రియా – part 1 231

విజయ్:ఎందుకు ఆగావ్….అడగాల్సింది కదా….?కొంపదీసి చెవుడా ఏంటి?

రియా:నాకూ అదే డౌట్ వచ్చింది….అందుకే ఈసారి అడగకుండా అరిచాను.”నీ పేరు ఏంటి?”అని….దానికి తను సైగ లు చేశాడు……..

విజయ్:అయ్యొ పాపం మాటలు కూడా రావా………?మరీ ఫోన్ ఎందుకు చేస్తున్నాడు ఎలా మాట్లాడతాడంట…?కొంపదీసి నీకు ఫోన్ చేస్తుంది నువ్వు చెప్పేది ఒకరి గురించి కాదా….?

ఈ సారి రియా తల కొట్టుకుంది……..

రియా:ఎందుకంత స్పీడ్ వెనక ఏమైనా కుక్కలు పరిగెడుతున్నాయా….కాస్త తట్టుకోవమ్మా…..ఇక్కడి తో కట్ నాకిప్పుడు ఆకలేస్తుంది…తినేసి తిరిగి విల్ కంటిన్యూ

విజయ్:ఇలా బ్రేక్ లు ఇచ్చుకుంటూ పోతే ఎప్పటికి అవుతుంది నీ 13 ఏళ్ళ లాంగ్ జర్ని…..ఆ ముద్దెప్పుడు వస్తుందో

రియా:ఏంటి….(అంది బిస్కెట్ నములుతూ)

విజయ్:ఏమీ లేదూ నువ్వు ముందు తినమ్మా…….

బిస్కెట్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత……

విజయ్:చెప్పు….తనకి మాటలు రావు కదా

రియా:ఏదో సైగలు చేశాడు నాకర్థం కాలేదు……..ఆ తర్వాత ఇద్దరం కలిసి క్లాస్ లోకి అడుగుపెట్టాం ……..ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ మ్యాడం క్వస్చింస్ అడుగుతుంది………అన్నటికి క్లాస్ లో ఒక్కరే ఆంసర్ చెబుతున్నారు ఆ ఒక్కరూ ఎవరో కాదు నేను సైట్ కొట్టిన దుర్మార్గుడు……..వాడికి చెవుడూ లేదూ మూగా కాదు…….