రియా – part 2 68

“ఎట్టి పరిస్థితుల్లో…నేనివాళ రియా తో మాట్లాడతాను…ఆ అబ్బాయి తో మాట్లాడొద్దని చెప్పేస్తాను….”అని నిశ్చయించుకున్న అభి……కాలేజ్ అయిపోయాక బస్టాప్ కి వెళ్లాడు……రియా ఆటో కోసం వెయిట్ చేస్తూ కనిపించింది..ఆలస్యం చేయకుండా తన దగ్గరికి వెళ్లి…..

“రియా నీతో ఒక విషయం మాట్లాడాలి…”అన్నాడు అభి

“చెప్పండి అభిమన్యు గారు..”అంది చేతులు ముడుచుకుంటూ

తన పిలుపుకి బాధపడినా తనని తాను తమాయించుకుని……”నువ్వు ఆ వినయ్ తో మాట్లాడకు…..”అన్నాడు అభి

“ఏ…?ఎందుకు మాట్లాడకూడదు…….”అడిగింది రియా

“తను నీకు ప్రపోస్ చేశాడు….నువ్వు నోచెప్పి ఇప్పుడు మాట్లాడుతుంటే…..తను అడ్వాటేజ్ తీసుకోడా…?అడిగాడు అభి

“నో చెప్పానని నీకు చెప్పానా……?”ఎదురు ప్రశ్నించింది రియా

అలానే తన్ వైపు చూస్తుండిపోయాడు అభి తను వింటుంది నిజమొ కాదో తేల్చుకోలేక…….!!!!!

7 & 8.డ్రామా+డ్యాంస్

తను చెప్పింది విని షాక్ లో వుండగానే…..తనే అందుకుని మళ్ళీ చెప్పింది రియా

“అయినా నువ్వు షాలిని తో మాట్లాడినప్పుడు లేనిది నేను వినయ్ తో మాట్లాడినప్పుడు వచ్చిందా….?”అడిగింది రియా

“షాలిని ని మధ్యలో తీసుకు రాకు….”అన్నాడు అభి సీరియస్ గా

“అహా…కోపమే…..ఆ అమ్మాయి ని అంటె నీకెందుకు అంత కోపమొస్తుంది…….?”అంది రియా

“రియా…..ఆ షాలిని మా క్లాస్ షాలిని ఒక్కరు కాదు…అసలు చెప్పాలంటే తను నేనే….నీకు కోపమొచ్చి తనతో మాట్లాడద్దు అని నువ్వు చెబితే నువ్వు వినయ్ తో మాట్లాడొద్దు అని చెబుదామని ఆ ఎకౌంట్ క్రియేట్ చేసి ఒక పక్క షాలిని లా ఫోన్ లో మరో పక్క ల్యాప్ టాప్ లో నాలా చాట్ చేస్తున్నాను…లాస్ట్ ఎగ్జాం రోజు నువ్వు నా రూం కొచ్చినప్పుడు నేను వాష్ రూం లో వుండి ఆ “ఐ లవ్ యూ” మెసేజ్ పెట్టాను….ఇదంతా కనీసం నువ్వు నాతో మాట్లాడతావనే హోప్ తో చేశాను…కానీ వినయ్ విషయం అలా కాదు…..”అన్నాడు అభి

“సో……అబ్బద్దాలు కూడా ఆడుతున్నారన్నమాట తమరు మా దగ్గర……ఇప్పుడు చెబుతున్నా విను…..నేను వినయ్ తో మాట్లాడడం ఆపను…..ఎందుకంటే…నేను తన ప్రపోసల్ ని …”అని ఏదో చెబుతుండగా అక్కడికి వచ్చిన వినయ్ “హాయ్ రియా అక్కా…”అన్నాడు వినయ్

“వచ్చెశాడు ఎదవ….కరక్ట్ టైం కి వూడిపడ్తాడు………”అని తల కొట్టుకుంది రియా

వినయ్ నోట్లోంచి “అక్కా ” అన్న మాట వినపడటం తో వినయ్ ముఖం లో ఒక వెలుగొచ్చి చేరింది…….వినయ్ ని పట్టుకుని “ఏమన్నావ్…?”అన్నాడు అభి

“అక్కా…అన్నాను…ఏమయ్యింది సార్…”అన్నాడు వినయ్

2 Comments

  1. Anna continue ramuku autograph plz plz,ramu jareena dengudu affair ramu Anitha tho dengudu ramu manasa Pragathi anjali deepika lago sex encounters rayandi plzzz continue ramulu autograph

Comments are closed.