రియా – part 2 68

“అభి లేడే….2 డేస్ నుంచి కనిపించట్లేదు….”అని వాళ్ళమ్మ చెప్పేలోపే…..గేటు దాటేసింది రియా

అభి వాళ్ళింట్లోకి వెళ్తూనే “ఆంటీ…” అని అభి వాళ్లమ్మని చుట్టెసింది రియా

“పోవే….వైజాగ్ పోవడం తెల్సుగానీ మాట మాత్రమైనా చెప్పాలని కూడా లేదు……”అంది ఉష

“అయ్యొ ఆంటీ….ఏంటి మిస్ అయ్యారా ఏంటి…?”అంది రియా

“మరి అవ్వరా….?”అంది ఆవిడ

“అవునా…పోనీ ఒక పని చెయ్యండి……..మీ అబ్బాయి కి నన్నిచ్చి పెళ్ళి చెయ్యండి…అప్పుడు ఎంచక్కా అత్తయ్య గారూ అత్తయ గారూ అంటూ మీ వెనకాలే తిరుగుతాను….”అని అనేసి అభి రూం వైపు వెళ్ళబోతుండగా…..

“నీ మొగుడు లేడమ్మా…..”అనేసింది ఆవిడ….

“అవునా….మా ఆయన్ని ఎక్కడికి పంపించావ్…?”అంది రియా

“నేనక్కడికి పంపించలేదు తల్లీ వాడే…ఇల్లు దాతి బయటకి కదలని వాడు ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్ళాడు ఇంకో వారం దాకా రాడు….”అని చెప్పింది ఉష

“అవునా…సర్లే అందాకా…వాడి రూం లో ల్యాపీ వుందిగా దానితో కాలక్షేపం చేస్తా…”అని అభి రూం కి వెళ్ళింది రియా

లోపలికి అడుగుపెట్టి…తన బెడ్ పై వున్న ల్యాపి ని తీసింది…….ఓపెన్ చేసి…..చూస్తే అభి ఐడి కి పాస్ వర్డ్ అడుగుతుంది…….పాస్ వర్డ్ ఏం పెట్టుంటబ్బా…అని ఆలోచిస్తూ…టైప్ చేయసాగింది…సరిగ్గా ఫస్ట్ ఎట్మంట్ లోనే ఓపెన్ అయ్యి వాల్ పేపర్ గా రియా ఫోటో ప్రత్యక్షమయ్యింది……కళ్లలోంచి నీళ్ళు….తనకి తెలియకుండానే వచ్చేసాయి……ఇంతకి ఆ పాస్ వర్డ్ ఏంటో తెలియదు కదా…..????? I LOVE YOU RIYA……..

తన ఫైల్స్ సర్చ్ చేస్తుండగా….డైరి అనే ఫోల్డర్ లో ఏవో వాయిస్ ఫైల్స్ కనిపించాయి…….

వెంటనే అభి లాస్ట్ రికార్డ్ చేసిన ఫైల్ ఓపెన్ చేసి వినసాగింది రియా

“మోసం…కుట్ర….ఇన్నాళ్ళు…ఫ్రెండ్ అయినా …..లవర్ అయినా…భార్య అయినా ….నువ్వే అనుకుని బతికాను కదే…….కానీ ఇంత మోసం ఎలా చెయ్యాలని పించింది…….ఒక్కసారి వేరే వాడి ప్రపోసల్ కి ఒకే చెప్పేటప్పుడైనా ఇన్నేళ్ళ నా పిచ్చి ప్రేమ గుర్తుకు రాలేదా……?ఎందుకే ఇంతలా మోసం చేశావ్…..నువ్వే ప్రాణం లా బతికిన నాకు ఇదేనా నువ్వు నాకిచ్చే బహుమతి……?ఐ హేట్ యూ రియా…….ఐ రియల్లీ హేట్ యూ……..”

అంతకు మించి ఒక్క పదం కూడా వినలేకపోయింది రియా…….ఏడుస్తూ……బయటకి వచ్చేసింది…..

తనకి ఎదురయ్యాడు అభి…….రియా ని చూడగానే ఆనందం తన కళ్ళలో కన్నీళ్ళు ఎందుకో అర్థం కాలేదు……..

వెంటనే తన వెంట పరిగెత్తాడు అభి…….

“రియా…రియా…ఏమైంది ఎందుకేడుస్తున్నావ్…….?”అడిగాడు అభి…..

కోపంగా ఒక్క చూపు చూసి వెళ్ళిపోయీంది రియా

అభి కి ఏమీ అర్థం కాలేదు……..తన రూం కెళ్ళి చూసిన అభి కి విషయం అర్థమయి పోయింది………

6 నెలల తర్వాత…….

ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంది రియా……..”అభి తో మాట్లాడాలి…….”అని నిశ్చయించుకుని అలా లేచింది….ఇంతలో తనకి తన ఫ్రెండ్ రాజి నుంచి కాల్ వచ్చింది…..

2 Comments

  1. Anna continue ramuku autograph plz plz,ramu jareena dengudu affair ramu Anitha tho dengudu ramu manasa Pragathi anjali deepika lago sex encounters rayandi plzzz continue ramulu autograph

Comments are closed.