రియా – part 2 68

రూం లో విక్కి లేడు వాష్ రూం కి ఏమైనా వెళ్ళాడెమో అని చెక్ చేస్తే అక్కడ కూడా లేడు….ఇల్లంతా వెతికినా కూడా విక్కి కనిపించకపోయేసరికి తన రూం లో వున్న మొబైల్ కోసం వెళ్ళాడు……

ఫోన్ చేస్తే విక్కి ఎత్తట్లేదు……”ఏమయిపోయాడు వీడు….”అని బయటకి వచ్చి వాచ్ మెన్ ని అడిగేసరికి …అతను ఇంట్లోంచి ఎవరూ వెళ్లలేదు అని చెప్పాడు……..
ఇంతలో విజయ్ ఫోన్ రింగ్ అయ్యింది…

ఫోన్ ఎత్తుతూనే….”రేయ్ ఎదవ ఎక్కిడికి వెళ్ళావ్….?”అన్నాడు విజయ్

“అది నిద్రపట్టకపోతేనూ….బయటకి వచ్చాను…వచ్చేస్తాను లే నువ్వు మరీ సి ఐ డి లా ఎంక్వయిరీ లు చెయ్యకు….అన్నట్టు ఆ వాచ్ మెన్ నేను బయటకి వెళ్లడం చూడలేదు……సో నువ్వు అనవసరంగా అనుమానాలు పెట్టుకోకు…నేను వచ్చేస్తాను…నువ్వేల్లి బొజ్జొ…”అని రెండొ మాట కి తావివ్వకుండా ఫోన్ పెట్టేశాడు విక్కి

“సర్లే…”అని మనసులో అనుకుని తన రూం కెళ్ళి పడుకున్నాడు విజయ్….

మరుసటి వుదయం…..సమయం 6:00 గంటలు….

జాగింగ్ కోసం హాస్టల్ నుంచి బయటకి వచ్చింది రియా….

అలా పక్కనున్న పార్క్ లోకి వెళ్ళి….ఒక 5 రౌండ్లు వేసిన పిమ్మట……అలసిపోయి రొప్పుతుంది….

ఎదురుగా ఒక చెయ్యి బాటిల్ తో ప్రత్యక్షమయ్యింది…..

ఎవరా అది అన్నట్టు చూసింది రియా….ఎదురుగా బాటిల్ పట్టుకుని నిల్చున్నాడు విక్రాంత్….

తన ముఖం చూడ్డం తోనే పక్కకి వెళ్తున్న రియా చెయ్యి పట్టుకుని ఆపాడు విక్రాంత్…..జాగింగ్ చేసి అలసి పోయినట్టున్నారు రియా గారు….నీళ్ళు తాగండి…అన్నాడు విక్రాంత్

తల అడ్దంగా వూపి…చెయ్యి విదిలించికోబుతుండగా రియా చేతి పై పట్టు బిగించాడు విక్రాంత్

2 Comments

  1. Anna continue ramuku autograph plz plz,ramu jareena dengudu affair ramu Anitha tho dengudu ramu manasa Pragathi anjali deepika lago sex encounters rayandi plzzz continue ramulu autograph

Comments are closed.