రియా – part 1 231

5.అలక
స్నానం చేసి టవల్ తో బయటకి వచ్చాడు అభి…అతన్ని అలా చూడగానే బయటకి పరిగెత్తబోయిన రియా చెయ్యి పట్టుకుని తన వైపు కి లాక్కున్నాడు……రియా వెళ్ళి అభి ని గుద్దింది….తన రెండు చేతులతో తనని బంధి చేస్తూ…..ఏంటోయ్ పారిపోతున్నావ్…ఏదో తెల్చుకుందామని వచ్చినట్టున్నావ్…తేల్చుకుని పో……అన్నాడు…..

“నేను ఏమీ తేల్చుకోడానికి రాలేదు….నన్నొదిలేస్తే నేనెళ్ళిపోతాను………”అంది రియా

“అవునా సరే వెళ్ళిపో…”అని వెంటనే వదిలేసాడు అభి……అతను అలా వదిలేస్తాడని ఊహించని రియా అలానే అతన్ని చూస్తూ నిల్చుండిపోయింది…

“ఓయ్ మొద్దు వదిలేసాను….ఇక పో…”అన్నాడు అభి

ఈ లోకం లోకి వచ్చిన రియ వెంటనే బయటకి పరిగెత్తింది………

“దేవుడా ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది…….”అనుకుంటూ ఇంట్లోకి నడిచింది…కానీ అభి మీద కోపం మాత్రం పోలేదు…….

సమయం దొరికినప్పుడు అడగాలి అనుకుని సమయం కోసం ఎదురు చూడసాగింది……..అనుకున్నట్టు గానే సమయం రానే వచ్చింది…….

ఒకరోజు రియా అభి రూం లోకి వెళ్ళగానే ఏదో రాస్కుంటూ కనిపించాడు అభి….

ఇదే కరెక్ట్ టైం అని భావించిన రియా లోపలికి అడుగుపెడుతూనే……లోపలికి వస్తున్న రియా ని చూసిన అభి బుక్ మూసేశాడు….

రియా కి అనుమానం వచ్చినా తను వచ్చిన మ్యాటర్ అది కాదని గ్రహించి……..

“అభి నీతో కొంచెం మాట్లాడాలి…”అంది

“హా చెప్పు రియా….”అన్నాడు అభి తన వైపు చూస్తూ