రియా – part 2 68

“వెతకని వరమై దొరికావు కానీ నీ మౌనం తో బాధ పెడుతున్నావ్…నీ పై నా ప్రేమ తెలపడానికి మాట లు రాని నిస్సహాయత లో వున్న నాకు కొంచెమైనా జాలి చూపించవా ప్రియా….నిన్ను చూసినప్పుడు ఎన్నో భావాలు…..నువ్వు మదిలో మదిలితే ఎన్నో స్మృతులు…..నువ్వు నా కళ్ళ ముందుకొస్తే రెట్టింపయ్యే నా హృదయ స్పందన……నీ పై వున్నది ప్రేమ కాదు ప్రియా పిచ్చి…….ఈ పిచ్చి లో ఏమైపోతాను అనే దిగులు లేదు….ఎవరూ నాతో వుండరేమో అనే భయం లేదు….నా గమనం ఎటు వైపో అనే చింత లేదు……ఎందుకంటె నా గమ్యం నువ్వైనప్పుడు……నాకెందు భయం….నేను నువ్వైనఫ్ఫుడు నాకెందుకు బాధ…?”అని అంటూ అభి అక్కడిక్కడే కుప్పకూలిపోతాడు……ఎదురుగా వున్న ప్రియా(అలియాస్ రియా) కంగారుగా అతన్ని పట్టుకుని…”అద్వయ్(హీరొ పేరు) ఏమయింది నీకు…?”అంటుంది……..

“నా గమ్యం నీవని తెల్సుకున్న నేను…నీ గమ్యం నేను కాదని తెలియడానికి ఇంత కాలం పట్టింది…ప్రియా……అందుకే జీవితం లొ ఒక ప్రేమ మాత్రమే వుండాలి అది నువ్వే అవ్వాలి…అందుకు నువ్వొప్పుకోవు…….నిన్ను మర్చిపోయి నేనుండలేను……నిన్ను ఒప్పించలేని నేను నిన్ను నొప్పించలేక విషం తాగాను…….ఇక సెలవు…”అని అలా పడిపోతాడు…….అతని గుండెల పై రోదిస్తూ ప్రియా కూడా కన్నుమూస్తుంది………

ఆడిటోరియం అంతా కరతాళ ద్వనులతో మారు మోగిపోయింది…….

(రిహార్సల్స్ లో అబి పర్ఫామెంస్ నచ్చి…..లాస్ట్ కి కూడా తనే కంటిన్యూ చెయ్యమనే సరికి……..ఇలా రిహార్సల్ కాస్తా లైవ్ ఫర్మామెంస్ అయ్యింది)

ఆ తర్వాత…డ్యాంస్…..

ఎలాగో అందులో మెయిన్ అభి-రియా నే కాబట్టి…..ఆ సాంగ్ కూడా వాళ్ళిద్దరూ దుమ్ము దులిపేశారు…….

పెర్ఫామెంస్ ముగుంచుకుని కిందకి దిగుతుండగా రియా కాలు స్లిప్ అయ్యి కిందపడింది…వెంటనే వెనక వున్న అభి……తన కాలు పట్టుకున్నాడు….

నొప్పి తో విల విల్లాడింది రియా……తన నొప్పి ని చూడలేని అభి కళ్లలో నీళ్ళు తిరిగాయి……తను లేచే స్థితిలో లేకపోవడం తో అభి ఎ తనని మోసుకుని ఒక రూం లోకి తీసుకెళ్ళాడు…..ఆయిట్మెంట్ రాస్తూ ఏడుస్తున్న అభి ముఖాన్ని…తన చేత్తో పైకి లేపి….

“అభిమన్యు గారు కూడా ఏడుస్తారా….?”అంది రియా

తన మాటాలేమి పట్టించుకోకుండా ఏడుస్తూనే ఆయిట్మెంట్ రాయసాగాడు అభి…..

“ఛీ ఛీ అబ్బాయిలు ఏడుస్తారా….?వెరీ చీప్ వెరీ చీప్..”అని ఆట పట్టించసాగింది రియా

ఆ మాటకి తన కళ్లలోకి చూశాడు అభి…”ఏ…మేము మనుషలం కాదా?మాకు ఫీలింగ్స్ వుండవా…?”అన్నాడు అభి…

“వామ్మొ…..అబ్బాయిలని అనేసరికి పౌరుషం బానే పొడుచుకొచ్చిందే……”అని అంటుండగా తిరిగి ఆయింట్ మెంట్ రాయసాగాడు అభి……

“అమ్మా……..”అరిచింది రియా……..”ఓ…సారి…”మెల్లగా చెప్పాడు అభి…

“సారీ చెబితే నొప్పి పోతుందా….?”అడిగింది రియా

“మరి ఏం చేస్తే పోతుంది…?”అర్థం కాక అడిగాడు అభి….ఆ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్నట్టు గా వెంటనే ముందుకి వంగి అభి ని గట్టిగా చుట్టేసింది రియా…..

షాక్ లో వుండిపోయాడు అభి…..?!

9.ఊపిరాపకే….

షాక్ లో వుండిపోయిన అభి…..ముందు చిటెకేస్తూ….”ఓయ్…ఏమైందండి అభిమన్యు గారు…ఊహల్లో కి వెళ్ళారు…?”అడిగింది రియా

తనది ఊహ అని తెలిసిన మరుక్షణమే….ఒకింత నిరుత్సాహానికి గురయ్యాడు అభి…..

2 Comments

  1. Anna continue ramuku autograph plz plz,ramu jareena dengudu affair ramu Anitha tho dengudu ramu manasa Pragathi anjali deepika lago sex encounters rayandi plzzz continue ramulu autograph

Comments are closed.