రియా – part 2 68

కానీ ఆ అమ్మాయి రెండు రోజుల్లో జాయిన్ అవుతుంది అనగా విజయ్ కి అర్జెంట్ మీటింగ్ వుండి వేరే వూరు రావడం తిరుగు ప్రయాణం లో కార్త పాడవ్వడం తో తను బస్ ఎక్కడం అక్కడ్ తను మొదటి చూపులోనే ప్రేమించిన రియా తన పక్కనే కూర్చోవడం….తన పాస్ట్ చెప్పడం……..చివరికి విజయ్ ఏ తన సోల్ మేట్ అనడం అన్నీ జరిగిపోయాయి………

*******

తన కార్ లో వెళ్తున్న విజయ్ కి ఏమీ అర్థం కాలేదు…..రియా తనని ప్రేమించడం ఏంటి……?రియా ని అంతగా ప్రేమించిన ఆ అభి ఎవరు……?అసలు తనెలా వున్నాడొ…..!!!!!అని ఆలోచిస్తూ ఇంటికి చేరాడు విజయ్*****

ఇంటికి చేరిన అభి తన రూం లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు……..తన రూం లోనే వున్న ఒక సీక్రెట్ రూం లోకి వెళ్ళాడు……ఎటు చూసినా గోడల నిండా రియా ఫోటోలే……..వాటినే చూస్తూ……..అలానే కూలబడిపోయాడు అభి………

ఎంత ఏడ్చినా మనసులోని బాధ తగ్గట్లేదు……

“నే చేసిన తప్పేంటి……ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించడమా…?అసలు నా నేరమేంటి….నువ్వు లేని నన్ను ఊహించుకోలేకపోవడమా….?ఉరిశిక్ష పడ్ద ఖైది ని కూడా ఆఖరి కోరిక తీర్చే ఉరితీస్తారే……..అలాంటిది నిన్ను ప్రేమించిన నాకు నువ్విచ్చిన బహుమానం ఇదేనా?????నీతో కలిసి బతకాలి అని ఎన్నేళ్ళ నుంచి కలలు కన్నాను……?ఆ కలల్లొనే ఇన్నేళ్ళు బతికాను……ఏ నువ్వంటే నాకు పిచ్చి అని నీక్కూడా తెల్సు గా…ఒక్క మాట నువ్వంటే నాకిష్టం లేదని చెప్పాల్సింది,….వినకపోతే కొట్టాల్సింది……అలా కాకుండా….ఇలా నానుంచి దూరం గా ఎందుకు వెళ్ళిపోయావ్………కనీసం నీ ముఖం చూసే అర్హత కూడా నాకు లేదా రియా………?ఎందుకు రియా….?బతకడానికి ఆశ వి నువ్వై నిలిచి చివరికి నాకు బతుకే లేకుండా చేసావ్………నేనింక ఎవరి కోసం బతకాలి…..?ఎందుకోసం బతకాలి అని అక్కడున్న కత్తి ని చేతిలోకి తీసుకున్నాడు……….చివరి సారిగా రియా ఫోటో వైపు చూశాడు………..!!!!!!

****

“ఈ విక్రాంత్ ఏంటి ఫోన్ ఎత్తడు…….?”అప్పటికే పది సార్లు కాల్ చేసి విసుగొచ్చిన విజయ్ మనసులో అనుకోసాగాడు……..

ఇలా కాదని వాళ్ల అమ్మ కి కాల్ చేసాడు విజయ్

“హలో ఆంటీ…విక్కి కి కాల్ చేస్తుంటే ఎత్తట్లేదు కాస్త ఇస్తారా….?”అని విజయ్ అడగడం తో…..”హా సరే …”అని విక్కి రూం కి వెళ్ళిన ఆవిడ గావు కేక తో విజయ్ కంగారు పడ్డాడు……

“హలో ఆంటీ ఏమయ్యింది….?”అని అరిచాడు

ఇంతలో విక్కి ఫోన్ తీసుకుని…….”ఏం కాలేదు లే రా….అమ్మ నా అవతారం చూసి అరిచింది…”అన్నాడు విక్కి

“ఓహ్ అబ్బాయ్ ఎప్పుడొస్తున్నావ్…నీ రాక కై నా కంపెనీ భర్త కోసం ఎదురు చూస్తున్న భార్య లా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది……..”అన్నాడు విజయ్

“వచ్చేస్తున్నా…….నాక్కూడా ఇక్కడ ఏమీ బాలేదులే……”అన్నాడు విక్కి

**********

తన ఫోన్ లోని పిక్ చూస్తూ “ఐ లవ్ యూ సో మచ్…….”అంది రియా!!!!!!

2 Comments

  1. Anna continue ramuku autograph plz plz,ramu jareena dengudu affair ramu Anitha tho dengudu ramu manasa Pragathi anjali deepika lago sex encounters rayandi plzzz continue ramulu autograph

Comments are closed.