రియా – part 1 231

అభి కి పక్కాగా ఐ ఐ టి లో సీట్ వస్తుంది అంటే తను ఏ డిల్లీ కో ముంబయ్ కో వెళ్ళిపోతాడు….యాహూ అని ఆనందపడిపోయింది……

రియా వాళ్ళమ్మమ్మ హాలిడేస్ కి రమ్మని ఒత్తిడి చేయడం తో అభి నుంచి అభి టార్చర్ నుంచి దూరంగా వుండొచ్చు అని అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడి అభి కి మాత్రం తెలియకూడదని తెలిస్తే తను ఎక్కడ వచ్చేస్తాడో అని ఉదయం 4:00 గంటల కే బస్ ఎక్కుదామని నిర్ణయించుకుంది…..

“ఇంత పొద్దున్నే ఎందుకే…?”అంది వాళ్లమ్మ

“లేదమ్మా వెళ్లాలి……….అమ్మమ్మ ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా వుంది…”అని చెప్పింది రియా

“ఏంటో నే నువ్వు ఒక్కోసారి ఒక్కోలా వుంటావ్…!సరే పద బయటకి “అని ఇద్దరూ బయటకి నడిచారు…..

వాళ్లిద్దరు బయటకి వచ్చేసరికి అభి గుమ్మం లో బైక్ తో సిద్ధంగా వున్నాడు……షాక్ అయ్యి అలానే చూస్తుండిపోయింది రియా

“మీ నాన్న కి చెబితె ఇంత పొద్దున్నే నా వల్ల కాదన్నారు…అందుకే అభి ని పంపించింది మీ ఉష ఆంటి….”అని చెప్పింది వాళ్లమ్మ

“ఐతే సరే నన్ను బస్టాండ్ లో దింపమను అభి ని….”అభి వైపు చూడకుండా వాళ్ళమ్మ తో చెప్పింది రియా

“అమ్మొ ఇంకేమైనా వుందా పేపర్లో చదవట్లేదా ఏంటి…ఎందుకు తల్లీ రోజులస్సలే బాలేవు……అయినా 2 గంటల ప్రయాణం ఏ కదా…?ఇద్దరూ వెళ్ళి వచ్చేయండి…”అంది వాళ్ళమ్మ

“వెళ్ళి వచ్చేయాలా…అంటే ఏంటి అభి కూడా నాతో పాటు అక్కడ వుంటాడా…?”అనుమానంగా అడిగింది రియా

“హా అవును….అభి కి కూడా రిఫ్రెష్ అయినట్టు వుంటుంది అసలే ఎగ్జాం బాగా రాయలేదని బాధ లో వున్నాడు తను…..”అంది సర్ది చెబుతూ వాళ్ళమ్మ

“అలా ఐతే నేనక్కడికీ వెళ్లను….”అని విసురుగా లోపలికి వెళ్ళి తన గది లోకి అడుగుపెట్టి తలుపేసుకుంది రియా

2 రోజుల తర్వాత…..

ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తా అని చెప్పిన రియా అటు నించి అటు వాళ్ళమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళి అక్కడ నుంచి ఫోన్ చేసి చెప్పించింది………రియా ఎందుకిలా ప్రవర్తిస్తుందో వాళ్ళమ్మ కి అర్థం కాలేదు…..

కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి ఫోన్ రావడం తో తప్పక ఇంటికి బయల్దేరింది రియా…….

ఇంటికి వెళ్ళడం తోనే ఉష అత్త మళ్ళీ వాళ్ళింటి లోకి లాకెళ్లింది రియా ని…….

“బాబోయ్ మళ్ళీ ఏం చేశాడో…”అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది రియా

“ఏమయ్యింది ఆంటి….?”టెంషన్ తట్టుకోలేక అడేగేసింది ఆకరికి