రియా – part 2 68

“ఏంటి…ఏం చేశావ్ రియా అభి అలా మాట్లాడుతున్నాడు…?”అడిగాడు విజయ్…….

“బహుశా తనకి నా డైరి దొరికి వుండొచ్చు………”అంది రియా

“సరే రియా తనంతలా ప్రేమిస్తుంటే ఒక్కసారి కూడా నీకు ప్రేమించాలనిపించలేదా…?”అడిగాడు విజయ్

“లేదు….అని చెప్పను కానీ కరెక్ట్ గా అనిపించేసరికి నా సోల్ మేట్ నాకు ఎదురయ్యాడు”అంది రియా

“వాట్ ?”షాక్ లో వుండిపోయాడు విజయ్

“హా చూస్తావా నా సోల్ మేట్ ని………?”అని సెల్ ఓపెన్ చేసింది……తన గ్యాలరీ లో వున్న పిక్ ని చూపించింది……..!!!!!!!

12.ఇది నిజమేనా?!

గ్యాలరీ లోని ఫోటోని చూస్తూనే షాక్ గురయ్యాడు విజయ్…….

మరి షాక్ అవ్వడా…ఆ పిక్ ఎవరిదో కాదు…విజయ్ దే………”రియా…….?ఏంటిది….తమాషా గా వుందా…?”అడిగాడు విజయ్

“లేదు……విజయ్ ఇది నిజమే…..నేను మీ ఆఫీస్ కి ఇంటర్వూ కి వచ్చినప్పుడే నిన్ను చూసి లవ్ చేశాను………ఆ తర్వాత నిన్ను ఫాలో కూడా అయ్యాను….నా ప్రేమ జస్ట్ అట్రాక్షన్ కాదని నాకప్పుడే తెల్సింది….ఐ రియల్లీ లవ్ యూ….”అని రియా అలా విజయ్ కి ప్రపోస్ చేసింది…ఇలా బస్ బస్టాండ్ లో ఆగింది……..

రియా కి ఏమి సమాధానం చెప్పాలో తెలియక లేచి తన బ్యాగ్ తీసుకుని బస్ దిగేశాడు విజయ్…..విజయ్ వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది రియా……

*****

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే……..

విజయ్ బీటెక్ లో వుండగానే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు……అది ఒక 3 మంథ్స్ లోనే బాగా పాపులర్ అయ్యింది…..ఈ లోపల తనకి అమెరికా లో ఎం.ఎస్ చదివే ఛాంస్ రావడం తో బిజినెస్ వాళ్ళ నాన్నగారికి అప్పగించి తను అమెరికా వెళ్ళిపోయాడు…….ఆ తర్వాత వచ్చాక…..తన బిజినెస్ కాక వాళ్ల నాన్న బిజినెస్ చూస్కుంటుండగా……వాళ్ల నాన్న చెప్పారు….తన బిజినెస్ ఏ కంటిన్యూ చేయమని…కానీ విజయ్ కి ఇంట్రెస్ట్ లేక వాళ్ళ నాన్న గారి బిజినెస్ లో ఒక బ్రాంచ్ ని చూసుకుంటున్నాడు…….

ఇలా ఒక సంవత్సరం గడిచింది……..

ఎప్పటి లాగే ఆరోజు కూడా……ఆఫీస్ కి వచ్చాడు విజయ్……మనసంతా ఏదోలా వుంది……సో వర్క్ ని ఇంస్పెక్షన్ చేస్తూ అలా తిరుగుతుండగా…….ఎవరివో మాటలు వినిపించి అటు వైపు తిరిగి చూశాడు…..

5 ఫీట్ 4 ఇంచెస్ వున్న అమ్మాయి…….కాటుక దిద్దిన కళ్ల తో……ముక్కు కు చిన్న ముక్కెర తో…..ముఖం మీద చిరునవ్వు తో రిసెప్షనిస్ట్ ని తిడుతుంది……..ఏదొ పేపర్ చూపిస్తూ……….

ముఖం మీద చిరునవ్వుతో కూడా కోప్పడొచ్చు అని విజయ్ కి అప్పుడే అర్థమయ్యింది……ఆమెని అలానే చూస్తుండిపోయిన విజయ్…….ఆమె బయటకి నడిచిన మరుక్షణం రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి…ఏంటి సంగతి అని అడిగారు……

వాళ్ల కంపెని లో వేరే బ్రాంచ్ కి ఎంప్లాయిస్ కావాలి అని వచ్చిన అడ్వర్టైజ్ మెంట్ చూసి తను ఇక్కడికి వచ్చిందని…అడ్రెస్ ఇది కాదని చెప్పి పంపించానని చెప్పింది రిసెప్షనిస్ట్……..

“ఇంతకి తను…..ఏ బ్రాంచ్ కి వచ్చింది……?”అడిగాడు విజయ్…….రిసెప్షనిస్ట్ చెప్పిన సమాధానం తో తను మళ్ళీ తన బిజినెస్ కి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుని……హడావిడిగా తన పాత ఆఫీస్ కి వెళ్లాడు……విజయ్ వెళ్ళెసరికి తను రిసల్ట్ కోసం వెయిట్ చేస్తుంది……..

వడివడిగా మ్యానేజర్ రూం కి వెళ్ళిన విజయ్….

“మేనజర్ గారు ఆ అమ్మాయి సెలక్ట్ అయ్యిందా…?”అని అడిగాడు విజయ్ ఆ అమ్మాయి ని చూపిస్తూ

“హా అయ్యింది సార్….”చెప్పాడాయన….

ఇక విజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి……..

అలా తను ఇంకో నెల రోజుల్లో జాయిన అవుతుంది అని తెల్సుకుని…..ఆ కంపెని కి మారిపోయాడు విజయ్….

2 Comments

  1. Anna continue ramuku autograph plz plz,ramu jareena dengudu affair ramu Anitha tho dengudu ramu manasa Pragathi anjali deepika lago sex encounters rayandi plzzz continue ramulu autograph

Comments are closed.