…….

15 నిమిషాలు గడిచాక…….

స్నానం చేసి వచ్చిన రియా తన రూం లో వున్న అభి ని చూసి కెవ్వు మని అరిచింది……..”నువ్వు ఎందుకు వచ్చావ్………?”అరిచింది రియా

“నీకు మా ఇంట్లో చదవడం ఇష్టం లేదు గా అందుకే….నేనే మీ ఇంటికి వచ్చాను…త్వరగా వచ్చి చదువు….”అని ఆర్డర్ జారీ చేశాడు……..

చేసేదేమీ లేక చదివింది……..9 మార్కులు కూడా తెచ్చుకుంది…….ఆ రోజు నుంచి అభి రియా కి ట్యూటర్ అయిపోయాడు……..పని లో పనిగా అమ్మ వాళ్లు చెప్పడం తో ఒక క్లాస్ కూడా జంప్ చేశాడు…….

ఇలా కాలం భారంగా సాగుతుండగా………

రియా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో వుంది….అభి 2 ఇయర్…..